Chemical pesticides
-
AP: ‘ఆరోగ్య’ వ్యవసాయం
సాక్షి, అమరావతి: రైతన్నలకు సాగు వ్యయాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలను అందించడమే లక్ష్యంగా ఆర్బీకేల స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఏపీలో రసాయన పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గింది. రసాయన క్రిమి సంహారకాల వాడకం నుంచి మన రైతన్నలు దూరం జరుగుతున్నారు. రాష్ట్రంలో విషపూరిత పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గింది. జాతీయ స్థాయి గణాంకాల్లో ఇది ప్రతిబింబించింది. అయితే దేశవ్యాప్తంగా మాత్రం రసాయన పురుగు మందుల వినియోగం పెరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక – 22 వెల్లడించింది. చదవండి👉 పథకాలు ఆపేయాలట! ఏకంగా 22.63 శాతం తగ్గుదల ఆంధ్రప్రదేశ్‌లో రసాయన పురుగు మందుల వినియోగం 2016–17తో పోల్చితే 2020–21 నాటికి ఏకంగా 22.63% మేర తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వీటి వాడకం 6.06% మేర పెరిగింది. 2016–17లో ఆంధ్రప్రదేశ్‌లో 2,015 మెట్రిక్ టన్నుల రసాయన పురుగు మందులను వినియోగించగా 2020–21 నాటికి 1,559 మెట్రిక్ టన్నులకు తగ్గింది. అంటే 456 మెట్రిక్ టన్నుల వినియోగం తగ్గిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వీటి వాడకం 58,634 మెట్రిక్ టన్నుల నుంచి ఏకంగా 62,193 మెట్రిక్ టన్నులకు పెరిగింది. బిహార్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రసాయన పురుగు మందుల వాడకం క్రమంగా పెరుగుతుండగా ఏపీతోపాటు గుజరాత్, తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో తగ్గుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆరోగ్యం.. పెట్టుబడి ఆదా అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో సేంద్రీయ సాగు విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ దిశగా ఆర్బీకేల ద్వారా విస్త్రృత అవగాహన కల్పిస్తూ ప్రకృతి సాగు విధానాలను అనుసరించే రైతులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో రెండేళ్లుగా రసాయన పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గిపోవటాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి గ్రామంలో ప్రకృతి సేద్యమే లక్ష్యం. సహజ సాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకుండా రైతులకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో సేంద్రియ సాగు పెద్ద ఎత్తున చేపట్టేలా, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సహజ సాగును ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక వర్సిటీ.. ఉత్పత్తులకు సర్టిఫికేషన్ హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత సాధించడం, కర్బన వ్యర్థాలతో నిరుపయోగ భూములను సారవంతంగా మార్చడం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ కల్పించడం తదితర అంశాలపై గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చర్చించిన విషయం తెలిసిందే. రసాయనాల వాడకం ద్వారా పండించే ఆహార ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ లాంటి వ్యాధులకు దారి తీస్తోందని సీఎం పేర్కొన్నారు. సహజ సాగు విధానాలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా క్షేత్రస్ధాయిలో అమలు కావాలన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు సహజసాగులో గ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టాలని సూచించినట్లు తెలిపారు. సహజ సాగు ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించడంతోపాటు వీటికి సర్టిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. విస్తరిస్తున్న ప్రకృతి సాగు.. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం రోజురోజుకు విస్తరిస్తోంది. 2016–17 సీజన్లో జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్బీఎన్ఎఫ్) కింద 40 వేల మంది రైతులు 20 వేల ఎకరాల్లో ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టగా ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్ఎఫ్)గా అమలవుతోంది. 2020–21 సీజన్లో 3,730 గ్రామాల్లో 5.92 లక్షల మంది రైతులు 6.71 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగును అనుసరించారు. అవసరానికి మించి వాడకంతో.. గతంలో పంటకు చీడపీడలొచ్చాయని డీలర్ల వద్దకు వెళ్తే బలవంతంగా ఖరీదైన పురుగు మందులను అంటగట్టేవారు. అవసరానికి మించి వాడటంతో సాగు వ్యయం విపరీతంగా పెరిగి రైతన్నలు అప్పుల పాలయ్యేవారు. ఇప్పుడు అలాంటి వాటికి తావులేకుండా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన పురుగుల మందులను అందుబాటులోకి తేవడంతోపాటు చీడపీడల నివారణకు శాస్త్రవేత్తలు తగిన సూచనలు అందిస్తున్నారు. ఫలితంగా రసాయన క్రిమి సంహారకాల వాడకం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. -
కత్తెరపై సేంద్రియ విజయం!
మన దేశంలో గత సంవత్సర కాలంగా మొక్కజొన్న రైతులను కత్తెర పురుగు అతలాకుతలం చేస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి మన శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎన్నో రకాల పురుగులను చూశాం కానీ, ఇటువంటి వేగం, ఉధృతితో పంటకు నష్టం చేయగల కీటకాన్ని చూడటం ఇదే తొలిసారి అని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. మార్కెట్లో దొరుకుతున్న పురుగుమందులన్నీ తెచ్చి పిచికారీ చేస్తున్నా వారం తిరగక ముందే పురుగు యథాస్థితికి వచ్చేస్తోంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో కత్తెర పురుగు నివారణ ఖర్చు మెండై కూర్చుంది. కేవలం రసాయనిక పురుగు మందులకే ఎకరానికి రూ. 2,500 – 4,000 వరకు రైతులు ఖర్చు పెడుతున్నారు. మొత్తానికి మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఒక మహమ్మారిలా దాపురించింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో రబీ మొక్కజొన్న కూడా దెబ్బతిన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మెదక్ జిల్లా తునికిలోని రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో కత్తెర పురుగుపై జరిగిన పరిశోధనలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. దీనికి సారథ్యం వహిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గత 8 నెలల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో జరిగిన విస్తృతమైన ప్రయోగాలు మంచి ఫలితాలనిచ్చాయి. రబీలో ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించగలమని డా. శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’ కి తెలిపారు. మొక్కజొన్న రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్న ఆ ప్రయోగ వివరాలు.. కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్) మొక్కజొన్న రైతులను వణికిస్తోంది. అయితే, పూర్తి సేంద్రియ పద్ధతుల్లో కొన్ని ప్రత్యేక మెలకువలు పాటిస్తూ సాగు చేస్తే ఈ పురుగు అంత భయంకరమైనదేమీ కాదని డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి అంటున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించి గడచిన ఖరీఫ్, రబీ కాలాల్లో మొక్కజొన్నను పండించి కత్తెర పురుగును జయించే పద్ధతులపై నిర్థారణకు వచ్చారు. ఏయే దశల్లో ఏయే చర్యలు తీసుకున్నదీ, వాటి ఫలితాలు ఎలా వచ్చినదీ నమోదు చేశారు. భూసారం పెరిగితే కత్తెరకు తెర! మొక్కజొన్న సేంద్రియ సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే తొలుత భూ సారం పెంపుదలపై దృష్టి పెట్టాలి. అంతకుముందు పంట పూర్తయిన తర్వాత 3 నెలలు భూమికి విరామం ఇచ్చిన తర్వాత మొక్కజొన్న సాగు చేశారు. గుంటకు 100 కిలోల చొప్పున.. ఎకరానికి 4 టన్నుల (2 ట్రాక్టర్ ట్రక్కుల) గొర్రెల ఎరువు వెదజల్లి దున్ని విత్తనం వేశారు. విత్తనం మొలకెత్తిన తర్వాత 2వ వారంలో.. గుంటకు 10 కిలోలు.. ఎకరానికి 400 కిలోల చొప్పున ఘన జీవామృతం చల్లారు. వర్షం వచ్చినప్పుడో లేక నీటి తడి పెట్టినప్పుడో.. పది రోజులకోసారి.. వేస్ట్ డీ కంపోజర్ లేదా జీవామృతాను.. అదొకసారి, ఇదొకసారి ఎకరానికి వెయ్యి లీటర్ల చొప్పున ఇస్తూ వచ్చారు. భూసారం పెంపుదలకు ఈ రెంటినీ కలిపి మొత్తం 6 సార్లు నేలకు నీటితోపాటు పారగట్టినట్లు శాస్త్రవేత్త డి.నరేశ్ తెలిపారు. కత్తెర పురుగు బెడద 5–10 వారాలు కత్తెర పురుగు జీవిత చక్రం వర్షాకాలంలో 5 వారాలు, (ఖరీఫ్) శీతాకాలం (రబీ)లో 10 వారాలు ఉంటుందని, ఈ రెండు కాలాల్లోనూ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే సమర్థవంతంగా అరికట్టామని డా. శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. రబీ పంట కోతకు సిద్ధమవుతోంది. ఎకరానికి 35 క్వింటాళ్ల దిగుబడి సాధించగలిగే పరిస్థితి ఉందని ఆయన ధీమాగా చెబుతున్నారు. రైతుకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేయవచ్చని.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులెవరైనా ఈ పద్ధతులను అనుసరించి కత్తెర పురుగు దాడి నుంచి మొక్కజొన్న పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చనడంలో సందేహం లేదన్నారు. మొదటి 2–3 వారాలు కత్తెర బెడద ఎక్కువ మొక్కజొన్న మొలకెత్తిన తర్వాత తొలి 2–3 వారాలు అతి సున్నితమైన రోజులు. మొలకెత్తిన రెండో వారానికి పంట 3 ఆకుల దశలో ఉంటుంది. 3వ వారం తర్వాత సుడి ఏర్పడుతుంది. 6 ఆకుల దశ వరకు.. అంటే విత్తిన తర్వాత 35 రోజుల వరకు.. కత్తెర పురుగు బెడద నుంచి పంటను రక్షించుకోగలిగితే చాలా వరకు గట్టెక్కినట్టే. ఆ తర్వాత దశలో కత్తెర పురుగు ఆశించినా పంట ఎదుగుదల వేగాన్ని పుంజుకుంటుంది కాబట్టి నష్టాన్ని పూడ్చుకోగలుగుతుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే.. పంట మోకాలెత్తుకు ఎదిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుము ఎత్తుకు పెరిగిందంటే చాలు.. ఒక వైపు కత్తెర పురుగు తింటున్నా మొక్క లెక్క చేయదు. ఎదుగుదల ఆగదు. వేపనూనె, అగ్ని అస్త్రం, లొట్టపీచు కషాయం.. పంట తొలి 2–3 వారాల్లోనే తల్లి పురుగు గుడ్లు విపరీతంగా పెడుతుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో వర్షం లేదా మంచు నీటి చుక్కలతో సుడి నిండి ఉండటంతో పురుగు సుడిలోకి వెళ్లలేదు. ఆ మేరకు సుడికి ప్రకృతి సిద్ధంగానే రక్షణ లభిస్తుంది. ఎండాకాలం పంటకు ఈ రక్షణ తక్కువ. తల్లి పురుగు లేత ఆకులపై, మొదళ్ల దగ్గర కుప్పలు కుప్పలుగా గుడ్లు పెడుతుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన లేత లార్వాలు(పురుగులు) ఆకులను తినేస్తుంటాయి. ఈ దశలో వేపనూనె (లీ. నీటికి 1500 పీపీఎం వేపనూనె 5 ఎం.ఎల్.) లేదా అగ్ని అస్త్రం (10%. 10 లీ. నీటికి 1 లీ. అగ్ని అస్త్రం) లేదా లొట్ట పీచు కషాయం (10%. వంద లీ. నీటిలో 10 కిలోల లొట్టపీచు ఆకులు 3,4 పొంగులు పొంగించి, చల్లార్చి వాడాలి) పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధిలో వీటిల్లో ఏదో ఒక దాన్ని 3 లేదా 4 సార్లు పిచికారీ చేయాలి. కత్తెర పురుగు గుడ్లు నశిస్తాయి. లేత లార్వాలు మాడిపోయి చనిపోతాయి. మట్టి, ఇసుక, ఊకతో సుడికి రక్షణ మొక్కజొన్న మొలిచిన 4వ వారం, ఆ తదనంతర దశలో సుడి లోపలికి చేరే కత్తెర పురుగు తీవ్రనష్టం కలిగిస్తుంది. అయితే, పొడి మట్టిని లేదా ఇసుకను లేదా వరి ఊక వంటి పదార్థాలను మొక్కజొన్న మొక్క సుడిలో పోయాలి. అప్పటికే సుడిలో ఉండే పురుగు చనిపోతుంది. బయటి నుంచి పురుగులు లోపలికి వెళ్లలేవు. పంట మొలిచిన తర్వాత 4వ వారంలో సుడిలో వేసిన పదార్థం వల్ల.. సుడి నుంచి ఆ తర్వాత వెలువడే 3 నుంచి 5 ఆకులను కత్తెర పురుగు నుంచి కాపాడగలుగుతాయి. కండెలను మొక్కజొన్న మొలిచిన తర్వాత 7వ వారంలో మొక్క సుడుల్లో పొడి మట్టి లేదా ఇసుక లేదా వరి ఊకను మరోసారి పోయాలి. ఆ తర్వాత సుంకు (మగ పూత) బయటకు వస్తుంది. కత్తెర పురుగు సుంకును ఆశించినప్పటికీ పంటకు పెద్దగా నష్టం జరగదు. పైన సూచించిన విధంగా 7వ వారంలోగానే 90% పైగా కత్తెర పురుగులను నాశనం చేయగలగాలి. ఈ దశలో అదుపు చెయ్యలేకపోతే.. ఆ తర్వాత దశలో ఎదుగుతున్న లేత కండెలను ఆశించి లేత గింజలను, కండె భాగాలను పురుగులు తినేసి నష్టం కలిగిస్తాయి. ఈ వయసుకు మొక్కలు మనిషి ఎత్తున పొలంలో వత్తుగా ఉంటాయి. కాబట్టి కండెలపై కషాయాన్ని లేదా ద్రావణాన్ని పిచికారీ చేయడం కష్టమే. జీవ నియంత్రణ ద్రావణాలతో మేలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే రైతుల పొలాల్లో మెండుగా వృద్ధి చెందే మిత్రపురుగులు మొక్కజొన్న కంకులకు రక్షణగా నిలుస్తాయి. జీవ నియంత్రణ సూక్ష్మజీవులతో కూడిన ద్రావణాలను పిచికారీ చేయడం వల్ల కత్తెరు పురుగు లార్వాలు రోగాల బారిన పడి నశిస్తాయి. బవేరియా, నొమేరియా శిలీంధ్రాలు.. బీటీ బాక్టీరియా.. కీటక నాశక నులిపురుగులు(ఈ.పి.ఎన్.).. ఎన్పీ వైరస్ ద్రావణాలను పిచికారీ చేశారు. వీటిలో అందుబాటులో ఉన్న ఏరెండిటినైనా మొక్కజొన్న మొలకెత్తిన 5 నుంచి 8 వారాల మధ్యలో రెండు సార్లు పిచికారీ చేయడం వల్ల కత్తెర పురుగులు జబ్బుల పాలై చనిపోయాయని సస్యరక్షణ శాస్త్రవేత్త రవి పాల్థియ తెలిపారు. తడి వాతావరణంలో ఇ.పి.ఎన్. అత్యంత ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. కత్తెర పురుగును అరికట్టడానికి రసాయనిక పురుగుమందులను సకాలంలో వాడిన రైతులు తొలి దశల్లో కత్తెర పురుగును అదుపు చేయగలుగుతున్నారు. అయితే, సమయం మీరినప్పుడు పంటకు నష్టం జరుగుతోంది. రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల రైతుకు అదనపు ఖర్చు కావడంతోపాటు మిత్ర పురుగులు కూడా నశిస్తాయి. కండె దశలో పంటకు ప్రకృతిసిద్ధంగా మిత్రపురుగుల ద్వారా రక్షణ దొరక్క దిగుబడి నష్టపోతున్నారు. చాలా జిల్లాల్లో జరుగుతున్నది ఇదే. పైన సూచించిన విధంగా సస్యరక్షణకు సేంద్రియ పద్ధతులను సకాలంలో పాటించి మంచి దిగుబడులు తీయవచ్చని డా. శ్యాంసుందర్‌రెడ్డి అంటున్నారు. ప్రతి రైతూ కత్తెర పురుగును సమర్థవంతంగా కట్టడి చేయగల సామర్థ్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా పండించిన రసాయనిక అవశేషాల్లేని మొక్కజొన్నలు మనుషులకు, పశువులు, కోళ్లకు కూడా ఆరోగ్యదాయకంగా ఉంటాయన్నారు. (డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి– 99082 24649) అగ్ని అస్త్రం ధాటికి బుగ్గి అయిన కత్తెర పురుగు బీటీ బాక్టీరియా పిచికారీతో మాడిపోయిన కత్తెర పురుగు ఈపీ నులిపురుగుల ధాటికి చనిపోయిన కత్తెర పురుగు బవేరియా శిలీంద్రం పిచికారీతో... – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
‘మక్క లద్దెపురుగు’ నోట్లో మట్టి!
మిత్రపురుగులే రైతు సైన్యం. మిత్రపురుగులకు హాని చేసే రసాయనిక పురుగుమందుల కంటే.. ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోనే చీడపీడలను అరికట్టడం అన్నివిధాలా మేలు. మొక్కజొన్న మొక్క ఆకు సుడుల్లో పొలంలోని మట్టిని వేస్తే చాలు, నూటికి నూరు శాతం దీన్ని అరికట్టగలమని మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కేవీకే తెలిపింది. మట్టిని సుడుల్లో వేసిన తెల్లారి నుంచే పురుగు చురుకుదనాన్ని, ఆకలిని కోల్పోయింది. పంటకు నష్టం జరగటం ఆగిపోతుంది. నాలుగైదు రోజుల్లోనే పురుగు చనిపోయిందని కేవీకే అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’కి వెల్లడించారు. మొక్కజొన్న రైతులు భయభ్రాంతులకు గురికావాల్సిన పని లేదని, రసాయనిక పురుగుమందుల ఖర్చు లేకుండానే రైతులు ఈ పురుగు బెడద నుంచి పంటను నిస్సందేహంగా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క లద్దెపురుగు తీరుతెన్నులు, నియంత్రణ మార్గాలపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం.. మక్క(మొక్కజొన్న) లద్దెపురుగు.. ఇటీవల కొత్తగా కనిపిస్తున్న విదేశీ జాతి విధ్వంసక లద్దెపురుగు ఇది. మొక్కజొన్న చేలల్లో లేత ఆకులను, మొవ్వు(ఆకు సుడు)లను, కండెలను ఆవురావురుమంటూ కరకరా నమిలేయడం, అత్యంత వేగంగా కొత్త ప్రాంతాలకు పాకటం దీనికున్న అత్యంత ప్రమాదకర లక్షణాలు. ఖరీఫ్ మొక్కజొన్న పంటను నమిలేస్తున్నది. మూడు నెలల్లోనే.. మన దేశంలో తొలిసారి కర్ణాటకలో మేలో కనిపించి కలకలం రేపింది. ఆగస్టు తొలివారంలో తెలుగురాష్ట్రాల్లో వర్షాభావ వాతావరణ పరిస్థితుల్లో బయటపడింది. ఖరీఫ్ మొక్కజొన్న సాగవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో మక్క లద్దెపురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నట్లు రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆశించిన కొద్ది రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పురుగు కావడంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐ.సి.ఎ.ఆర్.) అప్రమత్తమైంది. తక్కువ ప్రమాదకరమైన రసాయనిక పురుగుమందులు వాడమని సూచిస్తోంది. ఏక పంటలకే ముప్పు ఎక్కువ! రెక్కల పురుగు రోజుకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, ఆడ రెక్కల పురుగు వెయ్యి వరకూ గుడ్లు పెట్టడం ద్వారా సంతతిని వ్యాపింపజేస్తుందని ఎఫ్.ఎ.ఓ. తెలిపింది. పొలం అంతా ఒక మొక్కజొన్న పంట(మోనోకల్చర్)ను మాత్రమే సాగు చేసే పొలాలకే ఇతర చీడపీడల మాదిరిగా మక్క లద్దెపురుగు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నతోపాటు (పప్పుధాన్యాలు, నూనెగింజ, చిరుధాన్యాల) ఇతర పంటలను కలిపి సాగు చేసే పొలాల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందదని గుర్తించారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏక పంటల సాగుకు ప్రసిద్ధి పొందిన అమెరికా ఖండంలోని కెనడా(దక్షిణ ప్రాంతం), చిలి, అర్జెంటీనా వంటి వివిధ దేశాల్లో కొన్ని ఏళ్ల నుంచి ఇది వివిధ పంటలను ఆశిస్తూ నష్టపరుస్తున్నది. రెండేళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోకి పాకి చాలా దేశాలను చుట్టుముట్టింది. ఈ పురుగు మొక్కజొన్నతోపాటు వరి, జొన్న, చెరకు, గోధుమ, పత్తి, కొన్ని రకాల కూరగాయలు సహా 80 రకాల పంటలను ఆశించి ఆహార భద్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. మక్క లద్దెపురుగు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో మొక్కజొన్న పొలాలను గుల్ల చేస్తున్నది. అయితే, రైతుకు ఖర్చులేని, సులువైన, ప్రకృతికి అనుగుణమైన మట్టితో పురుగు నిర్మూలన పద్ధతులు ఉన్నాయి. మొక్కజొన్న రైతులు ఈ పురుగుకు భయపడాల్సిన పని లేదు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో 5 రకాల పద్ధతుల్లో మక్క లద్దెపురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చని అనుభవపూర్వకంగా గుర్తించాం.. 