రోధిస్తున్న బాధితులు.. ఇన్‌సెట్లో నర్సింగమ్మ, కృష్ణ
గద్వాల రూరల్: కలుషిత తాగునీరు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచే సుకుంది. గద్వాల పట్టణం 12వ వార్డుకు చెందిన వేదనగర్, గంటగేరి, ధరూరుమెట్టు, కృష్ణారెడ్డి బంగ్లా కాలనీల్లో మూడు రోజుల కిందట తాగునీరు కలుషితమై పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గంటగేరికి చెందిన కృష్ణ (50), మంగలి నర్సింగమ్మ (59) సైతం వాంతులు విరేచనాలతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో చేరారు.
చదవండి👉🏾వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా
కృష్ణ పరిస్థితి విషమంగా మారడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అలాగే ఈ నెల 4 నుంచి జిల్లా ఆస్ప త్రిలో మంగలి నర్సింగమ్మ చికిత్స పొందుతు న్న క్రమంలో బుధవారం ఆమె పరిస్థితి విష మించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చేర్పించారు.
అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతులిద్దరూ పక్క పక్క వీధుల వారే కావడంతో ఆ కాలనీలో విషాదం నెలకొంది. కాగా, 12వ వార్డులోని 4 కాలనీల్లో వాంతులు, విరేచనాలతో 3 రోజు లుగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 24 మంది చికిత్స పొందుతున్నారు. గద్వాల ప్రైవేట్ ఆస్ప త్రుల్లో 70–75 మంది చికిత్స తీసుకుంటుండగా వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు.
చదవండి👉🏾తాగేనీళ్లు లేకున్నా..మద్యం ఏరులై పారుతోంది
కలుషిత నీటితోనే..
ఈ నెల 4న వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న కేసులు గుర్తించాం. వెంటనే వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కలుషిత నీటి ప్రభావానికి గురైన కాలనీలో సర్వే చేపట్టాం. మృతి చెందిన ఇద్దరూ వాంతులు, విరేచనాల బారినపడినవారే. అయితే వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో వైద్యం అందించే సమయంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతి చెందారు. అస్వస్థతకు గురైన వారి నుంచి రక్తనమూనాలతోపాటు వారు వినియోగించే నీటి నమూనాలు సేకరించాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రాథమికంగా ఇలాంటి కేసులు నీటి కలుషితం కారణంగానే తలెత్తుతాయి.
– చందూ నాయక్, డీఎంహెచ్‌ఓ, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment