న్యూఢిల్లీ: చాంపియన్స్ లీగ్ టి20 (సీఎల్‌టి20) మ్యాచ్‌లకు హైదరాబాద్ మరో సారి వేదిక కానుంది. సీఎల్‌టి20- 2014లో భాగంగా ఏడు మ్యాచ్‌లను ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంకు కేటాయించారు. ఇందులో ఐదు లీగ్ మ్యాచ్‌లతో పాటు రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మొహాలీ, రాంచీ టోర్నీ వేదికలుగా 29 మ్యాచ్‌లు జరుగుతాయి.
రాంచీలో జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల అనంతరం టోర్నీ మొదటి ప్రధాన మ్యాచ్‌లో ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్‌లో తలపడుతుంది. సెప్టెంబర్ 13నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ టోర్నీ ఫైనల్ బెంగళూరులో నిర్వహిస్తారు. గత ఏడాది ఫార్మాట్‌లాగే మొత్తం 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. భారత్‌నుంచి నాలుగు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలనుంచి రెండు జట్లు ఉండగా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ దేశాలనుంచి ఒక్కో జట్టు పాల్గొంటుంది.
హైదరాబాద్‌లో చాంపియన్స్ లీగ్
Published Fri, Jul 25 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement