
Courtesy: IPL Twitter
Bhawna Kohli Dhingra Commnets On Virat kholi: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి సోదరి భవ్నా కోహ్లి ధింగ్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది.
"నీవు కెప్టెన్‌గా ఆర్‌సీబీకి శక్తి మేరకు పనిచేశావు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఎల్లప్పుడూ జట్టు భారాన్ని నీ భుజాలపైన వేసుకుని నడిపించావు. ఆర్సీబీ గొప్ప కెప్టెన్‌లో ఒకడిగా నిలిచిపోతావు. ఎప్పటికీ గౌరవ, ప్రశంసలకు నీవు అర్హుడివే. నేను నీకు సోదరిగా పుట్టినందుకు గర్విస్తున్నా" అంటూ భవ్నా కోహ్లి రాసుకొచ్చింది. కాగా కెప్టెన్‌గా కోహ్లికు ఇదే చివరి సీజన్ కాగా.. ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని అతడు భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.
చదవండి: Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment