water pollution
-
నీటి కాలుష్యమే పొట్టన పెట్టుకుంది... వీడిన 350 ఏనుగుల మృతి మిస్టరీ
బోట్స్వానాలో 2020లో ఏనుగుల మూకు మ్మడి మరణం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఏకంగా 350 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమ య్యాయి. ఈ ఉదంతంపై లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధనలు జరిపింది. ఆ ఏనుగుల మరణాల వెనుక మిస్టరీ నాలుగేళ్లకు వీడింది. అడవిలోని నీటి గుంతలు కలుషితమవడమే ఏనుగుల మృతికి కారణమని అధ్యయన బృందం తెలిపింది. ‘‘సైనో బ్యాక్టీరియా విడుదల చేసిన సైనో టాక్సిన్లు నీటిపై విషపూరిత నురగకు కారణమయ్యాయి. అదే ఏనుగుల మరణానికి దారి తీసింది’’ అని వెల్లడించింది.వర్షాధారిత గుంతల వల్లే.ఒకవాంగో డెల్టాలోని 6 వేల చదరపు కిలోమీట ర్ల పరిధిలో 20 నీటి గుంతలు కలుషితమైనట్టు అధ్యయనంలో తేలింది. ఆ నీటిని తాగాక 88 గంటల్లోనే ఏనుగులు చనిపోయినట్టు అంచనా వేసింది. అవి శాశ్వత నీటి వనరులు కావు. కేవ లం వర్షాధారిత గుంతలు. వాటివల్లే ప్రమాదం జరిగిందని అధ్యయన సారథి శాస్త్రవేత్త డేవిడే లోమియో చెప్పారు. చనిపోయిన ఏనుగులు వేర్వేరు వయసులవి. పైగా వాటి దంతాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. కనుక వాటిని వేటాడారన్న వాదన సరికాదు’’ అని తెలిపారు.ఆల్గే పెరుగుదలకు కారణం?సైనో బాక్టీరియాగా పిలిచే నీలం–ఆకుపచ్చ ఆల్గే లో అన్నిరకాలూ విషపూరితం కావు. కొన్నిరకాల సైనోబాక్టీరియా నిలకడగా ఉన్న నీటిలో ఒక రకమైన ప్రాణాంతక ఆల్గల్ బ్లూమ్స్ (హెచ్ఎబి) ను ఉత్పత్తి చేస్తుంది. బోట్స్వానాలో 2019లో అస్సలు వానల్లేవు. 2020లోనేమో విపరీతంగా వానలు పడ్డాయి. ‘‘అధిక వర్షపాతంతో భూమి నుంచి భారీ అవక్షేపాలతో పాటు పోషకాల పునరుత్పత్తి విపరీతంగా జరిగింది. అదే ఆల్గల్ పెరుగుదలకు కారణమైంది’’ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఇలాంటివి తరచూ జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టితో ఆఫ్రికా దక్షిణ భాగం వైరుధ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోందని వారంటున్నారు. ‘‘ఇదే నీటిపై ప్రభా వం చూపుతోంది. దాంతో జంతువులు విపత్కర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి’’ అని తెలిపారు. అడవులు, పార్కుల్లోని నీటి వనరుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరమన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెల్లవారితే కూడు దక్కక.. పొద్దు వాలితే గూడు లేక.. బతకు ‘వ్యర్థ’మేనా?
తెల్లవారితే కూడు దక్కక.. పొద్దు వాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులకు వ్యర్థాలే జీవనాధారంగా మారుతున్నాయి. పిడికెడు మెతుకుల కోసం పేగులు మెలిపెట్టే దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీటిలో వస్తువుల కోసం అన్వేషిస్తున్నఈ వ్యక్తి చిత్రాన్ని విశాఖ కాన్వెంట్ జంక్షన్ వద్ద సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది.– పీఎల్ మోహన్‌రావు, సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
కుంచించుకుపోతున్న కాస్పియన్
ప్రపంచంలోనే అతి పెద్దదైన కాస్పియన్ సరస్సు ఉనికి ప్రమాదంలో పడింది. రోజురోజుకూ నీరు తగ్గిపోయి కుంచించుకుపోతోంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతూ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది...కాస్పియన్ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. దీని సముద్రతీరం 4,000 మైళ్ళకు పైగా విస్తరించి ఉంది. కజకిస్తాన్, ఇరాన్, అజర్బైజాన్, రష్యా, తుర్క్మెనిస్తాన్ దేశాలు.. చేపలు పట్టడం, వ్యవసాయం, పర్యాటకం, త్రాగునీటితో పాటు చమురు, గ్యాస్ నిల్వల కోసం కాస్పియన్పైనే ఆధారపడతాయి. ఆనకట్టలు, అధిక వెలికితీత, కాలుష్యం, పెరుగుతున్న వాతావరణ సంక్షోభంతో కాస్పియిన్ క్షీణిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఈ క్షీణత వేగవంతమవుతోంది. 130 నదుల నుంచి కాస్పియన్ సరస్సులోకి నీరు ప్రవేశిస్తుంది. అందులో 80 శాతం నీరు ఒక్క ఓల్గా నది నుంచే వస్తుంది. ఐరోపాలోనే పొడవైన నది ఓల్గా. దీనిపై రష్యా 40 ఆనకట్టలను నిర్మించింది. మరో 18 నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాస్పియన్కి నీటి ప్రవాహాన్ని తగ్గించాయి. ఓల్గా దిగువ ప్రాంతాలు అనేక పారిశ్రామిక కేంద్రాలకు నిలయంగా ఉన్నందున, రసాయన, జీవ కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. ఈ క్షీణతలో వాతావరణ మార్పులు సైతం కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ నుంచి వచ్చే కాలుష్యం కూడా కాస్పియన్‌ను దెబ్బతీస్తోంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు బాషీ్పభవన రేటును పెంచి.. అస్తవ్యస్తమైన వర్షపాతానికి కారణమవుతున్నాయి. చమురు వెలికితీత, ఇతర పరిశ్రమల నుంచి వస్తున్న కారకాలతో కాస్పియన్ కలుíÙతమవుతోంది. వీటన్నింటితో.. కాస్పియన్ నీటి మట్టం పడిపోవడం 1990 మధ్య నుంచే ప్రారంభమైంది. 2005 నుంచి ఈ వేగం పెరిగింది. సుమారు 5 అడుగుల నీటిమట్టం తగ్గిందని జర్మనీలోని బ్రెమెన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్ సిస్టమ్స్ మోడలర్ మాథియాస్ ఫ్రాంజ్ వెల్లడించారు. ఈ శతాబ్దం చివరి నాటికి 8 నుంచి 18 మీటర్లు (26 నుంచి 59 అడుగులు) క్షీణించే అవకాశం ఉందని పరిశోధన ఒకటి అంచనా వేసింది. సంక్షోభంలోకి ఐదు దేశాలు... సరస్సు క్షీణత.. దీనిపై ఆధారపడి ఉన్న ఐదు దేశాలను సంక్షోభంలోకి నెడుతోంది. చేపలు పట్టడం, పర్యాటకం తగ్గిపోతుంది. ఓడరేవు నగరాల్లో నౌకలు దిగడం సమస్యగా మారడంతో షిప్పింగ్ పరిశ్రమ దెబ్బతింటుంది. దేశాల మధ్య రాజకీయంగానూ కీలక పరిణామాలు సంభవిస్తాయి. వనరుల కోసం పోటీ పెరుగుతుంది. చమురు, గ్యాస్ నిల్వలపై కొత్త విభేదాలకు దారితీస్తుంది. ఇక కాస్పియన్‌ను ఆవాసంగా చేసుకున్న ప్రత్యేకమైన వన్యప్రాణుల పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉంది. వందలాది జంతుజాలానికి నిలయమైన అడవి కూడా అంతరించనుంది. కానీ నీరు తగ్గుముఖం పట్టడం వల్ల దాని లోతుల్లో ఆక్సిజన్ స్థాయిలు క్షీణిస్తాయి. దీంతో కొంత కాలానికి అందులోని జంతుజాలం తుడిచిపెట్టుకుపోతుంది. కాస్పియన్ సముద్రంలో అనేక రకాల స్టర్జన్ జాతులు ఉన్నాయి. ఈ చేప అత్యంత విలువైన, రుచికరమైన కేవియర్‌ను ఇస్తుంది. ప్రపంచంలోని కేవియర్‌లో 80–90% మధ్య కాస్పియన్ నుంచే ఉత్పత్తి అవుతుంది. కానీ కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. స్టర్జన్ చేపలు వేగంగా కనుమరుగవుతున్నాయని, త్వరలో అంతరించిపోయే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. ఇది బయటకు కనిపించని ఒక భారీ సంక్షోభం. సముద్ర క్షీరదాలైన కాస్పియన్ సీల్స్కు కూడా ప్రమాదకర సంకేతం. ఈ సంక్షోభానికి పరిష్కారాలు తక్కువ. ఇందుకు ఏ ఒక్క దేశాన్ని నిందించలేమని, కానీ సమిష్టి చర్యలు తీసుకోవడంలో విఫలమైతే అరల్ సముద్ర విపత్తు పునరావృతం అవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర మట్టాలు పెరుగుతుంటే కాస్పియన్ ఎందుకు తగ్గుతోంది? వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలను పెంచుతున్నాయి. కానీ కాస్పియన్ వంటి భూపరివేష్టిత సరస్సులది భిన్నమైన కథ. ఇవి నదుల నుంచి ప్రవహించే నీరు, వర్షపాతం సమతుల్యతపై ఆధారపడతాయి. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ఈ సమతుల్యత దెబ్బతింటోంది. దీంతో అనేక సరస్సులు కుంచించుకుపోతున్నాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఎక్కువ శ్రమా అక్కర్లేదు. ఎందుకంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల మధ్య ఉన్న అరల్ సముద్రం దాదాపు అంతరించిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సరస్సులలో ఒకటిగా ఉన్న అరల్.. ఇప్పుడు అంతంతమాత్రంగా మిగిలింది. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్‌లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలుష్యంతో ఊళ్లన్నీ ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, కామారెడ్డి / భిక్కనూరు : కాలుష్యం కోరలు చాస్తోంది. పీల్చే గాలి, తాగేనీరు కలుషితమవుతోంది. జనం రోగాల బారిన పడుతున్నారు. విషవాయువులు పల్లెల్ని కమ్మేస్తుండడంతో భరించలేకపోతున్నారు. తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ఉపాధి ఏమోగాని రోగాలు వెన్నాడుతున్నాయి. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, తలమడ్ల, తదితర గ్రామాల పరిసరాల్లో ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇతర పరిశ్రమలు, కోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. అయితే పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల మూలంగా దుర్వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటు న్నారు. పరిశ్రమల నుంచి వదిలే వ్యర్థాలతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోందని, ఆఖరుకు భూ గర్భజలాలు కూడా దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రం పరిధిలో నెలకొల్పిన ఓ ఫార్మా కంపెనీతో తాము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ కాచాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 57 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు పొరుగున ఉన్న పెద్దమల్లారెడ్డి, అయ్యవారిపల్లి, సంగమేశ్వర్, మాందాపూర్, అంతంపల్లి తదితర గ్రామాల ప్రజలు కూడా సంఘీభావం తెలిపారు. వ్యర్థాలతో తామూ ఇబ్బంది పడుతున్నామని పే ర్కొంటూ వారితో జతకలిశారు. అలాగే ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో భూగర్భజలాలు కూడా కలుషితమై, ఆ నీళ్లు తాగిన వారంతా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల వ్యర్థాలన్నీ పంట చేలగుండా కాలువలు, వాగుల్లోకి చేరి నీరు కలుషితమవుతోంది. గతంలో చెరువులోకి వ్యర్థాలు వెళ్లడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. మొక్కుబడి తనిఖీలు.. పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులు మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీ మూలంగా తాము పడుతు న్న ఇబ్బందులపై 57 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పీసీబీ అధికారులు ఇటువైపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 44వ నంబరు జాతీయ రహదారిపై భిక్కనూరు మండలంలో అడుగుపెట్టగానే ఆయా పరిశ్రమల నుంచి వెలుబడుతున్న వాసనలతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్లు, ఇతర వాహనాల అద్దాలన్నీ మూ సి ఉంచినా దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
భద్రాచలంలో మిషన్ భగీరథ నీరు కలుషితం
-
జలమే గరళమై! గద్వాలలో ఘోరం.. 100 మందికి అస్వస్థత, ఇద్దరు మృతి
గద్వాల రూరల్: కలుషిత తాగునీరు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచే సుకుంది. గద్వాల పట్టణం 12వ వార్డుకు చెందిన వేదనగర్, గంటగేరి, ధరూరుమెట్టు, కృష్ణారెడ్డి బంగ్లా కాలనీల్లో మూడు రోజుల కిందట తాగునీరు కలుషితమై పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గంటగేరికి చెందిన కృష్ణ (50), మంగలి నర్సింగమ్మ (59) సైతం వాంతులు విరేచనాలతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో చేరారు. చదవండి👉🏾వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా కృష్ణ పరిస్థితి విషమంగా మారడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అలాగే ఈ నెల 4 నుంచి జిల్లా ఆస్ప త్రిలో మంగలి నర్సింగమ్మ చికిత్స పొందుతు న్న క్రమంలో బుధవారం ఆమె పరిస్థితి విష మించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతులిద్దరూ పక్క పక్క వీధుల వారే కావడంతో ఆ కాలనీలో విషాదం నెలకొంది. కాగా, 12వ వార్డులోని 4 కాలనీల్లో వాంతులు, విరేచనాలతో 3 రోజు లుగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 24 మంది చికిత్స పొందుతున్నారు. గద్వాల ప్రైవేట్ ఆస్ప త్రుల్లో 70–75 మంది చికిత్స తీసుకుంటుండగా వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. చదవండి👉🏾తాగేనీళ్లు లేకున్నా..మద్యం ఏరులై పారుతోంది కలుషిత నీటితోనే.. ఈ నెల 4న వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న కేసులు గుర్తించాం. వెంటనే వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కలుషిత నీటి ప్రభావానికి గురైన కాలనీలో సర్వే చేపట్టాం. మృతి చెందిన ఇద్దరూ వాంతులు, విరేచనాల బారినపడినవారే. అయితే వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో వైద్యం అందించే సమయంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతి చెందారు. అస్వస్థతకు గురైన వారి నుంచి రక్తనమూనాలతోపాటు వారు వినియోగించే నీటి నమూనాలు సేకరించాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రాథమికంగా ఇలాంటి కేసులు నీటి కలుషితం కారణంగానే తలెత్తుతాయి. – చందూ నాయక్, డీఎంహెచ్ఓ, గద్వాల -
నలుపు రంగులోకి గోదావరి నీరు.. ప్రమాదం తప్పదు.. జాగ్రత్త!
బాల్కొండ/నిజామాబాద్: శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీరు కలుషితమవుతోంది. నీరు నలుపు రంగులోకి మారిందని, దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ అధికంగా ఉన్నప్పుడు ఎగువ నుంచి వదిలిన వ్యర్థాలు నీటిలో కలిసి పోయి దిగువకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం తక్కువగా ఉన్న నీటి నిల్వతో వ్యర్థాల ప్రభావం ఏర్పడుతోంది. ఎగువ భాగాన మహారాష్ట్రలో అధికంగా ఉన్న ఫ్యాక్టరీలు విడుదల చేసిన వ్యర్థాలు నదిలో కలిసి ఎస్సారెస్పీలోకి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీరు కలుషితమవుతుండటంతో ప్రాజెక్ట్‌లో చేపలకు ప్రమాదం పొంచి ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో పాప్లెట్ రకం చేపలు మాత్రమే లభిస్తున్నాయని, అక్కడక్కడా మధ్యలో పెద్ద పెద్ద చేపలు మృతి చెందుతున్నట్లు తెలిపారు. నీటి నిల్వ తగ్గి ప్రాజెక్ట్‌లో చేపలకు ఆక్సిజన్ అందక గతంలో అనేక చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ కోసం ప్రతి రోజు 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. నీరు కలుషితమైతే తాగు నీటికి కూడ ఇబ్బందే అవుతుంది. ఎంత ప్యూరిఫైడ్ చేసినా రసాయానాలు కలిసిన నీరు తాగడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. పరీక్షలకు పంపుతాం.. ప్రాజెక్ట్‌లోని నీరు ప్రస్తుతం అధికంగా దుర్వాసన వస్తోంది. కొద్దిగా రంగు కూడ మారుతోంది. ఉన్నతాధికారులకు ఇది వరకే నివేదించాం. నీటిని పరీక్షలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీ తాగునీరే సేఫ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన ఏపీలోని బోరు, బావుల్లోని తాగునీరే అత్యంత సురక్షితమని తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీటికి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో వంద శాంపిల్స్కుగాను 14 నమూనాల్లో వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారు. కానీ, మన రాష్టంలో మాత్రం వందకు నాలుగు శాంపిల్స్‌లో మాత్రమే అవి ఉన్నట్లు తేలింది. ఈ పరీక్షల ఫలితాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. అలాగే, ఏపీలో మూడు నాలుగేళ్ల కిందట నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఎక్కువగా కనిపించేవని.. అయితే, గత మూడేళ్లగా రాయలసీమ జిల్లాలతో సహా రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. కాలుష్య కారకాలు.. వాటితో దుష్ఫలితాలు.. వైద్యులు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. ► మెర్క్యూరీ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► క్లోరైడ్ కారకం ఉండే నీటిని తాగితే రక్తపోటు వ్యాధులకు గురవుతుంటారు. ► లెడ్ వంటివి చిన్న పిల్లల ఎదుగుదల మీద, పెద్దల్లో కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ► ఇక ఫ్లోరైడ్‌తో కీళ్ల వ్యాధులు రావడంతో చిన్న వయస్సులో పళ్లు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో.. ప్రజల తాగునీటిలో కలుషిత కారకాలను గుర్తించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2.60 లక్షల బోర్లు, బావుల్లో నీటికి ఏటా ఒకసారి.. అలాగే, దాదాపు 50 వేలకు పైబడి రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసే నీటికి ఏటా రెండు విడతల చొప్పున ఆర్డబ్ల్యూఎస్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలు చేపడుతుంది. ఇక ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 107 నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లు ఉండగా, వాటిల్లో మొత్తం 21 రకాల కలుషిత కారకాలను గుర్తించే సౌలభ్యం ఉంది. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్ మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో 47,03,476 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా.. అందులో మన రాష్ట్రం అత్యధికంగా 4,04,083 నమూనాలకు నిర్వహించింది. తర్వాత మధ్యప్రదేశ్ 4,01,022 శాంపిల్స్‌కు.. పశ్చిమ బెంగాల్లో 3,82,846 శాంపిల్స్‌కు పరీక్షలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా 3 లక్షల మించి పరీక్షలు నిర్వహించలేదు. నీటి నాణ్యతలోనూ ఏపీ చాలా మెరుగు మరోవైపు.. గత ఏడాది ఏపీలో పరీక్షలు నిర్వహించిన 4,04,083 శాంపిల్స్‌లో కేవలం 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం శాంపిల్స్‌లో ఇది 4.15 శాతం మాత్రమే. అదే సమయంలో దేశం మొత్తం మీద 47,03,476 నీటి శాంపిల్స్‌కు నిర్వహించిన పరీక్షల్లో 6,73,687 శాంపిల్స్‌లో కలుషిత కారకాలు బయటపడ్డాయి. అంటే ఇది 14.32 శాతం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక నీటి కాలుష్యం ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. -
Pudami Sakshiga:అడవి సృష్టికర్త "దుశర్ల సత్యనారాయణ"
-
ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?
భూగోళంలో 71 శాతం మేర నీరు ఆవరించి వుంది. అందుకే భూమిని ‘నీటి గోళం’ అని అంటుంటాం. జీవరాశుల ఉనికికి నీరే ప్రధాన కారణం. సుమారు 65 నుంచి 75 శాతం మేర జీవుల దేహాల్లో నీరే వున్నది. మన దేహంలో ఒక శాతం మేర నీరు తగ్గినట్లైతే దాహార్తిని కలిగిస్తుంది. అదే 10 శాతం మేర తగ్గితే ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఈ నీరే స్వేదం రూపంలో మానవుల్ని, భాష్పోత్సేకం ద్వారా మొక్కల్ని ఎండ వేడిమికి వడలిపోకుండా కాపాడుతుంది. ఉష్ణానికి నీరు వాహకంగా ఉపయోగపడుతూ, సూర్యతాపం నుంచి భూగోళాన్ని కాపాడుతుంది. మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకునే పిండి పదార్థానికి అవసరమయ్యే హైడ్రోజన్ మూలకాన్ని నీరే అందిస్తుంది. రాబోయే కొద్దిరోజుల్లో నీరే హైడ్రోజన్ ఇంధనంగా రూపు దిద్దుకుంటుందనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. నీరు ముఖ్యంగా తాగడానికి, వంట చేయడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, మురికిని కడగడానికి అవసరమవుతున్న సంగతి తెలిసిందే. ఉపయోగపడే నీరు కొంచెమే! నీటి గోళమైన భూమిపై నీటి కష్టాలు అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది పచ్చి నిజం. ఇందుకు ముఖ్యకారణం 97 శాతం ఉప్పు నీరుగా సముద్రాల్లోను, 2 శాతం ధ్రువాల్లో మంచు గడ్డల రూపంలో వుండి మొత్తం 99 శాతం మేర వినియోగార్హత కోల్పోవడమే. మనకు ఉపయోగపడుతున్న నీరు అత్యల్పం. భూమి మీద ఉన్న నీరంతా 100 లీటర్లుగా భావిస్తే మనకు ఉపయోగంగా వుండేది కేవలం 3 మిల్లీ లీటర్లు. అంటే, వంద లీటర్లకు అర టీ స్పూనంతన్న మాట! నీరు లేని జీవనాన్ని ఊహించుకోలేం. అందుకే మన ప్రాచీన నాగరికతలన్నీ నదీ తీర ప్రాంతాల్లోనే రూపుదిద్దుకోవడం చూస్తాం. గత 2 వేల సంవత్సరాల కాలంలో ప్రపంచ జనాభా 50 రెట్లు పెరిగినా నీటి వనరుల్లో ఏ మాత్రం మార్పు లేదు. దీనికి తోడు పారిశ్రామిక, హరిత విప్లవాల వలన, నీటి వినియోగం అనూహ్యంగా పెరిగింది. అంతే కాకుండా, వున్న పరిమిత నీటి వనరుల్ని కలుషితం చేసి నీటి సమస్యను తీవ్రతరం చేసుకుంటున్నాం. ఒకటికి 8 లీటర్లు కలుషితం నీరు విశ్వవ్యాప్తంగా లభించే ఏకైక సహజ ద్రావకం. ఎన్నోరకాల మలినాల్ని తనలో కరిగించుకోగలదు. ఈ ధర్మమే నీటి నాణ్యతను దెబ్బతీస్తున్నది. దీనికి తోడు వ్యర్థాలను పలుచబర్చడం ద్వారా కాలుష్యాన్ని పరిష్కరించవచ్చు అనే మూఢ నమ్మకం.. అన్నీ కలిసి నదులు, సరస్సులు, సముద్రాలను తీవ్ర కాలుష్యానికి గురి చేస్తున్నాయి. ఒక లీటరు కలుషిత నీరు ఇంచుమించు 8 లీటర్ల శుద్ధ జలాన్ని కలుషితం చేయగలదు. వీటన్నిటికి తోడు భూతాపం నీటి సమస్యను తీవ్రతరం చేస్తున్నది. సకాలంలో వర్షాలు రావు, వస్తే పడవలసిన చోట పడవు. పడితే అతివృష్టి, తుపాన్లు, వరదలు లేకపోతే అనావృష్టి, కరువు కాటకాలు, ఆకలి చావులు. ఒక్క మాటలో చెప్పాలంటే కలుషిత నీరు యుద్ధం కంటే ప్రమాదకారి. ఎక్కువ ప్రాణాల్ని బలిగొంటుంది. 80 శాతం జబ్బులు నీటి వనరుల ద్వారానే సంక్రమిస్తూ ప్రపంచస్థాయి చావుల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రతి రోజు 6 వేల మంది పిల్లలు డయేరియా, మలేరియా మొదలగు వ్యాధులతో చనిపోవడానికి నీరే కారణమవుతోంది. దీనికి తోడు ఫ్లోరైడ్, నైట్రేట్, ఆర్సెనిక్ (పాషాణం), సైనైడ్, పాదరసం మొదలగునవి నీటి కాలుష్యాన్ని జటిలం చేస్తున్నాయి. పారిశ్రామికంగా ముందంజలో వున్న అమెరికా నీటి వనరుల్లో వెయ్యికి పైగా కాలుష్య కారకాలున్నట్లు తేలింది. 3 లీటర్లు తోడుకుంటే ఇంకుతున్నది లీటరే నీటి కాలుష్యం, నాణ్యత లోపాలకు తోడుగా, 2025 నాటికి ప్రపంచ జనాభాలో మూడు వంతుల్లో రెండు వంతులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కోబోతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా. మనదేశం విషయానికొస్తే.. ప్రపంచ జనాభాలో 19 శాతం ఉన్న మన జనాభా అవసరాలకు, ప్రపంచ నీటి వనరుల్లో మనకున్న 4 శాతం నీటి వనరులతో సరిపెట్టుకోవలసి వస్తోంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక వర్షపాతం గల ప్రదేశంగా గతంలో గణుతికెక్కిన చిరపుంజి ప్రాంతం సైతం, తీవ్ర నీటికొరతను ఎదుర్కొంటున్నది. రానురాను నీటికోసం పోరాటాలు తప్పవేమో అనిపిస్తోంది. మనకు సరఫరా అవుతున్న నీటిలో 68 శాతం వరకు ఆవిరి కావడమో లేక కారిపోవడమో జరుగుతున్నదని ఓ అంచనా. నీటి ఎద్దడి తీవ్రతను అధిగమించడానికి భూగర్భ జలాల్ని లోతుల్లోంచి వెలికితీసి దుర్వినియోగానికి పాల్పడుతున్నాం. భూగర్భం నుంచి మనం వెలికితీసే ప్రతి 3 లీటర్ల నీటికి, ఒక లీటరు వర్షం నీటిని మాత్రమే భూమిలోకి ఇంకించగలుగుతున్నాం. ఇందువల్ల తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి భూమి కుంగిపోతోంది. భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారుతున్నాయి. పర్యవసానంగా భూమిలోపలి పొరల్లో శూన్యం ఏర్పడి తీరప్రాంతంలోని జనావాస నిర్మాణాలు భూమిలోకి కుంగిపోతున్నాయి. చమురు, సహజ వాయువుల వెలికితీత మూలంగా కూడా మనరాష్ట్రంలో కృష్ణా.. గోదావరి బేసిన్లో భూమి కుంగిన సంఘటనలు ఉన్నాయి. భూమి కుంగడంతో పాటు భూగర్భ జలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు రావటం సర్వసాధారణం. జల రవాణా మార్గాలు, మురుగు నీటి కాల్వల వల్ల కూడా ఉప్పు నీరు భూగర్భ మంచినీటిలో కలిసే ప్రమాదాలున్నాయి. ఒకటికి 40 అడుగుల మేర ఉప్పు నీరు వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ, జనాభా పెరుగుదల, జీవనోపాధికై వలసలు సహజంగానే నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. దీనికితోడు వాతావరణ ఒడిదుడుకులు, వర్షాభావ పరిస్థితులు నీటి లభ్యత, నాణ్యతలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పర్యవసానంగా లెక్కకు మిక్కిలి బోరుబావులను తవ్వి లోతు నుంచి ఎక్కువ నీరు తోడేస్తున్నారు. దానివల్లా భూగర్భజల మట్టం గణనీయంగా పడిపోతోంది. ఆ మేర పీడనం తగ్గడంతో సమీపంలోని సముద్రపు నీరు మంచినీటితో కలుస్తోంది. దాంతో ఈ నీరు తాగటానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు (మత్స్య పరిశ్రమ, ఉప్పు తయారీ పరిశ్రమలకు మినహాయించి) పనికిరావటం లేదు. భూగర్భంలోని మంచినీటి మట్టం ఒక అడుగుమేర తగ్గినట్లైతే, సుమారు 40 అడుగుల మేర ఉప్పు నీరు అనూహ్యంగా పైకి ఎగబాకి భూగర్భంలోని మంచినీటిని ఉప్పు నీరుగా మారుస్తుందని ఒక అంచనా! నీటి కొరత నీటి నాణ్యతను, ఆ కలుషిత నీరు ప్రజల ఆరోగ్యాన్ని, నేల సారాన్ని, వ్యవసాయాన్నీ దెబ్బతీస్తోంది. ఏదైనా ఒక రంగానికి దారులు మూతబడుతున్నాయంటే, ఇంకో రంగానికి దారులు తెరుచుకుంటున్నాయి అని అనుకోవాలి. తీర ప్రజల జీవనోపాధులపై ప్రభావం ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారినందున ఆయా ప్రాంతాల్లో రైతులు వ్యవసాయానికి స్వస్తి పలికి, చేపలు, రొయ్యల పెంపకానికి శ్రీకారం చుట్టారు. భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారినందున మత్స్యకారులే కాదు సమీప పట్టణ, నగరవాసులూ మంచి నీటిని కొనుక్కొని తాగవలసి వస్తున్నది. జల కాలుష్య నివారణ, శుద్ధి కార్యక్రమాలు, తాగునీటి సరఫరా పేరుతో కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు, పలురకాల జీవనోపాధులు ఏర్పడుతున్నాయి. సముద్రపు ఆహార ఉత్పత్తులు, ఎగుమతులు, వాణిజ్యం పెరగడం వలన జీవనోపాధులతోపాటు స్థూల జాతీయోత్పత్తి కూడా పెరిగి దేశ ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందనటంలో సందేహం లేదు. ఆహారం లేకుండా ఓ 60 రోజులు ఉండగలమేమో గానీ, నీరు తాగకుండా 60 గంటలు ఉండటం అసాధ్యం. నీటిని సంరక్షించుకోవడానికి మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులు, నేడు మనకున్న నవీన పద్ధతులను మేళవించి నీటివనరుల్ని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ఉమ్మడి వనరులాంటి నీటిని వాడుకోవడంలో ఆసక్తి, కాపాడుకోవడంలో అనాసక్తి జగమెరిగిన సత్యం. నీటి కొరతకు తోడు దుర్వినియోగం కూడా సమస్య జటిలమవడానికి కారణమవుతోంది. ప్రకృతిలోనే పరిష్కారం! నేడు నీటికి పాలతో సమాన ధర చెల్లించి కొంటున్నాం. ఇప్పుడు మనం వాడుకుంటున్న 700 క్యూబిక్ కిలోమీటర్ల నీరు కాక, ఇంకో 1000 క్యూబిక్ కిలోమీటర్ల నీరు మన దేశానికి కావలసి వుంటుంది. కొత్త నీటి వనరులను వెదుకుతూ... వున్న వనరుల్ని దుర్వినియోగపర్చకుండా తెలివిగా, పొదుపుగా వాడుకోవాలి. మన పూర్వీకులు పాటించిన నీటి యాజమాన్య పద్ధతులు హర్షణీయం. అనుసరణీయం. ఎప్పుడు ఎక్కడ వర్షం పడితే అక్కడ పట్టి దాచుకో, వాడుకో. బకెట్ సాన్నం, బిందు సేద్యంలాంటి పద్ధతులు నీటిని బాగా ఆదా చేస్తాయి. చాలా సమస్యలకు ప్రకృతే మనకు పరిష్కారం చూపుతుంది. ఇది ప్రకృతిని నిశితంగా పరిశీలిస్తే బోధపడుతుంది. ప్రకృతిలో, అడవులు, సరస్సులు, మైదాన భూములు, వర్షపు నీటిని పట్టి వుంచి మనకు నిరంతరాయంగా అందిస్తుంటాయి. వాటిని ధ్వంసం చేసి నీటి సమస్యల్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఎడారి ప్రాంతవాసులకు తెలిసినంత నీటి యాజమాన్యం మరి ఇంకెవ్వరికీ తెలియదు. కనుక వారి పద్ధతులను గమనించాలి. ఆపై ఆచరణలో పెట్టాలి. బెంజిమన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు బావుల్లో నీరు ఎండిపోయిన నాడు మనకు నీటి విలువ బాగా తెలిసివస్తుంది. -డా. ఈదా ఉదయ భాస్కర్ రెడ్డి విశ్రాంత ఆచార్యులు, పర్యావరణ శాస్త్ర విభాగం, ఆంధ్రా విశ్వవిద్యాలయం చదవండి: Pudami Sakshiga: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే! -
అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!
కెనడా: గ్రీన్‌ల్యాండ్‌కి సరిహద్దుగా ఉన్న కెనడాకి ఉత్తర ప్రాంతమైన నునావుట్ రాజధాని ఇకాలూయిట్‌లో భూగర్భ జలాల్లోని తాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ల్యాబ్ అధికారులు ఆ నగరంలోని వాటర్ ట్యాంక్ నుంచి సేకరించిన తాగు నీటిలో ఇంధన ఆయిల్లు అధిక స్థాయలో ఉన్నట్లు నిర్థారించారు. (చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు) ఈ సందర్భంగా ఇకాలుయిట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ అమీ ఎల్గర్స్మా మాట్లాడుతూ...."భూగర్భ జల కాలుష్యం కారణంగా ట్యాంక్‌లోని నీటిలో అధికంగా ఇంధన వాసన వస్తుండవచ్చు. బహుశా ఆ వాసన డీజిల్ లేదా కిరోసిన్‌కి సంబంధించిన వాసన కావచ్చు. సురక్షితమైన నీరు అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ నీటిని ప్రజలు ఉపయోగించవద్దు. నీటిని కాచినప్పటికీ ఆ వాసన పోదని పైగా మీరు మీ ట్యాంకులోని నీటిని ఎప్పటి నుంచి వినయోగించుకోవచ్చో కూడా మేమే తెలియజేస్తాం" అని అన్నారు. ఈ మేరకు ఈ నీటిని వినియోగిస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఎక్కువ అంటూ నునావుట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైఖేల్ ప్యాటర్సన్ ప్రజలను హెచ్చరించారు. తాగు నీటి సమస్య ఒక తీరని సమస్యగా ఉందంటూ..కెనడా లిబర్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. 2015లో అన్ని మరుగు నీటి సమస్యలను పరిష్కిరిస్తానన్న హామీతోనే జస్టిన్ ప్రధానిగా ఎన్నికవ్వడం గమనార్హం. (చదవండి: నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!) -
మానవ తప్పిదం: వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టే!
వడ్రంగి పిట్టలంటే తెలియని వారుండరు. ముఖ్యంగా పల్లెల్లో స్వేచ్ఛగా విహరిస్తూ సందడి చేస్తుంటాయి. అవి రాత్రి పూట తమ పొడవాటి ముక్కును పదును చేసుకోవటం కోసం చెట్టు బెరడను గీకుతూ ఒక రకమైన శబ్ధం చేస్తుంటాయి. పైగా ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా చూపరులను కట్టిపడేసేలా ఉంటాయి. అలాంటి ఈ వడ్రంగి పక్షులు ఇక లేవని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అసలేం జరిగిందో ఏమిటో తెలుసుకుందామా! న్యూయార్క్: వడ్రంగి పిట్టలాంటి కొన్ని అరుదైన ప్రసిద్ధ పక్షి జాతులు, కొన్ని రకాలైన చేపలతో సహా దాదాపు 23 రకాల జాతులు అంతరించిపోయినట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ 23 జాతులు అంతరించిపోయినట్లు మాత్రమే కనుగొన్నట్లు పేర్కొంది. కానీ క్రమంగా మొక్కలు, జంతువులు కూడా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని వన్య ప్రాణి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు అవి అంతరించిపోవడానికి ఓ కారణంగా తెలిపారు. భవిష్యత్‌లో ఇలా అంతరించిపోయేది మనకు ఇక సాధారణం కావచ్చని చెబుతున్నారు. (చదవండి: ‘విమాన సేవలను తిరిగి పునరుద్ధరించండి’) ఇటీవల దశాబ్దాలుగా అర్కాన్సాస్, లూసియానా, మిసిపిప్పి, ఫ్లోరిడా వంటి ప్రాంతాలతోపాటు ఆఖరికి చిత్తడి నేలలు ఉండే ప్రాంతాల్లో కూడా చేసిన పరిశోధనల్లో వడ్రంగి పిట్టల ఆచూకీ లభించలేదని యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ యూఎస్‌లోని మొలస్క్లు (నత్తలు, పీతలు) ఉండే తాగునీటి సరస్సుల్లో ఎక్కువగా ఈ వడ్రంగి పిట్టలు ఉంటాయని తెలిపారు. చివరిసారిగా ఆ ప్రాంతంలోనే చూసినట్లు యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ జీవ శాస్త్రవేత్త ఆంటోనీ ఆండి ఫోర్డ్ పేర్కొన్నారు. నీటి కాలుష్యం, పక్షుల ఈకల కోసం వాటిని చంపడం, అడవుల నరికివేత తదితర కారణాలతోపాటు మానవ తప్పిదాలే అవి అంతరించిపోవడానికి ప్రధాన కారణమని వెల్లడించారు. (చదవండి: పాకిస్తాన్ వైపుగా వెళ్తున్న గులాబ్ తుపాన్) -
రెండేళ్ల కింద హడావుడి.. తరలింపు అంతా కాగితాల్లోనే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ బయటికి తరలించాలన్న నిర్ణయం కాగితాలకే పరిమితం అవుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బో ర్డు, పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ విభాగాల మధ్య సమన్వయ లోపంతో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో పరిశ్రమలున్న ప్రాంతా లు, ఆ చుట్టుపక్కల నివసించే లక్షలాది మంది కాలుష్యంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల కింద హడావుడి హైదరాబాద్ సిటీలో ఉన్న కాలుష్య పరిశ్రమలను దశల వారీగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల అవతలి ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రెండేళ్ల కింద హడావుడి చేసింది. రెడ్, ఆరంజ్ కేటగిరీల కిందికి వచ్చే అత్యంత కాలుష్య కారక 500 కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించాలని.. మరో 600 బల్‌్కడ్రగ్, ఫార్మా, అనుబంధ కంపెనీలను ముచ్చర్లలో ఏర్పాటుచేస్తు న్న ఫార్మాసిటీకి మార్చాలని నిర్ణయించింది. ఏడాది కింద జహీరాబాద్, వికారాబాద్ ప్రాంతాలకు పరిశ్రమల తరలిం పు కోసం అవసరమైన స్థలాలను గుర్తించినట్లు టీఎస్ఐఐసీ వర్గాలు ప్రకటించాయి. కానీ అడుగు ముందుకుపడలేదు. ఏయే ప్రాంతాల్లో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా బల్క్ డ్రగ్, ఆయిల్, ఇంటరీ్మడియెట్స్, ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు, స్టీలు విడిభాగాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలను శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండటంతో జల వనరులన్నీ కాలుష్య కాసారంగా మారాయి. సిటీ పరిధిలో సుమారు 100 చెరువులు ప్రమాదకర స్థాయికి చేరినట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే తొలుత ఆయా పారిశ్రామికవాడల్లోని కాలుష్య కారక కంపెనీలను తరలించాలని నిర్ణయించారు. పరిశ్రమ వర్గాల అభ్యంతరాలివే.. ప్రభుత్వం తరలించాలని నిర్ణయించిన సుమారు 1,100 కంపెనీల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయని.. వాటిల్లో సమీప ప్రాంతాలకు చెందిన వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. వాటిని ఒకేసారి నగరానికి దూరంగా తరలిస్తే.. కార్మికులకు ఉపాధి దూరమవుతుందని, అటు పరిశ్రమలకు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తరలింపును మధ్యతరహా, భారీ పరిశ్రమలకే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిశ్రమల వల్ల గాలి, నీళ్లు, భూమి అన్నీ కలుషితం అవుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్, సల్ఫర్ ఉద్గారాలతో కొన్ని ప్రాంతాల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో సిటీలోని వందల చెరువులు, కుంటలు విషపూరిత రసాయనాలతో ప్రమాదకరంగా మారాయి. మరోవైపు పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, ద్రవరూప వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండడంతో మెర్క్యురీ, లెడ్, ఆర్సెనిక్ వంటి భార లోహాలు, మూలకాలు, విషపూరిత రసాయనాలు నేలలోకి చేరుతున్నాయి. భూగర్భ జలాలు సైతం కాలుష్యకాసారంగా మారుతున్నాయి. కాలుష్యానికి కళ్లెం వేసేదిలా? పరిశ్రమల కలుషితాలను నియంత్రించేందు కు పలు నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. దీనిపై పర్యావరణ నిపుణులు కూడా పలు సూచనలు చేశారు. పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట, నాలాలు, చెరువులు, కుంటల్లో పారబోస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి. సంబంధిత పరిశ్రమలను మూసేసేందుకు ఆదేశాలివ్వాలి. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసేందుకు తప్పనిసరిగా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. వాటిని ఏర్పాటు చేయకుంటే అనుమతులు ఇవ్వొద్దు. పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కాలుష్య ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలి. నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని పీసీబీ, జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్ కార్యాలయాలకు అనుసంధానించి నిఘా పెట్టాలి. హైదరాబాద్ సిటీలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను కట్టడి చేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. మార్గదర్శకాల ప్రకారం నడుచుకోని కంపెనీల మూసివేతకు ఆదేశాలిస్తున్నాం. – పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాట ఇదీ.. సిటీ నుంచి కాలుష్య పరిశ్రమలను వికారాబాద్, జహీరాబాద్, ముచ్చర్ల ఫార్మా సిటీ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో ఏడాదిలోగా ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. – పరిశ్రమలశాఖ వాదన ఇదీ.. పరిశ్రమలను తరలించేందుకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం. త్వరలోనే తరలింపు పూర్తవుతుంది. – టీఎస్ఐఐసీ అభిప్రాయమిదీ.. -
మంచి నీళ్లే వారి కొంప ముంచాయా?
సాక్షి, కామారెడ్డి: జిల్లా లోని గాంధారి మండలం గుడి వెనుక తండా గ్రామ పరిధిలోని మర్లకుంట తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారు తాగిన మంచినీటితోనే అనారోగ్యం బారినపడ్డట్టు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన రామావత్ మేగ్యా, చిలుకా భాయి కుటుంబంలోని 11 మంది కుటుంబ సభ్యుల్లో నిన్న రాత్రి చిన్నారి శ్రీనిధి (9) ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాధితుల్లో 10 నెలల బాలుడు శ్రీకాంత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బాధితులు సేవించిన మంచినీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పరీక్షా ఫలితాలు రానున్నాయి. (చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) -
కుంటల శుభ్రతకు తీసుకున్న చర్యలేంటి?
సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాలు, బతుకమ్మ పూల నిమిజ్జనం నిమిత్తం ఏర్పాటు చేసిన చిన్న కుంటలను శుభ్రం చేసేందుకు తీసుకున్న చర్యలు ఏంటో తెలపాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కూకట్పల్లి చెరువు నీటి కలుషితంపై పత్రికల్లో వచ్చిన వార్తను పిల్‌గా పరిగణించిన హైకోర్టు గురువారం మరోసారి విచారించింది. చిన్న విగ్రహాల నిమజ్జనం చేసేందుకు 24 కుంటల్ని ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది. దీంతో వాటిని శుభ్రం చేసేందుకు తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. విచారణను మార్చి 5కు వాయిదా వేసింది. -
పాతాళ గరళం
సాధారణంగా లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములు మించరాదు. కానీ పలు పారిశ్రామికవాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదైంది. ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలను నిర్మానుష్య ప్రదేశాల్లో, నాలాల్లో డంప్ చేస్తుంటారు. ఇవి నేరుగా భూమి పొరల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్/జీడిమెట్ల/సనత్‌నగర్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పాతాళగంగ భయంకరమైన కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పారిశ్రామికవాడల్లోని భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) తాజా నివేదిక నిగ్గుదేల్చింది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలను నాలాలు, చెరువులు, కుంటలు, బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా వదిలిపెడుతుండటం.. అవి భూమిలోకి ఇంకడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని అధ్యయనం తేల్చింది. ఈ నీళ్లు పశుపక్ష్యాదుల దాహార్తిని సైతం తీర్చలేవని, మొక్కలకు పట్టడానికి, బట్టలు ఉతకడానికి, పాత్రలు శుభ్రం చేయడానికి, స్నానానికి పనికిరావని స్పష్టం చేసింది. చుక్క నీరూ స్వచ్ఛం లేదు.. గతేడాది వర్షాకాలానికి ముందు (మే–2019), ఆ తరువాత (జనవరి–2020) సుమారు 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాల, చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షలు నిర్వహించింది. సాధారణంగా లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములు మించరాదు. కానీ పలు పారిశ్రామికవాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదైంది. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాలు సేకరించి.. పరీ క్షించగా వచ్చిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు నీటి నమూనాల్లో ఆర్సెనిక్, లెడ్ జింక్ తదితర భారలోహాల ఆనవాళ్లున్నట్టు పరీక్షల్లో తేలింది. ఎన్జీఆర్ఐ నివేదిక నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’బృందం ఆయా ప్రాంతాల్లోని భూగర్భజలాల నాణ్యత, ఆ నీటితో స్థానికులు పడుతున్న అవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సాక్షి విజిట్.. గతేడాది కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో బోర్లు వేయగా రసాయన జలాలతో కలుషిత నీళ్లు పడ్డాయి. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో వందలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతి 10 మీటర్లకు ఒక బోరు ఉంది. ప్రస్తుతం బోరు వేయాలంటే వెయ్యి నుంచి 1,600 అడుగుల లోతుకు వెళ్తేనే నీటి జాడ తెలుస్తోంది. ఒక్కో ప్లాట్‌లో రెండు మూడు బోర్లు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మోటారు వేయగానే ఎరుపు, పసుపు పచ్చని రంగులో నీళ్లొస్తున్నాయి. కొన్నిచోట్ల నీరు రంగు లేకున్నా.. వాసన ముక్కుపుటాలు అదరగొడుతోంది. ఈ నీటితో గిన్నెలు, వాహనాలు కడిగితే వాటిపై మరకలు, తుప్పు వస్తున్నాయి. జీడిమెట్ల: నీళ్లు తాగాలంటే హడలే జీడిమెట్లలో వందకుపైగా ఫార్మా, బల్క్‌డ్రగ్ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే వ్యర్థ రసాయన జలాలను 1983 నుంచి ఇప్పటివరకు ఖాళీ ప్రదేశాల్లో, ఓపెన్ నాలాల్లో గుట్టుచప్పుడు కాకుండా డంప్ చేస్తున్నారు. ఫలితంగా ఈ పారిశ్రామికవాడలోని భూగర్బ జలాలు విషతుల్యమయ్యాయి. బోర్లు తవ్వగా వచ్చిన నీరు దాదాపు రసాయనాలను పోలి ఉంటుంది. బోరు మోటార్ వేయగానే ఎరుపు, పసుపు పచ్చని రంగులో నీళ్లు ఎగదన్నుతాయి. దీంతో రోజూ ఇక్కడి ఒక్కో కుటుంబం.. కుటుంబసభ్యుల అవసరాలకు తగినట్టు నీటిని కొనాల్సిందే. 20 లీటర్ల డబ్బాకు రూ.30 నుంచి రూ.50 వరకు పెడుతున్నారు. దీంతో ప్రతి నెలా ఒక్కో కుటుంబం పాల బిల్లుతో సమానంగా నీటి బిల్లు చెల్లిస్తోంది. ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థ రసాయనాలను అర్ధరాత్రి దాటాక నిర్మానుష్య ప్రదేశాల్లో, నాలాల్లో, పరిశ్రమ లోపల పాడుబడిన బోరు బావుల్లో డంప్ చేస్తుంటారు. ఇవి నేరుగా భూమి పొరల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. జీడిమెట్లలో బోరు నుంచి వస్తున్న రసాయన జలం 30 ఏళ్లుగా విషాన్ని చూస్తున్నా.. 30 ఏళ్లుగా నేనిదే ప్రాంతంలో ఉంటున్నాను. రోజురోజుకూ భూగర్భ జలాలు విషపూరితమైపోతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రసాయనాలను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భావితరాలకు మంచినీరు దొరకడం కష్టమే. – శ్రీనివాస్, ఎస్ఆర్ నాయక్‌నగర్ సనత్‌నగర్: కలుషితంతో సతమతం దేశంలో తొలి పారిశ్రామికవాడగా పేరొందిన సనత్‌నగర్ పారిశ్రామికవాడలో ‘భూగర్భ జలం’హాలాహలమైంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను చెరువులు, కుంటలు, నాలాల్లోకి వదులుతుండటంతో వ్యర్థ రసాయన జలాలు భూగర్భంలోకి ఇంకి పాతాళగంగ కలుషితమైంది. జీడిమెట్ల, కూకట్పల్లి, ఫతేనగర్ పారిశ్రామికవాడల నుంచి వచ్చే విషజలాలు హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే నాలాలో కలుస్తుంటాయి. ఈ నాలా సనత్‌నగర్ పారిశ్రామికవాడను ఆనుకుని ఉండడంతో భూగర్భ జలం విషపూరితమవుతోంది. ఇక్కడ భూగర్భ జలం రంగు మారి వస్తుండడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి ఉంది. ఫిల్టర్ నీళ్లు కొంటున్నాం.. బోరు నీళ్లు రంగు మారి వస్తున్నాయి. తాగేందుకు ఫిల్టర్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తుంటాం. దీని ద్వారా మాకు అదనపు భారమే. ఒక్క జలమండలి నీరు మాత్రమే అయితే సరిపోవడం లేదు. – శివప్రసాద్, లోథా కాసాపారడిసో అపార్ట్మెంట్ -
కలుషితం.. నదీజలం
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలను తడిపి సిరులు కురిపించే నదీ జలాలు స్వచ్ఛమైనవి కావా? వీటిల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందా? దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవా? అనే ప్రశ్నలకు అవుననే హెచ్చరిస్తోంది కేంద్ర జల్‌శక్తి శాఖ. గోదావరి, కృష్ణా, పెన్నా, కుందూ, నాగావళి, మానేరు, కిన్నెరసాని తదితర నదుల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ), డిసాల్వ్డ్ ఆక్సిజన్(డీవో), క్షార స్వభావం (పీహెచ్) ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా నివేదిక తేల్చింది. ఈ నదుల్లోని నీటిలో కోలి బ్యాక్టీరియా,కరిగిన ఘన పదార్థాల(టీడీఎస్) శాతం ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర నదులతో పోల్చితే వంశధారలో కాలుష్య ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 323 నదుల్లో కాలుష్య ప్రభావంపై కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి(సీపీసీబీ), అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు(పీసీబీ), కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. సీపీసీబీ ప్రకారం నీటి స్వచ్ఛత ప్రమాణాలు ఇవీ.. - మనుషులు తాగడానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్ (మోస్ట్ పాపులర్ నంబర్) వంద మిల్లీ లీటర్లకు 50 లోపు ఉండాలి. పీహెచ్ శాతం 6.5 వరకు ఉండవచ్చు. లీటర్ నీటికి డీవో ఆరు మిల్లీ గ్రాములు, బీవోడీ 2 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. - మనుషులు స్నానానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్ వంద మిల్లీలీటర్లకు 500 వరకు ఉండవచ్చు. పీహెచ్ 6.5 శాతం వరకు ఉండవచ్చు. లీటర్ నీటికి డీవో 5 మిల్లీగ్రాములు, బీవోడీ మూడు మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. - అడవి జంతువులు తాగడానికి, చేపల జీవనం, పెంపకానికి వినియోగించే నీటిలో పీహెచ్ 6.5 శాతం, డీవో లీటర్ నీటికి నాలుగు మిల్లీ గ్రాముల దాకా ఉండవచ్చు. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం... - గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, నాగావళి, కుందూ, మానేరు, కిన్నెరసానిలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. - తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే నదుల్లో కోలి బ్యాక్టీరియా మోతాదు పరిమితి దాటింది. డీవో, బీవోడీ, పీహెచ్ శాతం కూడా అధికంగా ఉంది. శుద్ధి చేయకుండా నదీ జలాలను తాగితే మూత్రపిండాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. - తెలుగు రాష్ట్రాల్లో అన్ని నదులతో పోల్చితే తుంగభద్రలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. తుంగభద్ర జలాల్లో ఘన వ్యర్థాలు ఒక లీటర్ నీటిలో గరిష్టంగా 347 మిల్లీగ్రాములున్నాయి. ఇష్టారాజ్యంగా గనుల తవ్వకం, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు చేరడమే దీనికి ప్రధాన కారణం. - కుందూ నదిలో కోలి బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు గరిష్టంగా 900(టి.కోలి 800, ఎఫ్.కోలి 100) ఉండటం గమనార్హం. - వంశధార నదీ జలాల్లో పీహెచ్, డీవో, బీవోడీ, టి.కోలి, ఎఫ్.కోలి, టీడీఎస్ శాతం ఇతర నదులతో పోల్చితే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదు. - నదీ జలాల్లో కాలుష్య తీవ్రత వల్ల వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మత్స్య సంపద కూడా అంతరిస్తోంది. కాలుష్యానికి ప్రధాన కారణాలు - పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటిని నదుల్లోకి పెద్ద ఎత్తున వదలడం. - విచ్చలవిడిగా గనుల తవ్వకం. ఏం జరుగుతుంది? పరిస్థితులు ఇలాగే కొనసాగితే నదీ జలాలు స్నానానికి కూడా పనికి రావు శుద్ధి చేయని నదీ జలాలను తాగితే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది -
జలమా.. గరళమా!
సాక్షి, అమరావతి: ఒక లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాముల పరిమాణంలో ‘ఆర్శనిక్’ ధాతువులు ఉంటే వాటిని విషంగా పరిగణిస్తారు. అలాంటిది ఒక లీటర్ నీటిలో 0.02 నుంచి 0.05 మిల్లీగ్రాముల పరిమాణంలో ఆర్శనిక్ మూలాలు ఉంటే.. ఆ నీటిని కాలకూట విషంగా భావిస్తారు. ఆ నీటిని తాగినా, నిత్యావసరాలకు వినియోగించుకున్నా చర్మ, జీర్ణాశయ, కాలేయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ల బారినపడక తప్పదు. రాష్ట్రంలో ఆర్శనిక్ ధాతువుల ప్రభావం వల్ల కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో భూగర్భ జలాలు భారీ ఎత్తున కలుషితమైనట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనంలో వెల్లడైంది. మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పాత నల్గొండ జిల్లా పరిధిలోనూ భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఆర్శనిక్ మూలాలు ఉన్నట్లు తేలింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఆర్శనిక్ మూలాలు అత్యధిక స్థాయిలో ఉన్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొంది. భూగర్భ జలాల్లో ఆర్శనిక్ ధాతువులు అధిక మోతాదులో ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసరాలకు నదీ జలాలను సరఫరా చేయాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. కాగా, దేశంలో ఉపరితల, భూగర్భ జలాలపై సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భాగీరథి (గంగా) నదీ పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాల్లో ఆర్శనిక్ మూలాలు ఉన్నట్లు 1980లోనే సీడబ్ల్యూసీ గుర్తించింది. ఆర్శనిక్ విషతుల్యమైన పదార్థం. కఠిన శిలాజాల్లో ఆర్శనిక్ మూలకం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో తక్కువ ఇటీవల దేశవ్యాప్తంగా భూగర్భ జలాలపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, అసోం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగా సహా 20 రాష్ట్రాల్లోని 98 జిల్లాల్లో ఆర్శనిక్ ధాతువు వల్ల భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేల్చింది. భూగర్భ జలాల కలుషిత ప్రభావం ఉత్తర భారతదేశంతో పోల్చి చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉంది. దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో రాయచూర్, యాద్గిర్ జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్శనిక్ ధాతువు మోతాదు అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తేల్చింది. రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్శనిక్ మూలాల మోతాదు అధికంగా ఉంది. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఒక లీటర్ నీటిలో 0.02 మిల్లీగ్రాములు.. గుంటూరు రూరల్ మండలంలో లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాముల చొప్పున ఆర్శనిక్ ఉన్నట్లు వెల్లడైంది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం రతనలో ఒక లీటర్ నీటిలో 0.02 మిల్లీగ్రాములు.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం కష్టంపహాడ్లో 0.03 మిల్లీగ్రాముల చొప్పున ఆర్శనికధాతువులు ఉన్నట్లు తేలింది. తెలంగాణలోని పాత నల్గొండ జిల్లా పరిధిలోని సూర్యాపేటలో లీటర్ భూగర్భ జలంలో 0.02 మిల్లీగ్రాములు, చివెములలో 0.01 మిల్లీగ్రాముల వంతున ఆర్శనిక్ మూలాలు ఉన్నట్లు స్పష్టమైంది. భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఆర్శనిక్ ఉండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలి ఆర్శనిక్ మోతాదుకు మించి ఉన్న నీటిని నిత్యావసరాలకు వినియోగించినా చర్మ, జీర్ణాశయ, కాలేయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సిందేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్శనిక్ ధాతువు వల్ల భూగర్భ జలాలు కలుషితమైన ప్రాంతాల్లో నదీ (ఉపరితల) జలాలను నిత్యావసరాల కోసం సరఫరా చేయాలని కేంద్ర జలసంఘం నివేదిక ఇచ్చింది. భూ ఉపరితలానికి వంద మీటర్ల లోతు వరకే ఆర్శనిక్ ప్రభావం ఉంటుంది. నదీ జలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు బోరు బావిని తవ్వి.. భూగర్భ జలాలను వెలికి తీసి.. వాటిని పరీక్షించి.. ఆర్శనిక్ ధాతువుల ప్రభావం లేదని నిర్ధారించాకనే వాటిని నిత్యావసరాల కోసం సరఫరా చేయాలని సూచించింది. -
కంపుకొడుతున్న గ్రామాలు
