
Photo: IPL Twitter
ఎస్‌ఆర్‌హెచ్ కో-ఓనర్ కావ్యా మారన్ మరోసారి హైలైట్ అయింది. ఎస్‌ఆర్‌హెచ్ ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ వాలిపోయే కావ్య పాప జట్టును ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. తాజాగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ కావ్య మారన్ హల్‌చల్ చేసింది.
ఈ నేపథ్యంలోనే రెండో ఇన్నింగ్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్‌ను తొందరగానే కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఫరుకీ వేసిన బంతిని ఆడే క్రమంలో లక్నో డేంజర్ బ్యాటర్ కైల్ మేయర్స్ మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కైల్ మేయర్స్ వికెట్ పడాగానే కావ్య మారన్ సంతోషం మాములుగా లేదు. కుర్చీలో నుంచి పైకి లేచి గట్టిగట్టిగా అరుస్తూ వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
అయితే ఈ ఆనందం ఆమెకు ఎక్కువ సేపు నిలవలేదు. లక్ష్యం చిన్నది కావడంతో లక్నోనిలకడగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. పాపం కావ్యా మారన్ జట్టు ఎస్‌ఆర్‌హెచ్ సీజన్‌లో వరసగా రెండో ఓటమి నమోదు చేసింది. అయితే ఒక్క వికెట్ పడగానే ఇంత వైల్డ్ సెలబ్రేషన్స్ చేసిందంటే మ్యాచ్ గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అభిమానులు కామెంట్ చేశారు.
శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులకే పరిమితమైంది. అనంతరం సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కేఎల్ రాహుల్ 35, కృనాల్ పాండ్యా 34 పరుగులతో లక్నో విజయంలో కీలకపాత్ర పోషించారు.
Sunrisers Owner Kavya Maran Reaction for Kyle Myers Wicket. 😝 pic.twitter.com/IoPCc8kTYr
— KaRuN (@KarunakarkarunN) April 7, 2023