పుడమికీ... తల్లికీ కడుపు కోతే! | Water pollution causes increased in India more than other countries | Sakshi
Sakshi News home page

పుడమికీ... తల్లికీ కడుపు కోతే!

Published Thu, Jan 30 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

పుడమికీ... తల్లికీ కడుపు కోతే!

పుడమికీ... తల్లికీ కడుపు కోతే!

యూరియా, నైట్రోజన్, ఫాస్పేట్, పొటాషియం (ఎన్‌పీకే) తదితర సబ్సిడీ ఎరువుల వాడకం ఏకంగా 9 రెట్లు పెరిగింది. వ్యవసాయ రసాయనాలకు పారిశ్రామిక కాలుష్యం తోడవడంతో చైనా, అమెరికాల్లో కన్నా భారత్‌లో నీటి కాలుష్యం అధికంగా పెరిగింది.
 
 దేశంలో మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక పురుగుమందులు ప్రజారోగ్యానికి చేటు తెస్తున్నాయన్నది తెలిసిందే. రసాయనిక ఎరువుల వల్ల కూడా తీరని హాని కలుగుతోం ది. వీటితో కలుషితమైన నీరు మహిళా వ్యవసాయ కార్మికులకు కడుపు కోతను మిగుల్చు తున్నది. మృత్యువాతపడుతున్న ఏడాది లోపు వయసు పిల్లల్లో 75% మంది పుట్టిన నెల లోపే కన్నుమూస్తున్నారు. దీనికి మూల కార ణం నీటిలోని రసాయనిక ఎరువుల అవశేషా లేనని బ్రాండీస్ విశ్వవిద్యాలయం (అమెరికా) అధ్యయనంలో తేలింది. రసాయనిక ఎరువు లు అధిక మోతాదులో వాడుతున్న పొలాల్లో, ముఖ్యంగా వరి, గోధుమ పొలాల్లో, పనులు చేసే మహిళలు నీటి కాలుష్యం బారినపడుతు న్నారని.. వారి పురిటి బిడ్డలే అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. ఆర్థికశాస్త్ర విభాగానికి చెందిన ఎలిజబెత్ బ్రైనెర్డ్, నిధియ మీనన్ సంయు క్తంగా ఈ అధ్యయనం చేశారు.
 
 నీటి నాణ్యత గణాంకాలు, శిశువుల ఆరో గ్యానికి సంబంధించిన గణాంకాలను విశ్లేషిం చడం ద్వారా.. రసాయనిక ఎరువుల దుష్ర్ప భావం ఆయా ప్రాంతాల్లో జన్మించిన శిశువు లపై ఎలా ఉంటున్నదీ వారు పరిశీలించారు. నదులు, వాగులు, వంకలు, చెరువులు, సర స్సులు, కాలువల్లో నీటి నాణ్యత గణాంకా లను కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (సీపీసీబీ) 1978 నుంచి దేశంలోని 870 కేంద్రాల ద్వారా నమోదు చేస్తోంది. కానీ, 2005 నుంచి మా త్రమే ఎలక్ట్రానిక్ రికార్డులు ఉన్నాయి. తాగునీటిలో పొ లాల నుంచి చేరిన రసా యనాల పాళ్లు 1992 నుం చి 2005 మధ్యకాలంలో 56 రెట్లు పెరిగినట్లు ఈ గ ణాంకాలు చెబుతున్నాయి.
 
 వ్యవసాయ రసాయ నాల కాలుష్యం బారినప డిన శిశువులు పుట్టిన మొదటి నెలలోనే కన్ను మూస్తున్నారని గుర్తించారు. భారతీయ గ్రామాల్లో నెలలోపు చనిపోతున్న శిశువుల్లో 55 నుంచి 60% వరకు చదువులేని వ్యవ సాయ కూలీల పిల్లలే. ‘అధిక దిగుబడి కోసం పొలాల్లో వేసే రసాయనిక ఎరువుల కాలుష్యం మహిళా కూలీలు, మహిళా రైతుల బిడ్డల ఆరో గ్యాన్ని (తల్లి కడుపులో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత కూడా) దుంపనాశనం చేస్తోంది. భార తదేశంలో శిశువుల ఆరోగ్యం అధ్వానంగా ఉండటానికి వ్యవసాయ రసాయనాలతో కలు షితమైన జలవనరులే ప్రధాన కారణం. పెరు గుదల లోపాలతో గిడసబారి, ఉసూరుమం టున్న శిశువులు అత్యధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. చాలా ఎక్కువ సంఖ్యలో శిశువులు మరణిస్తున్నా రు’ అని నిధియ మీనన్ ‘జర్నల్ ఆఫ్ డెవలప్‌మెం ట్ ఎకనామిక్స్’లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
 
 ఈ సమస్యతో మన దేశం లో పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 35 మంది శిశువు లు నెలలోపే చనిపోతు న్నారు. ఏడాదిలోపు చిన్న పిల్లల మరణాల సంఖ్య తగ్గుతున్నా... పుట్టిన కొద్ది రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్న పురిటి బిడ్డ ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికస్థాయిలో ఉంది. వీరి లో 20% మంది తొలిరోజు, 75% మంది మొదటి వారంలోనే కన్నుమూస్తున్నారు. తల్లు లు గర్భం దాల్చిన మొదటి నెలలో తాగే నీటి లో ఉన్న రసాయనాలు వారికి పుట్టే బిడ్డల ఆరోగ్యానికి నష్టదాయకంగా పరిణమిస్తున్నా యి. అంతేకాదు, ఐదేళ్ల లోపు వయస్కులైన పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు, బరువు పెర గకపోవడానికి దారితీస్తున్నాయి.
 
 1966 ప్రాంతంలో హరిత విప్లవం పేరు తో ఆధునిక రసాయనిక వ్యవసాయ పద్ధతు లు అమల్లోకి వచ్చాయి. అధిక విస్తీర్ణం సాగు లోకి వచ్చింది. సాగు నీటి వినియోగం పెరి గింది. అంతకుముందు ఏటా ఒకే పంట పం డించే పొలాల్లో రెండు పంటలు సాగు చేయ డం ప్రారంభమైంది. అధిక దిగుబడులిచ్చే వం గడాలు రంగంలోకి వచ్చాయి. తత్ఫలితంగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందుల వాడకం బాగా పెరిగింది. అధిక దిగుబడినిచ్చే వంగడాలను 1966-67లో 4.1% సాగు విస్తీర్ణంలో వాడేవారు. ఇది రెండే ళ్లలోనే 30 శాతానికి  పెరిగింది. రసాయనిక నత్రజని ఎరువుల వాడకం 6,58,700 మెట్రిక్ టన్నుల నుంచి 11,96,700 టన్నులకు పెరి గింది. 1990 నాటికి గోధుమల దిగుబడి 5 రెట్లు, ధాన్యం దిగుబడి రెండు రెట్లు పెరిగిం ది. అయితే,  1960- 2004 మధ్య కాలంలో యూరియా, నైట్రోజన్- ఫాస్పేట్- పొటాషి యం(ఎన్‌పీకే) తదితర సబ్సిడీ ఎరువుల వాడ కం ఏకంగా 9 రెట్లు పెరిగింది. దీనివల్ల దేశం లోని వాగులు, వంకలు, నదీ జలాలు, భూగ ర్భజలాల్లో వ్యవసాయ రసాయనాల పాళ్లు బాగా పెరిగిపోయాయి. వ్యవసాయ రసాయ నాలకు పారిశ్రామిక కాలుష్యం తోడవడంతో చైనా, అమెరికాల్లో కన్నా భారత్‌లో నీటి కాలు ష్యం అధికంగా పెరిగింది. పంట దిగుబడు లపై మరీ ఎక్కువ రాజీపడకుండానే ప్రజారో గ్యానికి, పర్యావరణానికి హాని చేయని సాగు పద్ధతుల వైపు మళ్లడమే ఈ సమస్యకు పరి ష్కారం.
 - పంతంగి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement