Cape Cobras
-
పంజాబ్ పరాక్రమం
వరుసగా నాలుగో గెలుపు మొహాలీ: అనురీత్ సింగ్ (3/12), అక్షర్ పటేల్ (3/15) బంతితో రాణించడంతో... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో కేప్ కోబ్రాస్‌పై విజయం సాధిం చింది. మొత్తం 16 పాయింట్లతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్... హైదరాబాద్‌లో గురువారం జరిగే సెమీస్‌లో చెన్నై లేదా లాహోర్లలో ఒకదానితో ఆడుతుంది. మరో సెమీస్‌లో కోల్‌కతా, హోబర్ట్ తలపడతాయి. పీసీఏ మైదానంలో జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కోబ్రాస్ 18.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రిచర్స్ లెవీ (37 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆమ్లా (22 బంతుల్లో 40; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... పంజాబ్ బౌలర్ల క్రమశిక్షణతో కోబ్రాస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కోబ్రాస్ 75 పరుగుల తేడాతో 9 వికెట్లు చేజార్చుకుంది. అనురీత్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం పంజాబ్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 139 పరుగులు చేసి గెలిచింది. సాహా (35 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. వోహ్రా (15 బంతుల్లో 23; 4 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 23; 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. సెహ్వాగ్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించాడు. స్కోరు వివరాలు కేప్ కోబ్రాస్ ఇన్నింగ్స్: రిచర్డ్స్ లెవీ (సి) అండ్ (బి) మ్యాక్స్‌వెల్ 42; ఆమ్లా (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 40; రమేలా (సి) మిల్లర్ (బి) పెరీరా 12; వాన్ జైల్ (బి) అనురీత్ సింగ్ 13; విలాస్ (సి) పెరీరా (బి) అవానా 10; ఎంగెల్‌బ్రెక్ట్ (బి) అక్షర్ 5; కెంప్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ 2; ఫిలాండర్ (సి) సాహా (బి) అక్షర్ 5; పీటర్సన్ (సి) సాహా (బి) అనురీత్ సింగ్ 2; క్లెన్‌వెల్ట్ (సి) వోహ్రా (బి) అనురీత్ సింగ్ 0; గిజిమా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (18.3 ఓవర్లలో ఆలౌట్) 135. వికెట్ల పతనం: 1-60; 2-84; 3-105; 4-117; 5-122; 6-124; 7-131; 8-132; 9-135; 10-135 బౌలింగ్: అనురీత్ సింగ్ 2.3-0-12-3; అవానా 4-0-36-1; అక్షర్ పటేల్ 4-0-15-3; తిసారా పెరీరా 2-0-30-1; కరణ్వీర్ సింగ్ 4-0-23-1; మ్యాక్స్‌వెల్ 2-0-17-1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) క్లెన్‌వెల్ట్ (బి) పీటర్సన్ 23; వోహ్రా (సి) ఎంగెల్‌బ్రెక్ట్ (బి) పీటర్సన్ 23; సాహా నాటౌట్ 42; మ్యాక్స్‌వెల్ (బి) ఎంగెల్‌బ్రెక్ట్ 23; మిల్లర్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1-41; 2-74; 3-108 బౌలింగ్: క్లెన్‌వెల్ట్ 4-0-24-0; ఫిలాండర్ 4-0-27-0; పీటర్సన్ 4-1-19-2; ఎంగెల్‌బ్రెక్ట్ 4-0-42-1; గిజిమా 1-0-8-0; రమేలా 1-0-10-0; ఆమ్లా 0.1-0-4-0. -
'నాల్గో విజయం కూడా సాధిస్తాం'
మొహాలీ:ఛాంపియన్స్ లీగ్ లో నాల్గో విజయం కూడా సాధించి పరిపూర్ణంగా నాకౌట్ కు వెళ్లాలనుకుంటున్నామని కింగ్స్ పంజాబ్ కోచ్ ఆర్. శ్రీధర్ స్పష్టం చేశాడు. ఆదివారం కేప్ కోబ్రాస్ పై కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాము సెమీస్ లోకి అడుగుపెట్టినా.. కేప్ కోబ్రాస్ తో జరిగే మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. శనివారం నార్తరన్ డిస్ట్రిక్స్ తో జరిగిన మ్యాచ్ లో 120 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ జట్టు సెమీస్ కు చేరిన అంశాన్ని పరికిస్తే.. చివరి వరుస ఆటగాళ్లకు బ్యాటింగ్ రాకుండా పంజాబ్ అద్భుత విజయాలు నమోదు చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. టీం పరిస్థితిని చూస్తే నాల్గో విజయం కూడా సాధిస్తామని శ్రీధర్ తెలిపాడు. ప్లే ఆఫ్ లో అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి నాకౌట్ రౌండ్ లో ఘనంగా అడుగుపెడతామన్నాడు. -
'సూపర్ ఓవర్' మ్యాచ్ లో కేప్ కోబ్రాస్ విజయం
ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో భాగంగా మొహాలీలో ఉత్కంఠ భరితంగా జరిగిన 'సూపర్ ఓవర్' మ్యాచ్ లో బార్బడోస్ ట్రైడెంట్ జట్టుపై కేప్ కోబ్రాస్ విజయం సాధించింది. టాస్ గెలుచుకున్న కేప్ కోబ్రాస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన బార్బడోస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆతర్వాత 175 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన కేప్ కోబ్రాస్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ మ్యాచ్ గా మారింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ కోబ్రాస్ 11 పరుగులు చేసింది. ఆతర్వాత 12 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బార్బడోస్ జట్టు 1 వికెట్ చేజార్చుకుని 10 పరుగులు మాత్రమే చేయడంతో విజయం కేప్ కోబ్రాస్ ను వరించింది. -
కోబ్రాస్ పై హరికేన్స్ జయభేరి
-
బ్లిజార్డ్ ‘తుఫాన్'
సాక్షి, హైదరాబాద్: హోబర్ట్ హరికేన్స్ విజయలక్ష్యం 185 పరుగులు... చివరి 3 ఓవర్లలో మరో 44 పరుగులు చేయాల్సిన స్థితిలో మొగ్గు ప్రత్యర్థి కేప్ కోబ్రాస్ వైపే ఉంది.అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ క్రెయిగ్ బ్లిజార్డ్ (48 బంతుల్లో 78 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో విజయం హరికేన్స్ సొంతమైంది. 12 బంతుల్లోనే 45 పరుగులు చేసిన ఆ జట్టు ఒక ఓవర్ ముందే మ్యాచ్‌ను ముగించింది. ఇందులో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండటం ఉన్నాయి. వెల్స్ (17 నాటౌట్) కలిసి బ్లిజార్డ్ 26 బంతుల్లోనే 65 పరుగులు జోడించడం విశేషం. అంతకు ముందు బెన్ డంక్ (35 బంతుల్లో 54; 10 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఒక దశలో డంక్ వరుసగా తాను ఎదుర్కొన్న 9 బంతుల్లో 7 ఫోర్లు బాదడం అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేప్ కోబ్రాస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రిచర్డ్ లెవీ (30 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. చివర్లో ఫిలాండర్ (14 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), పీటర్సన్ (14 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు 24 బంతుల్లోనే అభేద్యంగా 52 పరుగులు జోడించడంతో కోబ్రాస్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. అనంతరం హరికేన్స్ 19 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (8) విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌తో హోబర్ట్‌కు తొలి విజయం దక్కగా...కోబ్రాస్ తాము ఆడిన రెండు మ్యాచ్‌లూ ఓడిపోయింది. -
సానియా భర్తకు నిరాశే మిగిలింది!
హైదరాబాద్ అల్లుడు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కు నిరాశే ఎదురైంది. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న షోయబ్ బంతితోనూ, బ్యాట్ తో రాణించలేక విఫలమయ్యారు. కేప్ కోబ్రాస్ తో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టు తరపున 2 ఓవర్లు బౌలింగ్ చేసిన షోయబ్ 15 పరుగులు ఇచ్చాడు. అంతేకాకుండా కేవలం 8 పరుగులకే అవుటయ్యాడు. ఇక సానియా టోక్యోలోని డబ్ల్యూటీఏ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. సానియా తండ్రి షోయబ్ కు తన నివాసంలో విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు పాకిస్థానీ ఆటగాడు లాహోర్ లయన్స్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ హాజరయ్యారు. -
వారెవ్వా... విలియమ్సన్!
49 బంతుల్లో 101 నాటౌట్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోనార్తర్న్ డిస్ట్రిక్ట్స్ విజయం ఓడిన కేప్ కోబ్రాస్ చాంపియన్స్ లీగ్ టి20 రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టి20లో ఓపెనర్ కేన్ విలియమ్సన్ (49 బంతుల్లో 101 నాటౌట్: 8 ఫోర్లు; 5 సిక్సర్లు) చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలోనే తొలిసారిగా వేగవంతమైన సెంచరీతో అదరగొట్టడంతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 33 పరుగుల తేడాతో కేప్ కోబ్రాస్‌పై నెగ్గింది. శుక్రవారం ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రస్తుత సీజన్లో విలియమ్సన్‌దే తొలి సెంచరీ కావడంతో పాటు అతడి కెరీర్లోనూ ఇదే మొదటిది. ఈ కివీస్ స్టార్ తన ఇన్నింగ్స్‌లో కేవలం ఏడు బంతులనే వదిలేశాడు. మరో ఓపెనర్ డెవిసిచ్ (46 బంతుల్లో 67; 8 ఫోర్లు; 1 సిక్స్), వాట్లింగ్ (20 బంతుల్లో 32; 3 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా రాణించారు. లాంగెవెల్ట్, ఫిలాండర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేప్ కోబ్రాస్ ఇన్నింగ్స్ 7.2 ఓవర్లలో 44/2 స్కోరు వద్ద భారీ వర్షం పడి మ్యాచ్‌కు వీలు కాలేదు. ఆ సమయంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన కోబ్రాస్ 77 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌ను విజేతగా ప్రకటించారు. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. విలియమ్సన్ దూకుడు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ కేన్ విలియమ్సన్ పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ డెవిసిచ్ కూడా ఇదే ఆటతీరును చూపడంతో కోబ్రాస్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ప్రతీ ఓవర్లో కనీసం ఓ బౌండరీ ఉండేట్టు చూసుకున్న ఈ జోడి 11 ఓవర్లలో జట్టు స్కోరును 107 పరుగులకు చేర్చింది. అయితే 14వ ఓవర్లో డెవిసిచ్ రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్లో కెప్టెన్ ఫ్లిన్ డకౌట్ అయినా వాట్లింగ్ వరుసగా 4,4,6 కొట్టి రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. చివర్లో విలియమ్సన్ సెంచరీ చేయడంపై కాస్త ఆందోళన నెలకొంది. 18వ ఓవర్ అనంతరం 90 పరుగుల వద్ద ఉన్న విలియమ్సన్కు ఆతర్వాత ఓవర్లో రెండు వికెట్లు పడడంతో సెంచరీ పూర్తిచేస్తాడా అనే ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా ఫ్రీ హిట్ అవకాశాన్ని సిక్సర్‌గా మలిచి విలియమ్సన్ 48 బంతుల్లో శతకం అందుకున్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేప్ కోబ్రాస్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఆమ్లా (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) అదే ఓవర్లో వెనుదిరిగాడు. అయితే వర్ష సూచనను అంచనా వేయకుండా నిదానంగా ఆడడంతో జట్టు మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డెవిసిచ్ (రనౌట్) 67; విలియమ్సన్ నాటౌట్ 101; ఫ్లిన్ (సి) ఒన్‌టాంగ్ (బి) ఫిలాండర్ 0; వాట్లింగ్ (సి) వాన్ జిల్ (బి) లాంగెవెల్ట్ 32; స్టైరిస్ (సి) విలాస్ (బి) లాంగెవెల్ట్ 0; మిచెల్ (సి) కెంప్ (బి) ఫిలాండర్ 0; సాన్ట్నెర్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 206 వికెట్ల పతనం: 1-140; 2-140; 3-191; 4-192; 5-192. బౌలింగ్: లాంగెవెల్ట్ 4-0-27-2; ఫిలాండర్ 4-0-39-2; క్లీన్‌వెల్ట్ 3-0-37-0; పీటర్సన్ 3-0-32-0; జిజిమా 2-0-20-0; ఒన్‌టాంగ్ 2-0-17-0; కెంప్ 2-0-34-0. కేప్ కోబ్రాస్ ఇన్నింగ్స్: వాన్ జిల్ (బి) బౌల్ట్ 0; ఆమ్లా (సి) సబ్ విల్సన్ (బి) కుగ్గెలీన్ 20; పీటర్సన్ నాటౌట్ 17; రమేలా నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (7.2 ఓవర్లలో 2 వికెట్లకు) 44 వికెట్ల పతనం: 1-0; 2-38. బౌలింగ్: బౌల్ట్ 2-0-8-1; సౌతీ 2-0-10-0; స్టైరిస్ 2-0-13-0; కుగ్గెలీన్ 1-0-11-1; సోధి 0.2-0-1-0.