ఐపీఎల్‌లో తిలక్‌ వర్మ కొత్త రికార్డు.. తొలి ముంబై ఆటగాడిగా | Tilak Varma is the Youngest to score a Half Century For MI in IPL | Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌లో తిలక్‌ వర్మ కొత్త రికార్డు.. తొలి ముంబై ఆటగాడిగా

Published Sat, Apr 2 2022 7:09 PM | Last Updated on Sat, Apr 2 2022 9:03 PM

Tilak Varma is the Youngest to score a Half Century For MI in IPL - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు తిలక్‌ వర్మ అరుదైన రికార్డు సాధించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన తిలక్‌ వర్మ.. ముంబై ఇండియన్స్‌ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన అతి పిన్న వయస్కుడుగా నిలిచాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ (19సం 278 రోజులు) 2018 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై 58 పరుగులు సాధించాడు.

అయితే తిలక్‌ వర్మ (19 ఏళ్ల 145 రోజులు)  ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కిషన్‌ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 61 పరుగులు సాధించి తిలక్‌ వర్మ అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీను తిలక్‌ వర్మ నమోదు చేశాడు. ఇక ఐపీఎల్‌-202 మెగా వేలంలో  తిలక్‌ వర్మను రూ.కోటి 70 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా హైదరాబాద్‌కు చెందిన తిలక్‌ వర్మ రంజీట్రోఫీలోను అదరగొట్టాడు.

చదవండి: IPL 2022: జోష్‌ బట్లర్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement