IPL 2022 RR Vs RCB Prediction: ఐపీఎల్-2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఘన విజయం సాధించింది ఆర్‌ఆర్. తమ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో తలపడ్డ రాజస్తాన్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా రెండో మ్యాచ్‌లో ముంబైని 23 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది.
ఈ క్రమంలో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అద్భుత రన్‌రేటు(2.100)తో ముందుకు దూసుకెళ్లింది. ఇదే జోష్‌లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ రెండు జట్ల ముఖాముఖి పోరులో ఇప్పటి వరకు ఎవరిది పైచేయి, పిచ్ వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది అన్న విషయాలు గమనిద్దాం.
రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
తేది, సమయం: ఏప్రిల్ 5, రాత్రి 7: 30 గంటలకు మ్యాచ్ ఆరంభం
వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
పిచ్ వాతావరణం: వాంఖడేలో జరిగిన గత మూడు మ్యాచ్‌లను గమనిస్తే.. చేజింగ్ జట్లే విజయం సాధించాయి. సాయంత్రం ఇక్కడ జరిగే మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఎక్కువ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పేసర్లకు ఈ పిచ్ అనుకూలమని గత మ్యాచ్‌లను బట్టి అర్థమవుతోంది. కేకేఆర్ తరఫున ఉమేశ్ యాదవ్, గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ ఇక్కడ అద్బుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం గమనార్హం.
ఆర్‌ఆర్ వర్సెస్ ఆర్సీబీ ముఖాముఖి రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లలో రాజస్తాన్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో పన్నెండింటిలో ఆర్సీబీ విజయం సాధించగా.. రాజస్తాన్ 10 మ్యాచ్‌లలో గెలుపొందింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
ఇక వాంఖడేలో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం ఏడింట ఓడిపోగా.. ఆర్సీబీ 12 మ్యాచ్‌లకు గానూ ఎనిమిదింట పరాజయం మూటగట్టుకుంది.కాగా ఈ సీజన్‌లో రాజస్తాన్ రెండింట గెలుపొందగా.. ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మంళవారం నాటి పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
తుది జట్ల అంచనా:
ఆర్సీబీ: ఫాప్ డుప్లెసిసస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్
రాజస్తాన్: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ.
చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్.. ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్!
Faf’s pep talk to the team, Mike’s assessment, Willey’s team song assignment, Harshal on facing old friend Yuzi, Maxi’s availability and much more, as we preview the #RRVRCB game on @kreditbee presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/rRFAu5PGGn
— Royal Challengers Bangalore (@RCBTweets) April 5, 2022
We carry Rajasthan in our hearts.
— Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2022
We are #DilSeRoyal. 💗#RoyalsFamily | #RRvRCB pic.twitter.com/ibZp6X4Nk9
Comments
Please login to add a commentAdd a comment