SRH: కావ్యా మారన్‌ వైల్డ్‌ సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌ | Kavya Maran Breaks Into Wild Celebrations After Bhuvi Seals 1 Run Win For SRH: Video | Sakshi
Sakshi News home page

SRH: కావ్యా మారన్‌ వైల్డ్‌ సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌

Published Fri, May 3 2024 11:13 AM | Last Updated on Fri, May 3 2024 3:15 PM

ఎగిరి గంతేసిన కావ్యా మారన్‌ (PC: IPL)

ఎగిరి గంతేసిన కావ్యా మారన్‌ (PC: IPL)

సొంతగడ్డపై.. టీ20 మ్యాచ్‌.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఆఖరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలిస్తే ఆ కిక్కే వేరు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు, అభిమానులు గురువారం నాటి మ్యాచ్‌లో ఈ మధురానుభూతిని చవిచూశారు.

ఆఖరి బంతికి భువనేశ్వర్‌ కుమార్‌ వికెట్‌ తీసి.. పటిష్ట రాజస్తాన్‌ రాయల్స్‌పై రైజర్స్‌ను గెలుపు తీరాలకు చేర్చడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లు, ఆరెంజ్‌ ఆర్మీ పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్రాంఛైజీ సహ యజమాని కావ్యా మారన్‌ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు.

 

 ‘‘హేయ్‌.. మేమే గెలిచాం’’ అన్నట్లుగా సంతోషం పట్టలేక గాల్లోకి ఎగిరి దుముకుతూ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు కావ్యా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అగ్ర స్థానంలోనే రాజస్తాన్‌
కాగా ఐపీఎల్‌-2024లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు సన్‌రైజర్స్‌ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజర్స్‌ గట్టెక్కింది.

 

 తద్వారా వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. రైజర్స్‌ చేతిలో పరాభవం ఎదురైనా రాజస్తాన్‌ అగ్రస్థానానికి వచ్చిన చిక్కేమీ లేదు. ఇప్పటికే 8 విజయాలు సాధించిన సంజూ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో అందరి కంటే ముందే ఉంది.

సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు:
👉వేదిక: ఉప్పల్‌, హైదరాబాద్‌
👉టాస్‌: సన్‌రైజర్స్‌- బ్యాటింగ్‌

👉హైదరాబాద్‌ స్కోరు: 201/3 (20)
👉రాజస్తాన్‌ స్కోరు: 200/7 (20)

👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్‌ గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: భువనేశ్వర్‌ కుమార్‌(3/41)

👉టాప్‌ స్కోరర్లు: నితీశ్‌ రెడ్డి(సన్‌రైజర్స్‌- 42 బంతుల్లో 76 రన్స్‌- నాటౌట్‌)
👉రియాన్‌ పరాగ్‌ (రాజస్తాన్‌- 49 బంతుల్లో 77 పరుగులు).

చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్‌: కమిన్స్‌ ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement