ఉప్పల్ స్టేడియంలో డాల్ఫిన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ భారీ స్కోరు సాధించింది.
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను మరోసారి చాంపియన్స్ లీగ్ కనువిందు చేసింది. సోమవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో డాల్ఫిన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ భారీ స్కోరు సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కోల్కతా.. రాబిన్ ఊతప్ప (55 బంతుల్లో 85), మనీష్ పాండే (47 బంతుల్లో 76) అజేయ మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
డాల్ఫిన్స్ బౌలర్లు అలెగ్జాండర్, ఫ్రిలింక్ చెరో వికెట్ తీశారు.