
కావ్యా మారన్ (PC: IPL)
పవర్ హిట్టింగ్‌తో దుమ్ములేపుతూ ఐపీఎల్-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్ కమిన్స్ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తైంది.
చెపాక్ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్ చేసేది సన్‌రైజర్స్ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్ సాగింది.
Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠
Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024
అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.
ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.
కానీ సన్‌రైజర్స్ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా.. ఆఫ్ కట్టర్‌గా సంధించగా.. గైక్వాడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
బంతిని అందుకున్న కమిన్స్ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్ రెండు పరుగులు తీసుకుని సింగిల్ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.