కావ్యా మారన్ (PC: jio cinema)
#OrangeArmy: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విజృంభణతో చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆరంభం నుంచే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడుతూ సృష్టించిన పరుగుల సునామీలో పాత రికార్డులు కొట్టుకుపోతుంటే అందుకు సాక్షిగా నిలిచింది.
అయినా.. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు మ్యాజిక్ చేస్తారనే ఆశ. సొంతమైదానంలో కచ్చితంగా రికార్డు టార్గెట్‌ను చేధిస్తారనే నమ్మకం ఆ జట్టు అభిమానుల్లో! కానీ సన్‌రైజర్స్ బౌలర్ల ముందు ఆర్సీబీ బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు.
అయినప్పటికీ.. కొండంత లక్ష్యాన్ని కరిగించేందుకు ఆఖరి వరకు అసాధారణ పోరాట పటిమ కనబరిచారు. అయితే.. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరికి సన్‌రైజర్స్ పైచేయి సాధించింది.
ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి. ఆద్యంతం పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తొలుత తమ జట్టు హిట్టింగ్ చేసినపుడు.. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకం నేపథ్యంలో ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన సమయంలో సంతోషంతో కావ్య ముఖం వెలిగిపోయింది.
The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡
— IndianPremierLeague (@IPL) April 16, 2024
Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM
అలాగే ప్రమాదకరంగా మారుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) అవుటైన సమయంలో ఏకంగా చిన్నపాటి స్టెప్పులేసిందామె! ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కావ్యా ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు ఆమెకు, సన్‌రైజర్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా ఆర్సీబీతో బెంగళూరులో సోమవారం జరిగిన సన్‌రైజర్స్ మ్యాచ్‌కు కావ్యా మారన్ తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.
సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు:
►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్
►సన్‌రైజర్స్ స్కోరు: 287/3 (20)
►ఆర్సీబీ స్కోరు: 262/7 (20)
►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102 పరుగులు).
చదవండి: ఐపీఎల్ నుంచి తప్పుకున్న మ్యాక్స్‌వెల్
Kavya Maran enjoying the Head-Abhishek show. pic.twitter.com/jaYpDIquOS
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024
Comments
Please login to add a commentAdd a comment