రాలేకపోయాను.. క్షమించండి | IPL Shah Rukh Khans Message For His Team KKR | Sakshi
Sakshi News home page

రాలేకపోయాను.. క్షమించండి

Published Thu, May 24 2018 8:57 PM | Last Updated on Thu, May 24 2018 8:57 PM

IPL Shah Rukh Khans Message For His Team KKR - Sakshi

సాక్షి, కోల్‌కతా : బాలీవుడ్‌ కింగ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ క్రికెట్‌ మైదానంలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక కేకేఆర్‌ జట్టు ఈడెన్‌ గార్డెన్‌లో ఆడే ప్రతీ మ్యాచ్‌లో పాల్గొని టీమ్‌ను ఉత్సాహపరుస్తారు. మాములుగా లీగ్‌ మ్యాచ్‌ల్లోనే పాల్గొని హడావుడి చేసే షారుఖ్‌.. తమ జట్టుకు ఎంతో కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ఎందుకు రాలేదని అందరిలోనూ మెదిలిన ప్రశ్నలకు సమాధానంగా వివరణతో కూడిన ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు రాలేకపోయానని ఈ బాలీవుడ్‌ స్టార్‌ పేర్కొన్నారు. ‘ సారీ గాయ్స్‌ షూటింగ్‌ల బిజీ వలన రాలేక పోయాను, షూటింగ్‌లో దొరికిన కాస్త విరామంలో నా ప్రేమను మీతో పంచుకుంటున్నాను. మీరు సాధించిన విజయం పట్ల నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కాగా కేకేఆర్‌ ఫైనల్‌ బెర్త్‌ కోసం శుక్రవారం క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌తో పోటీపడనుంది.      


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement