స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్, న్యూస్‌లైన్ : వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రభు త్వ ఆస్పత్రుల్లో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ ఎం.మాణిక్యరావు సూచించా రు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. వైద్య సేవలు, సౌకర్యాలు, రోగుల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడా రు.
పీహెచ్‌సీకి వస్తున్న ప్రతీ జ్వరం కేసును తక్షణమే పరీక్షించి మలేరియా, డయేరియా అని తేలితే సరైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. గ్రామాల్లో నీటి కాలుష్యం, పరిసరాల పరిశుభ్రత, దోమల నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పీహెచ్‌సీలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. గర్భిణులు ప్రభు త్వ ఆస్పత్రిలోనే ప్రసూతి చేసుకోవాలని, జననీ సురక్ష పథకం కింద వారికి అంబులెన్స్, ఉచిత భోజనం, వైద్య సేవలు, మందులు అం దిస్తున్నట్లు తెలిపారు.
ఘన్‌పూర్ పీహెచ్‌సీలో కుక్క, పాము కాటుకు మందులు, 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఎక్స్‌రే ప్లాంట్‌ను త్వరలో బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీ వెంట డాక్టర్ శ్రీదేవి, వైద్య సిబ్బంది తదితరులున్నారు.
ప్రభుత్వ వైద్యం వినియోగించుకోవాలి : డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
కొత్తూరు(రాయపర్తి) : ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను వినియోగించుకుని ఆరోగ్యాలను కాపాడుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు కోరారు. మండలంలోని కొత్తూరులో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబి రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రులకు పూర్తి స్థాయిలో మందులు అందించామని చెప్పారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు వ్యక్తిగత, పరి సరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవన్నారు.
గ్రామాల్లో క్లోరినేషన్, సానిటేషన్ పనుల నిర్వహణను ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, పంచాయ తీ కార్యదర్శులు, వీఆర్‌ఓలు, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి పని చేయాలన్నారు. గర్భసంచుల తొలగింపు ఘటనలపై విచారణ జరుపుతున్నామని, వైద్యులే దోషులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజ లు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆర్‌ఎం పీలను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో తలెత్తే అనారోగ్య సమస్యలపై స్థాని క వైద్యులు స్పందించని పక్షంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు. సాంబశివరావు వెంట ఎస్‌పీహెచ్‌ఓ లు డాక్డర్ సాంబశివరావు, కృష్ణారావు, స్థానిక వైద్యాధికారిణి రజిత తదితరులున్నారు.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
Published Tue, Aug 20 2013 2:38 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement