Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు)

Published Sat, May 25 2024 8:52 PM | Updated 30 Min Ago

1/8

సన్‌రైజర్స్‌... ఈ ఏడాది టీ20 లీగ్‌లలో ఈ ఫ్రాంఛైజీకి బాగా కలిసి వస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌..

2/8

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌లోనూ దుమ్ములేపుతోంది.

3/8

గత మూడేళ్ల వైఫల్యాలను మరిపించేలా సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

4/8

ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అనూహ్య రీతిలో ఆరేళ్ల తర్వాత టైటిల్‌ రేసులో నిలిచింది.

5/8

క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ రాయల్స్‌ను 36 పరుగులతో ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

6/8

కేకేఆర్‌ రూపంలో ఇంకొక్క గండం దాటేస్తే ట్రోఫీని ముద్దాడే అవకాశం ముంగిట నిలిచింది.

7/8

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌ సంబరాలు అంబరాన్నంటాయి.

8/8

కీలక మ్యాచ్‌లో ఆద్యంతం తన హావభావాలతో హైలైట్‌గా నిలిచారామె.

Advertisement
 
Advertisement