సాక్షి, కొత్తూరు : ప్రత్యేకాధికారుల పాలనలోనూ పంచాయతీల్లో ప్రత్యేకత కానరావడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీల్లో పూడికలు, వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతుండడంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. అంటు రోగాలు వ్యాపిస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపుకొడుతున్న గ్రామాలు కొత్తూరు మండలంలో మండల కేంద్రంతో పాటు నివగాం, దిమిలి, పారాపురం, కలిగాం అఫీషియల్ కాలనీ, ఎన్ఎన్ కాలనీతో పాటు మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ఎల్.ఎన్.పేట మండలంలో ఎల్‌ఎన్‌పేట, యంబరాం, గొట్టిపల్లి, దబ్బపాడు తదితర గ్రామాల్లో మురుగుకాలువల్లో పూడిక తీతపనులు చేపట్టకపోవడంతో వీధుల్లో మురుగునీరు ప్రవహిస్తోంది. హిరమండలం మండలంలో రెల్లివలస, పిండ్రువాడ, హిరమండలం, మహలక్ష్మీపురం తదితర గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. మెళియాపుట్టి మండలంలో చాపర, చీపురుపల్లి, గొప్పిలి గ్రామాల్లో ఆరు నెలలుగా పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. పాతపట్నం మండలంలో మండల కేంద్రంతో పాటు ఏఎస్ కవిటి, నల్లబొంతు, బూరగాంతో పాటు మరికొన్ని గ్రామాల్లో అపారిశుద్ధ్యం అలముకుంది. స్పందించని అధికారయంత్రాంగం పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తికావడంతో వారిస్థానంలో ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే పంచాయతీ నిధులు ఖర్చు చేసేందుకు వారికి పూర్తిస్తాయిలో అధికారాలు ఇవ్వకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో మురుగు కాలువల్లో పూడికలు పేరుకుపోయాయి, వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిసుతన్నాయి. దుర్గంధం, దోమలుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా అధికారులు, పాలకుల్లో స్పందన లేకపోవడం దారుణం. నిరుపయోగంగా చెత్త సేకరణ రిక్షాలు స్వచ్ఛభారత్ లక్ష్యంలో భాగంగా అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. గ్రామాల్లోని చెత్తను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించేందుకు ప్రతీ పంచాయతీకి చెత్త సేకరణ రిక్షాలు కేటాయించారు. అయితే వాటిని ఇప్పటి వరకు వినియోగించిన దాఖలాలు లేవు. వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన రిక్షాలు మూలకు చేరాయి. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన చెత్తశుద్ధి కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బోరు చుట్టూ మురుగు మంచినీటి బోరు చుట్టూ మురుగునీరు చేరడంతో బోరుకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. – బొమ్మాలి నగేష్, కొత్తూరు రోగాల బారిన పడుతున్నాం మురుగుకాలువల్లో పూడికలు పేరుకుపోవడంతో ఇళ్ల ముందు మురుగు నిల్వ ఉంటోంది. దుర్గంధంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. రోగాల బారిన పడుతున్నాం. కూలి డబ్బులు మందులకే సరిపోతున్నాయి. – పి.రాజేశ్వరి, బీసీ కాలనీ, కొత్తూరు ఇళ్లలో ఉండలేకపోతున్నాం మురుగుకాలువలు నిండిపోవడంతో రోడ్డుపై నుంచి మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షం కురిస్తే మురుగునీరు ఇళ్లలోకి చేరుతోంది. దుర్గంధం వెదజల్లుతుండడంతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. – కొయిలాపు రాజారావు, కొత్తూరు ఇళ్ల ముందు నిల్వ ఉంటోంది కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో ఇంట్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మేమే కాలువలను శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. – నిద్దాన లక్ష్మమ్మ, రెల్లి వీధి పారిశుద్ధ్య పనులు చేపడతాం మండలంలోని పలు పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించినట్లు గుర్తించాం. వెంటనే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అక్కడి సిబ్బందికి ఆదేశించాం. అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – నారాయణమూర్తి, ఈవోపీఆర్డీ, కొత్తూరు -
‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు’
పెరుగుతున్న జనాభాతో పాటు మన దేశంలో కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. తినే తిండే, తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతీది కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో గాలి కూడా విషమవడం చూస్తూనే ఉన్నాం. ఈ నగరాల చుట్టూ ఉన్న చెరువులు కాలుష్య కాసారాలు అవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఈ కాలుష్య భుతాన్ని మాత్రం అదుపు చేయలేకపోతుంది. అయితే సమస్యకు కారణమవుతోన్న మనుషుల్లో మార్పు రానవంత వరకూ.. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ఇదే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు హీరోయిన్ రష్మిక మందన్న. నీటి కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేశారు రష్మిక. కర్ణాకటలోని అతి పెద్ద చెరువైన బెళ్లందూర్‌లో ఫోటో షూట్ చేశారు. అనంతరం ఈ ఫోటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘గొప్ప టీమ్‌తో కలిసి నీట కాలుష్యం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాను. బెల్లందూర్ చెరువు దగ్గరకు వచ్చి చూసే వరకూ దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ చెరువు ఎంత అందంగా ఉండేదో గుర్తొచ్చి నా గుండే బద్దలయ్యింది. ప్రతి చోట ఇలానే ఉంది. ఇలాంటి చోట ఉండాలని నేనైతే అనుకోను. మీతో పంచుకోవాలి అనిపించి చెబుతున్నా’ అంటూ రష్మిక ట్వీట్ చేశారు. Well wasn't aware of this till we had to actually go and shoot this in Bellandur lake..which like really broke my heart,and imagine few years down the line..it’s the same case everywhere else..😱 I’d rather not want to be in that space.. I just wanted to share 🤷 (2/2) pic.twitter.com/zshJLDwW6s — Rashmika Mandanna (@iamRashmika) December 13, 2018 అయితే కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత కలుషితమైన చెరువుగా బెళ్లందూర్ నిలిచింది. కొన్ని రోజుల క్రితం ఈ చెరువు నుంచి మంటలు కూడా ఎగసి పడ్డాయి. -
అధికారమున్నా.. చర్యలు సున్నా!
సాక్షి, హైదరాబాద్: మురుగునీటి నిర్వహణ నిమిత్తం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బు ఎటుపోతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంలో కూడా చూపాలని, అప్పుడే నీటి వనరులు కాలుష్య రహితంగా ఉంటాయని వెల్లడించింది. రాజకీయ, అర్థ బలానికి అధికార యంత్రాంగం తలొగ్గకుండా బాధ్యతలు నిర్వర్తిస్తే ఎటువంటి సమస్యలు ఉండవంది. చెరువులు, ఇతర నీటి వనరుల్లోకి మురుగు నీరు వదిలే వారిని చట్ట ప్రకారం నియంత్రించే అధికారమున్నా, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బుధవారం హైకోర్టు వాటర్‌బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులను నిలదీసింది. చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదని అభిప్రాయపడింది. జంట నగరాల్లోని చెరువుల్లోకి మురుగు నీరు వస్తున్న పాయింట్లను ఎందుకు గుర్తించలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించింది. ఈ మార్గాలను గుర్తించి మూసివేస్తే తప్ప ప్రయోజనం ఉండదని, వీటిని మూయకుండా ఉంటే చెరువులను శుద్ధి చేసినా ప్రయోజనం ఉండదని తెలిపింది. మురుగు నీటి నిర్వహణ నిమిత్తం ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల డబ్బును సక్రమంగా వినియోగిస్తే మురుగు నీటి సమస్య ఉండదని తెలిపింది. ఈ విషయంలో అధికారులు సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. తాజా చర్యలతో మరో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. చెరువుల్లోకి మురుగు నీరు చేరవేస్తున్న పాయింట్లను గుర్తించేందుకు మరో వారం గడువునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మరోసారి విచారించింది. అలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది.. భారీ స్థాయిలో నిర్మించే అపార్ట్మెంట్లలో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటే సమస్య తీవ్రత చాలా వరకు తగ్గించవచ్చునని విచారణలో కోర్టు అభిప్రాయపడింది. వ్యాపార సముదాయాలు, చిన్న తరహా పరిశ్రమలు కూడా మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాల్సిన అవసరముందని తెలిపింది. బకెట్లలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం గురించి ప్రస్తావన రాగా, ఇది చాలా బాగుంటుందని.. అందరూ దీనిని పాటిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ధర్మాసనం వెల్లడించింది. తాజా వివరాలతో ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
నీటి కాలుష్యానికి కొత్త విరుగుడు!
నీటికాలుష్యాన్ని శుద్ధి చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. ఇనుముకు కొన్ని ఇతర లోహాలను మిశ్రమం చేసి ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేసిన లోహపు పట్టీలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నీటిలో కలిసిన రంగులు, భారలోహాలను తొలగిస్తాయని వీరు అంటున్నారు. వస్త్ర పరిశ్రమతోపాటు గనుల ద్వారా కూడా భారీ ఎత్తున భారలోహాలు, రంగులు నీటిలో కలుస్తున్న విషయం తెలిసిందే. వీటిని తొలగించేందుకు ఇప్పటికే కొన్ని పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మెటాలిక్ గ్లాసెస్ తయారీకి ఉపయోగించే పద్ధతితో లోహపు పట్టీలను తయారు చేశారు. ఈ పట్టీల్లోని పరమాణువులు అన్నీ ఒక క్రమపద్ధతిలో అమరి ఉండటం వల్ల వీటిమధ్య ఎలక్ట్రాన్ల ఆదాన ప్రదానాలు సులువుగా జరిగిపోతాయని.. ఫలితంగా ఇవి కాలుష్యాలను నేరుగా ఆకర్షించగలవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లైచాంగ్ ఝాంగ్ అంటున్నారు. టన్ను నీటిలోని కాలుష్యాలను తొలగించేందుకు కేవలం 700 రూపాయల విలువ చేసే పట్టీలు సరిపోతాయని.. ఒక పట్టీని కనీసం ఐదుసార్లు వాడుకునే అవకాశం ఉందని వివరించారు. కేవలం మంచినీరు, కార్బన్‌డయాక్సైడ్‌లు మినహా మిగిలిన ఏకాలుష్యం కూడా ఈ పద్ధతి ద్వారా వెలువడదని చెప్పారు. -
గంగా ప్రక్షాళన గంగపాలు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నా అంతట నేను ఇక్కడికి రాలేదు. నన్ను ఎవరూ ఇక్కడికి పంపించ లేదు. తల్లి గంగనే నన్ను ఇక్కడికి రప్పించిందని భావిస్తున్నాను’ అని 2014, ఏప్రిల్ 24వ తేదీన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అదే రోజు ఆయన వారణాసి నుంచి లోక్‌సభకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను బాబా బోలేనాథ్ ఆశీర్వాదంతో శబర్మతి ఆశ్రమాన్ని ఎలా తీర్చిదిద్దానో అలాగే వారణాసిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను అని కూడా మోదీ అదే రోజు సాయంత్రం తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే వారణాసికి వచ్చి గంగకు హారతి ఇచ్చారు. గంగానది ప్రక్షాళన కోసం 20,000 కోట్ల రూపాయలతో ‘నమామి గంగా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గంగా నదిలో కాలుష్యం శాతం 2014లో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గంగా నది ప్రక్షాళనకు మొత్తం 20 వేల కోట్ల రూపాయలను కేటాయించగా, వాటిని 2020 అంటే, మరో రెండేళ్లలో ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన ప్రాజెక్టుల పూర్తి ఎంత వరకు వచ్చాయో తెలుసుకునేందుకు మీడియా ఆర్టీఐ కింద పలు దరఖాస్తులు దాఖలు చేయగా, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మురుగు కాల్వల ప్రక్షాళన, పారిశ్రామిక వ్యర్థాల ట్రీట్మెంట్, గంగా నది ఉపరితలం క్లీనింగ్ కోసం నమామి గంగా పథకంలో భాగంగా కేంద్రం 221 ప్రాజెక్టులను ప్రకటించింది. వాటికి 2,238.73 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. 221 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 58 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టుల్లో 26 శాతం ప్రాజెక్టులు మాత్రమే పూర్తయినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. 105 సీవరేజ్, ఎస్టీపీ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రాజెక్టులన్నింటినీ 2019, మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మూడేళ్ల కాలంలో 26 శాతానికి మించి పూర్తికాని ప్రాజెక్టులను వచ్చే ఆరేడు నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ఆయనకే తెలియాలి. ఆయనకంటే ముందు జల వనరుల శాఖ మంత్రిగా గంగా నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించిన ఉమా భారతి 2017, ఫిబ్రవరి 21వ తేదీన మీడియాతో మాట్లాడుతూ 2018, జూలై నెల నాటికి ప్రాజెక్ట్ పూర్తికాకపోతే గంగానదిలోనే దూకి ఆత్మార్పణం చేసుకుంటానని శపథం చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాకపోతే గంగా నది ఒడ్డున ఆమరణ దీక్ష చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆమె శపథాలు, ప్రతిజ్ఞల సంగతి పక్కన పెడితే ఆమె ఆధ్వర్యంలో పనులు మందగమనంతో కూడా నడవడం లేదని గ్రహించిన మోదీ ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో ఆమెను జలవనరుల శాఖ నుంచి తప్పించి, ఆ శాఖను నితిన్ గడ్కరీకి అప్పగించింది. మునుపటికన్నా ఇప్పుడు గంగా జలాల కాలుష్యం శాతం పెరిగిందంటే ప్రాజెక్టుల పేరిట ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన సొమ్మంతా గంగ పాలేనా? అని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. -
మూసీదెబ్బ!
నీరు లేకుంటే మనిషి లేడు.. జీవరాశి అంతా జలంపైనే ఆధారపడి జీవిస్తోంది. ఇప్పుడు ఈ నీరు గ్రేటర్ వాసులను కలవరపెడుతోంది. నేలను తవ్వితే ఉబికి వచ్చే పాతాళగంగ మహానగరంలో కలుషితమైంది. మూసీ పరీవాహక ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషతుల్యంగా మారినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ భూవిజ్ఙాన శాస్త్ర విభాగంనిపుణులు తేల్చారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో అధ్యయనం చేయగా భార లోహాలు భారీ స్థాయిలో కరిగి ఉన్నట్టు గుర్తించారు. ప్రధానంగా బాపూఘాట్–ఫీర్జాదీగూడ(44 కి.మీ) మార్గంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలనమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఆయా నమూనాల్లో కరిగిన ఘన విష పదార్థాలు అధికంగా ఉండడంతో నీటి రంగు పసుపు రంగులోకి మారినట్లు గుర్తించారు. ఈ నీటిలో ప్రమాదకరమైన ఆర్సెనిక్, లెడ్, జింక్‌తో పాటు మెగ్నీషియం, సెలీనియం, బోరాన్ తదితరాల ఆనవాళ్లు కనిపించడంఆందోళన కలిగిస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో భూగర్భ జాలలను ఉపయోగించుకోలేని దుస్థితి నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూవిజ్ఙాన శాస్త్ర విభాగం నిపుణుల తాజా అధ్యయనం ఇక్కడి నీరు భారలోహాలతో నిండిపోయాయని తేల్చింది. ఈ జలాలు కనీసం బట్టలుతకడం, పెంపుడు జంతువులు దాహార్తి తీర్చుకోవడం, గార్డెనింగ్ వంటి అవసరాలకూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మూసీలోకి నిత్యం పారిశ్రామిక వాడల నుంచి వచ్చి చేరుతున్న గరళజలాల్లో భార లోహాల ఉనికి ఉండడం.. కరిగిన ఘన పదార్థాల మోతాదు అధికంగా ఉండడంతో ఈ నీరు భూగర్భంలోకి క్రమంగా ఇంకుతున్న వైనంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు తేల్చారు. జల కాలుష్యం అధికంగాఉన్న ప్రాంతాలు.. భోలక్‌పూర్, ముషీరాబాద్, రాంనగర్, నల్లచెరువు, ఫీర్జాదీగూడ, ఉప్పల్, లంగర్‌హౌజ్, అంబర్పేట్, గోల్నాక, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్. భూగర్భ జలాల్లో ఉన్న భార లోహాలివీ.. సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, బోరాన్, అల్యూమినియం, క్రోమియం, మ్యాంగనీస్, నికెల్, ఆర్సెనిక్, జింక్, లెడ్. ప్రధాన కారణాలివీ.. ⇔ మూసీలోకి దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థజలాలు చేరుతున్నాయి. ఈ జలాలు క్రమంగా భూగర్భంలోకి ఇంకుతున్నాయి. ⇔ రోజువారీగా గ్రేటర్లో 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో 700 మిలియన్ లీటర్ల నీటినే శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ⇔ మిగతా 700 మిలియన్ లీటర్ల జలాలు ఎలాంటి శుద్ధి కాకుండానే మూసీలో కలుస్తున్నాయి. ⇔ ఇందులో సుమారు 350 మిలియన్ లీటర్ల మేర పారిశ్రామిక వ్యర్థ జలాలున్నాయి. ఈ నీరు క్రమంగా భూగర్భంలోకి చేరుతుండడంతో భూగర్భజలాలు గరళంగా మారాయి. పారిశ్రామిక వాడల్లో పరిస్థితి ఇదీ.. మహానగరం పరిధిలోని 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాల, చెరువుల నీటి నమూనాలను గతంలో ఎన్జీఆర్ఐ (జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ) సేకరించి పరీక్షించింది. ప్రధానంగా నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లో కరిగిన ఘన పదార్థాలు అధికంగా ఉండడంతో పాటు భారలోహాల ఉనికి బయటపడింది. మోతాదు మించి ఘన పదార్థాలు ⇔ నాచారం– ఉప్పల్ ప్రాంతాల్లోని నీటి నమూనాలో కరిగిన ఘన పదార్థాల ఉనికి (టీడీఎస్) 1970 మి.గ్రా/లీటర్ నమోదైంది. ⇔ మాల్లాపూర్ ఐడీఏ ప్రాంతంలో నీటి నమూనాలో టీడీఎస్ 1720 ఎంజీ/లీ నమోదైంది. ⇔ చర్లపల్లి ఐడీఏలోని నమూనాలో టీడీఎస్ 2140 ఎంజీ/లీ నమోదైంది. ⇔ కాటేదాన్ ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1860 ఎంజీ/లీ నమోదైంది. ⇔ బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని నీటి నమూనాలో టీడీఎస్ 1530 ఎంజీ/లీ నమోదైంది. ⇔ ఖాజీపల్లి ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1810 ఎంజీ/లీ నమోదైంది. ⇔ బొంతపల్లి ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1280 ఎంజీ/లీ గా ఉంది. ⇔ పటాన్చెరు– బొల్లారం– పాశమైలారం ప్రాంతాల్లోని నీటి నమూనాల్లో టీడీఎస్ 1890 ఎంజీ/లీ నమోదైంది. ⇔ ఎన్జీఆర్ఐ చేసిన పరీక్షల్లోనూ ఇదే తరహా భారలోహలు ఉన్నట్టు నిర్ధారించింది. అనేక లోహాలు ప్రమాదస్థాయి మించకపోయినా ఏళ్లతరబడి పరిశ్రమల నుంచి విచక్షణారహితంగా విడుదల చేసిన రసాయన వ్యర్థాలకు ఇది నిదర్శమని పేర్కొంది.