1. మట్టి 100% అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది! మాది ఎర్రమట్టి పొలం. ఆ మట్టినే చేతితో తీసి లద్దెపురుగు ఉండే ఆకు సుడుల్లో వేశాం. మట్టి వేసిన తెల్లారికి మక్క లద్దెపురుగు ఆకులను తినటం, లద్దెలు(విసర్జితాలు) వేయటం ఆగిపోయింది. మూడో రోజుకు పురుగు నశించడం ప్రారంభమైంది. 4–5 రోజులకు పురుగు చనిపోయింది. వర్షం పడుతున్నందు వల్ల లొట్టపీచు కషాయాలు అంతగా పనిచేయలేదు. నేల మీద మట్టినే తీసి నేరుగా సుడుల్లో వేశాం. మట్టి పెళ్లలు సుడుల్లో వేసిన తర్వాత వర్షం కురవకపోతే, ఆ మట్టి పెళ్లలపై నీరు పిచికారీ చేశాం. దీన్ని బట్టి మాకు అర్థమైందేమిటంటే.. రైతు రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ పురుగుమందూ పిచికారీ చేయకుండా.. మట్టిని తీసుకొని సుడిలో వేస్తే చాలు. పురుగు ఆకలి తగ్గి, కృశించి 4–5 రోజుల్లో చనిపోతుంది. 2. మట్టి వేయకుండా.. రాతి పొడిని సుడుల్లో చల్లాం. ఇది 98% ఫలితం కనిపించింది. 3. బొగ్గు పొడిని సుడుల్లో చల్లాం. పురుగును అరికట్టడంలో దీని ప్రభావం 90% ఉంది. 4. కర్ర బూడిద చల్లాం. 86% ప్రభావం ఉంది. 5. లొట్టపీచు కషాయం(లీ. నీటికి 100 ఎం.ఎల్. కషాయం) పిచికారీ చేశాం. వర్షం లేనప్పుడు దీని ప్రభావం 80% ఉంది. వీటన్నిటిలోకీ ఎర్రమట్టి అద్భుతమైన ప్రభావం చూపింది. నల్ల రేగడి లేదా బంకమన్ను ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించి చూడాల్సి ఉంది. మక్క లద్దెపురుగును ప్రకృతిసిద్ధంగా అదుపు చేసే బదనికలు మన వాతావరణంలో అభివృద్ధి చెందేవరకు కొన్ని సీజన్లు గడుస్తాయి. ఈ లోగా రసాయనిక పురుగుమందులు వాడితే మిత్రపురుగులు చనిపోయే ప్రమాదం ఉంది. మేము అనుసరించిన పద్ధతుల వల్ల గండు చీమలు, సాలెపురుగులు, తూనీగలు వంటి మిత్రపురుగులకు హాని కలగదు. కాబట్టి, ఈ మిత్రపురుగుల సహాయం తీసుకొని పదింతలు శక్తితో కొత్త పురుగుపై పోరాడే శక్తి మనకు చేకూరుతుంది. ప్రకృతి సహకారం మనకు తోడవుతుంది. మట్టి సుడుల్లో వేసి ఎదిగిన లద్దెపురుగులను మొక్కజొన్న రైతులంతా నాశనం చేయగలిగితే.. ఈ పురుగు సంతతి వృద్ధిని సమర్థవంతంగా అరికట్టవచ్చన్న గట్టి విశ్వాసం మాకుంది. ఇతర దేశాల్లో రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల దీని వ్యాప్తిని నిలువరించలేకపోయిన విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. – డా. జి. శ్యాంసుందర్ రెడ్డి (99082 24649), సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి, డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కేవీకే, తునికి, కౌడిపల్లి, మెదక్, తెలంగాణ–502316 వివరాలకు: శాస్త్రవేత్త నరేశ్ (9290615952) ‘కత్తెర పురుగు’ కాదు ‘మక్క లద్దెపురుగు’ అంతర్జాతీయంగా ఈ లద్దెపురుగు ఇంగ్లిష్ పేరు ‘ఫాల్ ఆర్మీవార్మ్’ (ఊఅఔఔ అఖM్గగిఅఖM టఞౌఛీౌp్ట్ఛట్చ జటuజజీp్ఛటఛ్చీ). మొక్కజొన్న పంట అందుబాటులో ఉంటే ఇది ఇతర పంటల జోలికి పోదు. అందుకే దీన్ని ‘మక్క (మొక్కజొన్న) లద్దెపురుగు’ అని మనం పిలుచుకోవచ్చు. పొగాకు లద్దెపురుగు, రాగి లద్దెపురుగుల మాదిరిగా తొలుత ఏ పంట మీద కొత్త పురుగు కనిపిస్తే.. ఆ పంట పేరుతో పిలవటం ఆనవాయితీ. అందువల్ల మొక్కజొన్నను ఆశిస్తున్న ‘ఫాల్ ఆర్మీవార్మ్’ ను కొందరు పిలుస్తున్నట్లుగా ‘కత్తెర పురుగు’ అనటం కన్నా.. ‘మక్క లద్దెపురుగు’ అని పిలవటమే సులువు అని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుడిలో మట్టి వేసిన ఐదవ రోజుకు చనిపోయిన మక్క లద్దె పురుగు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అల్లాడిస్తున్న తెల్లదోమ!
