
సాక్షి, కామారెడ్డి: జిల్లా లోని గాంధారి మండలం గుడి వెనుక తండా గ్రామ పరిధిలోని మర్లకుంట తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారు తాగిన మంచినీటితోనే అనారోగ్యం బారినపడ్డట్టు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన రామావత్ మేగ్యా, చిలుకా భాయి కుటుంబంలోని 11 మంది కుటుంబ సభ్యుల్లో నిన్న రాత్రి చిన్నారి శ్రీనిధి (9) ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాధితుల్లో 10 నెలల బాలుడు శ్రీకాంత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బాధితులు సేవించిన మంచినీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పరీక్షా ఫలితాలు రానున్నాయి.
(చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం)
Comments
Please login to add a commentAdd a comment