
సునీల్ నరైన్
సాక్షి, స్పోర్ట్స్ : వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టె వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్‌లో ఆడేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో భాగంగా క్వెటా గ్లాడియేటర్స్-లాహోర్ క్వాలండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్‌కు రిపోర్ట్ చేశారు.
వెస్టిండీస్ బోర్డు తీసుకునే నిర్ణయంపైనే నరైన్ ఐపీఎల్ భవిష్యత్తు తేలనుంది. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో నరైన్ లేకుంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఐపీఎల్‌లో నరైన్ బంతితో పాటు బ్యాట్‌తో మెరుపులు మెరిపించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గతంలో సైతం సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌లో నిషేధం ఎదుర్కొన్నాడు. అనంతరం తన బౌలింగ్ శైలి మార్చుకోని తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్న నరైన్‌పై మరో సారి ఈ తరహా ఆరోపణలు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment