Photo Credit : IPL Website
ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్ చేసిన ఉమేశ్ యాదవ్.. ఈ అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‌పై ఇప్పటివరకు ఉమేశ్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు.
కాగా గతంలో ఈ రికార్డు సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబై అత్యధికంగా 33 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును ఉమేశ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో భారీ వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో డిఎల్‌ఎస్ ప్రకారం 16 ఓవర్లకు కోల్‌కతా విజయ సమీకరణం 154 పరుగులుగా ఉంది. 7పరుగులు కేకేఆర్ వెనుకబడి ఉండడంతో పంజాబ్‌ను విజేతగా నిర్ణయించారు.
చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్.. లక్నో తరపున తొలి బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment