'సూపర్ ఓవర్' మ్యాచ్ లో కేప్ కోబ్రాస్ విజయం
ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో భాగంగా మొహాలీలో ఉత్కంఠ భరితంగా జరిగిన 'సూపర్ ఓవర్' మ్యాచ్ లో బార్బడోస్ ట్రైడెంట్ జట్టుపై కేప్ కోబ్రాస్ విజయం సాధించింది. టాస్ గెలుచుకున్న కేప్ కోబ్రాస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన బార్బడోస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆతర్వాత 175 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన కేప్ కోబ్రాస్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
దాంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ మ్యాచ్ గా మారింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ కోబ్రాస్ 11 పరుగులు చేసింది. ఆతర్వాత 12 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బార్బడోస్ జట్టు 1 వికెట్ చేజార్చుకుని 10 పరుగులు మాత్రమే చేయడంతో విజయం కేప్ కోబ్రాస్ ను వరించింది.