Barbados Tridents
-
చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా
జమైకా : టీ20 క్రికెట్ అంటేనే ధనాధన్ ఆటలా ఉంటుంది.. బ్యాట్స్‌మన్ వీర బాదుడు, ఫీల్డింగ్ నైపుణ్యాలు, బౌలర్లు బంతితో చేసే మేజిక్‌లు కళ్ల ముందు కదులుతాయి. అటువంటి టీ20 క్రికెట్లో వికెట్ దొరకడమే కష్టం.. ఆరంభం నుంచి బాదుడే పనిగా పెట్టుకునే బ్యాట్స్మెన్లకు బౌలర్లు చుక్కులు చూపించడం కొంచెం కష్టమే. అందుకేనేమో టీ20 ఆటలో బౌలర్‌కు వికెట్ లభించగానే పెద్ద పండగలా చేసుకుంటారు. ఇంకొందరు మాత్రం మరికాస్త ముందుకెళ్లి తమదైన శైలిలో సెలబ్రేషన్ నిర్వహించుకుంటారు. సీపీఎల్ 2020 లీగ్ సందర్భంగా గురువారం గయానా వారియర్స్, బార్బడోస్ ట్రైడెంట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. గయానా వారియర్స్ బౌలర్ కెవిన్ సింక్లెయిర్ కీలక ఆటగాడిని ఔట్ చేసా అన్న ఆనందంలో దొమ్మరిగడ్డలు వేస్తూ తన సరదాను తీర్చుకున్నాడు. సాధారణంగా సోమర్‌సాల్ట్స్(దొమ్మరిగడ్డలు) కాళ్లతో వేస్తుంటారు. కానీ సింక్లెయిర్ ఒకసారి మాత్రమే కాళ్లను ఉపయోగించి మిగతా రెండుసార్లు గాలిలోనే పల్టీలు కొట్టాడు. ఇది చూసిన మిగతా ఆటగాళ్ల సింక్లెయిర్ చిన్నప్పుడు ఎమైనా స్రింగులు మింగాడా అనే సందేహం కలిగింది. ప్రస్తుతం సింక్లెయిర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(చదవండి : ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’) బార్బడోస్ బ్యాటింగ్ చేస్తున్న 16 వ ఓవర్లో సింక్లెయిర్ ఈ విన్యాసం చేశాడు. లీగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్ సాంట్నర్.. తన బౌలింగ్‌లో వికెట్‌గా వెనుదిరగడంతోనే ఇలా చేసినట్లు సింక్లెయిర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బార్బడోస్ జట్టు 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 89 పరుగులే చేసింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా అమెజాన్ వారియర్స్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయంతో లీగ్‌లో రెండోస్థానానికి చేరుకున్న గయానా వారియర్స్ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన డిపెండింగ్ చాంపియన్ బార్బడోస్ ట్రైడెంట్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచి లీగ్ నుంచి నిష్క్రమించింది. Double?? Treble?? Definitely Double Trouble in the Bubble!! What a celebration! #CPL20 #CricketPLayedLouder pic.twitter.com/3N2oKNAzRy — CPL T20 (@CPL) September 3, 2020 -
ఏబీ దూకుడు
బార్బాడాస్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో బార్బాడాస్ ట్రిడెంట్స్ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అదరగొట్టాడు. బుధవారం రాత్రి సెయింట్ కిట్స్-నేవిస్ పాట్రోయిట్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డివిలియర్స్ దూకుడుగా ఆడి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. డివిలియర్స్(82; 54 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో బార్బాడాస్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన సెయింట్ కిట్స్ తొలుత బార్బాడాస్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బార్బాడాస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు స్టీవ్ టేలర్(2), రీఫర్(1)లు నిరాశపరిచారు. ఆ తరుణంలో షోయబ్ మాలిక్(16)తో జతకలిసిన డివిలియర్స్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా డివీ మాత్రం దూకుడును కొనసాగించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఏబీ.. ఆపై మరింత దాటిగా ఆడాడు. అయితే శతకానికి 18 పరుగుల దూరంలో కొట్రెల్ వేసిన స్లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన డివీ ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. బార్బాడాస్ మిగతా ఆటగాళ్లలో పూరాంట్(38), పొలార్డ్(27)లు ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన సెయింట్ కిట్స్-నేవిస్ పాట్రోయిట్స్ 20.0 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.సెయింట్ కిట్స్ జట్టులో డు ప్లెసిస్(42), కార్టర్(46) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఈ టోర్నీలో బార్బాడాస్ కు ఇది రెండో విజయం కాగా,సెయింట్ కిట్స్ ఇప్పటివరకూ ఒక గెలుపును మాత్రమే నమోదు చేసింది. -
డివిలియర్స్ మళ్లీ దుమ్మురేపాడు
సెయింట్ కిట్స్: ఏబీ డివిలియర్స్ మరోసారి దుమ్ము రేపాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో విజృంభించి ఆడి అజేయ అర్ధశతకంతో తన జట్టు బార్బడోస్ ట్రైడెంట్స్ కు విజయాన్ని అందించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో బార్బడోస్ టీమ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగులుండగానే ఆధిగమించింది. 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. డివిలియర్స్ తనదైన శైలిలో చెలరేగి 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు. షోయబ్ మాలిక్(54) అర్ధ సెంచరీతో రాణించాడు. పొలార్డ్ 25, పార్నెల్ 16 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన నెవిస్ పాట్రియట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. లెవిస్ 50, కార్టర్ 41, థామస్ 21, స్మట్స్ 14, బ్రాత్ వైట్ 11 పరుగులు సాధించారు. డివిలియర్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకున్నాడు. -
'సూపర్ ఓవర్' మ్యాచ్ లో కేప్ కోబ్రాస్ విజయం
ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో భాగంగా మొహాలీలో ఉత్కంఠ భరితంగా జరిగిన 'సూపర్ ఓవర్' మ్యాచ్ లో బార్బడోస్ ట్రైడెంట్ జట్టుపై కేప్ కోబ్రాస్ విజయం సాధించింది. టాస్ గెలుచుకున్న కేప్ కోబ్రాస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన బార్బడోస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆతర్వాత 175 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన కేప్ కోబ్రాస్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ మ్యాచ్ గా మారింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ కోబ్రాస్ 11 పరుగులు చేసింది. ఆతర్వాత 12 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బార్బడోస్ జట్టు 1 వికెట్ చేజార్చుకుని 10 పరుగులు మాత్రమే చేయడంతో విజయం కేప్ కోబ్రాస్ ను వరించింది.