నీటి కాలుష్యం లేకుండా నానో ఫెర్టిలైజర్స్‌ను మొక్కల పెరుగుదలకు ఉపయోగించొచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
బెంగళూరు: నీటి కాలుష్యం లేకుండా నానో ఫెర్టిలైజర్స్‌ను మొక్కల పెరుగుదలకు ఉపయోగించొచ్చని పరిశోధకులు కనుగొన్నారు. అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు.
జింక్ నానోపార్టికల్స్ అనే ఫెర్టిలైజర్స్‌తో మొక్కలను పెంచొచ్చని వారు నిరూపించారు. ‘జింక్‌నానోపార్టికల్స్ వాడకంతో నీటి కాలుష్యం తగ్గింది. దీని ద్వారా ఫాస్ఫరస్, నైట్రోజన్ వాడకం తగ్గించొచ్చు’ వాషింగ్టన్ వర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ చైర్మన్ చెప్పారు.