
Sanju Samson Retained by Rajasthan Royals as Captain: ఐపీఎల్ 2022 సీజన్ కోసం మెగా వేలంకు సమయం దగ్గరపడడంతో ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ లిస్ట్‌ను జట్లు నవంబర్ 30 లోపు అందజేయాలి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కూడా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
నివేదికల ప్రకారం.. 14 కోట్లకు అతడు రాజస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. స్టీవ్ స్మిత్ ఢిల్లీ జట్టులో చేరడంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్సీ పగ్గాలను సంజూ శాంసన్‌కు రాజస్తాన్ ఒప్ప జెప్పింది. కాగా 2018లో శాంసన్‌ను 8 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.
అంతే కాకుండా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్,లియామ్ లివింగ్‌స్టోన్ పేర్లు రిటైన్ చేసుకోనే లిస్ట్‌లో ఉన్నట్టు సమాచారం. అదే విధంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను రిటైన్ చేసుకుంటారా లేదా అన్న అంశంపై ఎటువంటి సమాచారం లేదు. ఎందకంటే మానసిక ఆరోగ్య సమస్యల దృష్ట్యా క్రికెట్ నుంచి స్టోక్స్ నిరవధిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ ఏడాది14వ సీజన్‌లో శాంసాన్ అద్బుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌లలో సంజూ 484 పరుగులు చేశాడు. కాగా సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్‌ను ఆన్ ఫాలో చేసిన శాంసన్ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు చేరనున్నట్లు వార్తలు వచ్చాయి.
చదవండి: IND-A Vs SA- A: టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో ఏం చేశాడంటే..
Comments
Please login to add a commentAdd a comment