రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2022ను తనదైన శైలిలో ప్రారంభించాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. జైశ్వాల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో సంజూ అరుదైన ఫీట్ సాధించాడు.
ఒక జట్టు తరపున ఆరంభ మ్యాచ్‌లోనే వరుసగా మూడు సీజన్ల పాటు కనీసం అర్థసెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం. 2020లో సీఎస్‌కేతో ఆడిన తొలి మ్యాచ్‌లో 32 బంతుల్లో 74 పరుగులు, 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 119 పరుగులు.. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో శాంసన్ 27 బంతుల్లో 55 పరుగులు సాధించాడు.
సంజూ శాంసన్ ఇన్నింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చదవండి: IPL 2022: వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్‌ఆర్‌హెచ్ కదా
Comments
Please login to add a commentAdd a comment