హైదరాబాద్: చాంపియన్స్ లీగ్లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్లతో లాహోర్ లయన్స్పై ఘనవిజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా ఆరు వికెట్ల నష్టానికి మరో మూడు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు గంభీర్ (60), రాబిన్ ఊతప్ప (46) చెలరేగి వంద పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించి జట్టు విజయానికి బాటలు వేశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లాహోర్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లెకు 151 పరుగులు చేసింది. షెజాద్ (59) హాఫ్ సెంచరీతో పాటు ఉమర్ అక్మల్ (40) రాణించాడు. కోల్కతా స్పిన్నర్ సునీల్ నరైన్ (3/9) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
గౌతీ మెరుపులు.. నరైన్ మ్యాజిక్
Published Sun, Sep 21 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement
Advertisement