
గత ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోని కేరళ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్.. ఈ సీజన్‌లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. తొలుత చెన్నైపై మ్యాచ్‌లో 32 బంతుల్లో 74 పరుగులతో చెలరేగిన ఈ ఆటగాడు.. ఈ మ్యాచ్‌లో 9 సిక్సర్లలో ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఈ తరువాత పంజాబ్‌పై 42 బంతుల్లో 85 (4 ఫోర్లు, 7 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. జట్టులో సీనియర్లు విఫలమైనా.. దూకుడైన ఆటతీరుతో రాజస్తాన్ రాయల్స్ టీంలో కీలక ఆటగాడిగా మారాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన శాంసన్ ఆ తరువాత మరింత కసిగా అడుతున్నట్లు కనిపిస్తోంది. వరుస మ్యాచ్‌ల్లో అతనాడిన షాట్స్‌కు మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (శాంసన్ విధ్వంసం : ఎంపీల మధ్య వార్)
ఇక ఈ క్రమంలోనే కేరళ ఆటగాడి ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరుగుతోంది. ఈ జాబితాలో మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేరిపోయింది. సంజూ శాంసన్ బ్యాటింగ్ స్టైల్‌కు తాను ఫిదా అయ్యాయని చెప్పింది. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన మంధాన.. శాంసన్ కొట్టే బౌండరీలు తననెంతో కట్టిపడేశాయని పేర్కొంది. అతనికి ఫ్యాన్‌గా మారిపోయానని, శాంసన్ కోసమే రాజస్తాన్ జట్టుకు సపోర్టు చేస్తున్నానని అభిప్రాయపడింది. తన ఆటతీరుతో ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని, శాంసన్ బ్యాటింగ్ కోసమే రాజస్తాన్ మ్యాచ్ చూస్తున్నట్లు తెలిపింది. కాగా నేటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment