పంజాబ్ కింగ్స్ కు కోల్ కతా షాక్ | Kolkata won by 9 wickets against punjab kings | Sakshi
Sakshi News home page

పంజాబ్ కింగ్స్ కు కోల్ కతా షాక్

Published Sun, May 11 2014 7:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

Kolkata won by 9 wickets against punjab kings

కటక్: వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ కు కోల్ కోతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. ఐపీఎల్ - 7 లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా ఇన్నింగ్స్ ను గంభీర్, ఉతప్పలు ఆరంభించారు. కోల్ కతా 6.2 ఓవర్ల ముగిసే సరికి వికెట్టు నష్టపోకుండా 63  పరుగులు చేసి పటిష్ట స్థితిలోకి చేరింది. ఆ తరుణంలో ఉతప్ప (46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అనంతరం గంభీర్(63), పాండే (36) పరుగులు చేయడంతో కోల్ కతా మరో వికెట్టు పడకుండా 18 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది.

 

అంతకముందు టాస్ ఓడి పంజాబ్ బ్యాటింగ్ చేసింది. పంజాబ్ ఓపెనర్ మన్ దీప్ సింగ్ (0)కే పెవిలియన్ కు చేరినప్పటికీ, వీరేంద్ర సెహ్వాగ్ (72) పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం మ్యాక్స్ వెల్ (14), సాహా(15), మిల్లర్ (13), బెయిలీ(12) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో చావ్లాకు మూడు వికెట్లు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement