నరైన్ మ్యాజిక్ | Narain Magic | Sakshi
Sakshi News home page

నరైన్ మ్యాజిక్

Published Mon, Sep 22 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

నరైన్ మ్యాజిక్

నరైన్ మ్యాజిక్

సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండు టి20 మ్యాచ్‌ల్లో నాలుగు ఓవర్ల కోటాలో 9 పరుగుల చొప్పున మాత్రమే ఇవ్వడం ఎవరికైనా సాధ్యమా..? సునీల్ నరైన్‌కు మాత్రమే సాధ్యం. తానెంత విలువైన బౌలరో నిరూపిస్తూ నరైన్ (3/9) మ్యాజిక్ చేయడంతో చాంపియన్స్ లీగ్ టి20లో కోల్‌కతా వరుసగా రెండో విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్లతో లాహోర్ లయన్స్‌పై గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.  షహజాద్ (42 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ఉమర్ అక్మల్ (24 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. కేకేఆర్ బౌలర్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. కోల్‌కతా 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసి విజయాన్నందుకుంది. గంభీర్ (47 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఉతప్ప (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. కానీ 47 పరుగుల వ్యవధిలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది.  సూర్యకుమార్ (5 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.
 స్కోరు వివరాలు: లాహోర్ లయన్స్ ఇన్నింగ్స్: జంషెద్ (రనౌట్) 10; షహజాద్ (సి) ఉతప్ప (బి) చావ్లా 59; హఫీజ్ (సి) రసెల్ (బి) కుల్దీప్ 9; ఉమర్ అక్మల్ (సి) గంభీర్ (బి) కమిన్స్ 40; నసీమ్ (సి) సూర్యకుమార్ (బి) నరైన్ 0; సిద్దిఖ్ (ఎల్బీ) (బి) నరైన్ 2; రజా (బి) నరైన్ 0; రియాజ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151.
 వికెట్ల పతనం: 1-50; 2-75; 3-91; 4-98; 5-103; 6-103; 7-151. బౌలింగ్: కమిన్స్ 4-0-38-1; రసెల్ 4-0-38-0; చావ్లా 4-0-35-1; నరైన్ 4-1-9-3; కుల్దీప్ 4-0-21-1.
 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) రసూల్ 46; గంభీర్ (బి) ఇక్బాల్ 60; బిస్లా (సి) అక్మల్ (బి) చీమా 6; పఠాన్ (సి) రియాజ్ (బి) చీమా 11; డస్కటే (ఎల్బీ) (బి) రియాజ్ 12; సూర్యకుమార్ (నాటౌట్) 14; రసెల్ (సి) రసూల్ (బి) రజా 1; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 153.
 వికెట్ల పతనం: 1-100; 2-113; 3-115; 4-135; 5-146; 6-147. బౌలింగ్: హఫీజ్ 3-0-23-0; రజా 1.3-0-10-1; చీమా 4-0-42-2; రియాజ్ 4-0-25-1; రసూల్ 4-0-28-1; ఇక్బాల్ 3-0-25-1.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement