హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను మరోసారి చాంపియన్స్ లీగ్ కనువిందు చేసింది. సోమవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో డాల్ఫిన్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 36 పరుగులతో ఘన విజయం సాధించింది.
188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన డాల్ఫిన్స్ పూర్తి ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేయగలిగింది. కోల్కతా బౌలర్లు నరైన్ మూడు, యూసుఫ్ పఠాన్ రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కోల్కతా.. రాబిన్ ఊతప్ప (55 బంతుల్లో 85), మనీష్ పాండే (47 బంతుల్లో 76) అజేయ మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డాల్ఫిన్స్ బౌలర్లు అలెగ్జాండర్, ఫ్రిలింక్ చెరో వికెట్ తీశారు.
చాంపియన్స్ లీగ్-20: కోల్కతా ఘనవిజయం
Published Mon, Sep 29 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement
Advertisement