విదేశాల నుంచి దిగుమతయ్యే వ్యవసాయోత్పత్తులు,మొక్కలు, పండ్లు, కాయలపై సరైన నిఘాలేకపోవడం వల్ల కొత్త రకం చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించి రైతులకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ‘రూగోస్ వలయాకారపు తెల్లదోమ’ తాజాగా ఈ జాబితాలోకి చేరింది. ఫ్లోరిడా నుంచి ఏడాదిన్నర క్రితం కేరళకు దిగుమతైన రూగోస్ తెల్లదోమ అక్కడి కొబ్బరి తోటలను చావుదెబ్బ తీíసింది. తమిళనాడు, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవాలకు పాకింది. ఉభయ గోదావరి జిల్లాల్లో నర్సరీలకు, కొబ్బరి, పామాయిల్ తోటలకు సోకింది. ఈ తోటలను కేరళకు చెందిన కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త డా. జోసెఫ్ రాజ్‌కుమార్ ఇటీవల పరిశీలించారు. రసాయనిక పురుగుమందులు చల్లకుండా ఉండటమే పరిష్కారమని ‘సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.. ముఖ్యాంశాలు.. ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి తోటలను తీవ్రంగా నష్టపరుస్తున్న కొత్త రకం తెల్లదోమ గురించి రైతాంగంలో ఇటీవల ఆందోళన నెలకొంది. ఈ తెల్లదోమ కేరళ మీదుగా ఇతర రాష్ట్రాలకు వ్యాపించిందని చెబుతున్నారు. ఇది కేరళకు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చింది? 2016 జూలైలో కేరళలో కొబ్బరి తోటలపై ‘రూగోస్ వలయాకారపు తెల్లదోమ’(అల్యూరోడికస్ రుగియో పెర్యులేటస్) కనిపించింది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం నుంచి తెచ్చిన పూల మొక్కల ద్వారా ఇది మన దేశంలోకి వచ్చింది. కేరళలోని అనేక జిల్లాల్లో కొబ్బరి తోటలను ఇది తీవ్రంగా నష్టపరిచింది. ఇక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రపదేశ్, కర్ణాటక, గోవాలకు పాకింది. ముఖ్య శాస్త్రవేత్త డా. జోసెఫ్ రాజ్‌కుమార్ ► రూగోస్ తెల్లదోమను గుర్తించడమెలా? రూగోస్ తెల్లదోమ.. దక్షిణ భారత రాష్ట్రాల్లో విరివిగా జామ, కొబ్బరి తోటల్లో కనిపించే వలయాకార తెల్లదోమ(స్పైరలింగ్ వైట్ఫ్లై)ని పోలి ఉంటుంది. ఈ దోమ రెక్కల మీద గోధుమ రంగు పట్టీలను బట్టి రూగోస్ తెల్లదోమను గుర్తించవచ్చు. దీన్ని 2009లో ఫ్లోరిడా(అమెరికా)లో కొన్ని పూల మొక్కలపై తొలుత గుర్తించారు. మెక్సికో, గౌటెమాలాకు కూడా పాకింది. మన దేశంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కేరళలోని అన్ని జిల్లాలకు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవాలకు వ్యాప్తిచెందింది. కోస్తా తీర ప్రాంతాల్లోని కొబ్బరి తోటలను ఆశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి, హైబ్రిడ్ రకాల కొబ్బరి తోటలు, కొబ్బరి మొక్కలకు సోకింది. అయితే, కేరళలో ఎత్తయిన కొబ్బరి తోటలకు కూడా సోకినా, నష్టం తక్కువగా ఉంది. ► రూగోస్ తెల్లదోమ పంటలను ఎలా నష్టపరుస్తుంది? రూగోస్ తెల్లదోమ ఒక రకమైన రసంపీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఇది సుమారు 2.5 మి.మీ. పొడువుతో మిగతా తెల్లదోమల కంటే పెద్దదిగా ఉంటుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల చెట్లు ఒత్తిడికి గురవుతాయి. ఆకుల మీద అర్ధవృత్తాకారంలో వలయాలు వలయాలుగా గుడ్లు పెడుతుంది. ఈ వలయాలు తెల్లని దూదిలాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి... అంతేకాక, రెక్కల పురుగులు తేనె వంటి జిగురును విసర్జిస్తాయి. ఈ జిగురుకు నల్లరంగులో ఉండే ఒక శిలీంధ్రం(సూటి మౌల్డ్) ఆకర్షితమై.. ఆకులపై నల్లగా పరుచుకుంటుంది. దాని వల్ల కిరణజన్య సంయోజక క్రియ తగ్గి, చెట్టు బలహీన పడుతుంది. తెల్లదోమ తాకిడి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆకులేకాక, రెమ్మ మొదళ్లు, లేత కొబ్బరికాయలు సైతం తెల్లని దూదిలాంటి పదార్థంతో నిండిపోయి ఉంటాయి. ► తెల్లదోమ తీవ్రత ఎలా ఉంది? దీన్ని ప్రకృతిసిద్ధమైన జీవనియంత్రణతోనే అదుపు చేయగలం. రసాయనిక పురుగుమందుల ద్వారా నియంత్రించలేం. రసాయనిక పురుగుమందుల వాడకం తక్కువ కాబట్టి కేరళలో 3–5 నెలల్లో రూగోస్ తెల్లదోమ తీవ్రత తగ్గింది. అయితే, తమిళనాడులో రసాయనిక పురుగుమందుల వాడకం ఎక్కువ కాబట్టి అక్కడ అదుపులోకి రాలేదు. ► సహజ పద్ధతుల్లో తెల్లదోమను అదుపు చేసేదెలా? కందిరీగ జాతికి చెందిన చిన్న దోమ పరిమాణంలో ఉండే ఒక పరాన్నజీవి రూగోస్ తెల్లదోమ వృద్ధిని అదుపులో పెడుతుండటం గమనించాం. దీన్ని ఎన్‌కార్సియ గోడెలోపి అంటారు. వీటితోపాటు కొన్ని టెంకరెక్క పురుగులు (బీటిల్స్), సాలెపురుగులు కూడా ఈ తెల్లదోమ నియంత్రణలో తోడ్పడతాయి. రసాయనిక పురుగుమందులు ఎక్కువగా వాడిన తోటల్లో ఈ సహజ శత్రువులు తక్కువ సంఖ్యలో ఉంటున్నట్లు గమనించాం. ► ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి? తెల్లదోమ మరీ తీవ్రస్థాయిలో ఉంటే 0.5 శాతం వేపనూనె(లీటరు నీటికి 5 గ్రాముల వేపనూనె)ను పిచికారీ చేయాలి. నల్లని శిలీంధ్రం ఉధృతంగా పరచుకున్న ఆకుల మీద 1% మైదా పిండి (లీటరు నీటికి 10 గ్రాముల మైదా పిండి) ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. తెల్లదోమ సహజ శత్రువులను బాగా వృద్ధి అయిన తోటల్లో నుంచి ఆకు ముక్కలను తీసుకెళ్లి.. ఉధృతంగా ఉన్న తోటల్లో చెట్లపైన ఉంచాలి. జిగురుతో కూడిన పసుపు అట్టలను చెట్ల మొదళ్లకు చుట్టాలి. తద్వారా కొంతవరకు ఈ దోమలను దిగ్బంధించవచ్చు. నల్ల శిలీంధ్రాన్ని తినే టెంకరెక్క పురుగులను గుర్తించి, పరిరక్షించాలి. ► ఇంకా పాటించాల్సిన నియమాలేమైనా ఉన్నాయా? తెల్లదోమ తాకిడి గల ప్రాంతం నుంచి కొబ్బరి మొక్కలుగానీ, ఆకులు గానీ, కాయలుగానీ లేదా పామ్ సంతతికి చెందిన అలంకారపు మొక్కలు గాని వేరే ప్రాంతాలకు తరలించకూడదు. దోమ తాకిడి గల ప్రదేశాల నుంచి తాకిడి లేని ప్రదేశాలకు వెళ్లే రవాణా వాహనాలను పూర్తిగా శుద్ధి చేయాలి. విమానాశ్రయాలలో/నౌకాశ్రయాలలో మొక్కలు, కాయల తరలింపుపై కఠిన నియమాలను అమలు చేయడం ద్వారా హానికర చీడపీడల వ్యాప్తిని అరికట్టాలి. ► నర్సరీల నుంచి కొబ్బరి మొక్కల అమ్మకాలను ఆపెయ్యాల్సిన అవసరం ఉందా? పూర్తిగా ఆపెయ్యనక్కరలేదు. అయితే, రూగోస్ తెల్లదోమ లేదని నిర్ధారణ జరిగిన తర్వాతే నర్సరీ నుంచి కొబ్బరి మొక్కలను బయటకు పంపాలి. తెల్లదోమ ఆశించిన మొక్కలను ఇవ్వకూడదు. ► రసాయనిక పురుగుమందులను నిషేధించాలా? పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లదోమ ఉధృతంగా ఉన్న కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో, ఆ పరిసరాల్లో కనీసం 4–5 నెలల పాటు రసాయనిక పురుగు మందుల వాడకాన్ని కచ్చితంగా ఆపెయ్యాలి. ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులు స్వచ్ఛందంగా ఈ జాగ్రత్త పాటించాలి. ఇలా జాగ్రత్తపడిన రైతుల తోటల్లో తెల్లదోమ అదుపులోకి వచ్చింది. ► రూగోస్ తెల్లదోమ ఆశించే ఇతర పంటలేవి? ఇది ప్రపంచవ్యాప్తంగా 43 కుటుంబాలకు చెందిన 118 పంటలకు, మొక్కలకు ఆశిస్తుంది. దక్షిణ భారతదేశంలో కొబ్బరితోపాటు మామిడి, జామ, అరటి, రామాఫలం, పనస చెట్లతోపాటు, కరివేపాకుపైన, హెలికోనియా అనే పూల జాతి మొక్కలపైన రూగోస్ తెల్లదోమ కనిపించింది. అయితే, వీటిలో ఒక్క అరటి మొక్కల మీద మాత్రమే ఇది తన పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేయగలదు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది? పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రూగోస్ తెల్లదోమ సోకిన కొబ్బరి తోటలను ఇటీవల పరిశీలించాను. రూగోస్ తెల్లదోమలు సోకిన చెట్ల మీద వీటిని సహజంగా అదుపు చేసే ఎన్కార్పియా గౌడలోపే రకం కందిరీగల్లాంటి పురుగులు కూడా కనిపించాయి. కాబట్టి, మరీ భయపడనక్కరలేదు. తెల్లదోమ తోటలను చంపెయ్యదు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా జాగ్రత్తలు పాటిస్తే కొన్నాళ్లలో తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. రసాయనిక పురుగుమందులను చల్లితే మిత్రపురుగులూ చనిపోయి.. తెల్లదోమ ఉధృతి పెరుగుతుంది. ‘‘ బదనికలు వదిలిన తర్వాత తెల్లదోమ తగ్గింది.. మా కొబ్బరి తోటకు సోకిన రూగోస్ తెల్లదోమ వలన దిగుబడి తగ్గుతుందని ఆందోళనగా ఉంది. ఆరు ఎకరాల్లో గోదావర గంగా టీఅండ్‌డీ రకం కొబ్బరిని సాగు చేస్తున్నాను. మొదటిసారిగా 2017 అక్టోబర్ నెలాఖర్లో కొబ్బరి తోటను తెల్లదోమ ఆశించింది. కొవ్వూరు, అంబాజీ పేట కొబ్బరి పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించి, తెల్లదోమ నివారణకు వేపనూనెను పిచికారీ చేయమని సూచించారు. మళ్లీ డిసెంబర్లో మరోసారి తెల్లదోమ విజృంభించింది. నిడదవోలు, చాగల్లు మండలాల్లో సుమారు 12 వందల హె క్టార్లో కొబ్బరికి, ఆరు వందల హెక్టారుల్లో పామాయిల్ తోటలకు తెల్లదోమ ఆశించింది. శాస్త్రవేత్తలు కేరళ నుంచి బదనికలు తీసుకువచ్చి జనవరి మొదటి వారంలో నా వ్యవసాయక్షేత్రంలో వదిలారు. బదనికలు వదిలాక తెల్లదోమ తీవ్రత తగ్గింది. తెల్లదోమను పూర్తి స్థాయిలో అరికట్టకపోతే పంట దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలున్నాయి. ముళ్లపూడి మురళీకృష్ణ (94405 83725), కొబ్బరి రైతు, కలవలపల్లి, చాగల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‘‘ -
పురుగు మందులు ఇంట్లో లేకపోతే.. ఆత్మహత్యలు ఆగుతాయా?
రసాయనిక పురుగు మందులు రైతుల ఇళ్లలో అందుబాటులో లేకుండా చేస్తే.. భారత దేశంలో ఆత్మహత్యలు చాలా వరకు తగ్గుతాయా? అవుననే అంటున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.). తమిళనాడులోని రెండు గ్రామాల రైతులందరి పురుగు మందులను ఓ గోదాములో భద్రపరచగా.. ఆత్మహత్యల సంఖ్య బాగా తగ్గిందని డబ్ల్యూ.హెచ్.ఓ. తెలిపింది. సాధారణంగా రైతులెవరైనా పంటలకు వాడాల్సిన పురుగుమందులను తెచ్చుకొని ఇంటి దగ్గరే పెట్టుకుంటారు. పంట నష్టపడడం, అప్పుల పాలవడం, కుటుంబ సమస్యలు.. ఇలా వాగ్వాదానికి కారణం ఏదైనప్పటికీ.. ఇంట్లో వాళ్లతో గొడవ పడి మాటకుమాట తూలిన క్షణికావేశంలో పురుగు మందు తాగడం ఆత్మహత్యల సంఖ్య పెరుగుదలకు దారితీస్తోందని ఒక అంచనా. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెన్నై (తమిళనాడు)కు సమీపంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న కందమంగళం, కురంగుడి గ్రామాల్లో చిన్న ప్రయోగం చేసింది. మల్లెపూల సాగుకు ఈ పల్లెలు పెట్టింది పేరు. మల్లె తోటలపై 15 రోజులకొకసారి పురుగు మందులు పిచికారీ చేస్తారు. అందుకే అక్కడ ప్రయోగాత్మకంగా పురుగు మందుల బ్యాంకును డబ్ల్యు.హెచ్.ఓ. ఏర్పాటు చేసింది. ఇళ్లకు దూరంగా ఉన్న భవనంలో ఒక గదిలో గోడకు ఆనుకొని ప్లైవుడ్‌తో చిన్న చిన్న సొరుగులు ఏర్పాటు చేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఒక సొరుగును కేటాయించారు. ఆ కుటుంబానికి చెందిన పురుగు మందులను ఆ సొరుగులో దాచారు. ఇద్దరు స్థానికులకు ఈ బ్యాంకు నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది తెరచి ఉంటుంది. పంటపై పురుగు మందులు చల్లాలనుకున్న రోజున రైతు తన పురుగు మందులను నేరుగా పొలానికి తీసుకెళ్లొచ్చు. ఆ రెండు గ్రామాల్లో అంతకుముందు ఏడాది 35 మంది పురుగుమందులు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఏడాది పాటు ఈ పద్ధతిని అమలు చేయడంతో ఆత్మహత్యల సంఖ్య ఐదుకు తగ్గింది! పురుగుల మందులను ఇంటికి దూరంగా ఉంచితే ఆత్మహత్యలను కొంతమేరకు అరికట్టవచ్చని ఆ రెండు గ్రామాల ప్రజలకే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకూ నమ్మకం కుదిరింది. ఇటువంటి బ్యాంకులను తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని స్థానిక సంస్థల నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే, విష రసాయనాలు వాడకుండా లాభసాటి సేద్యాన్ని ప్రోత్సహిస్తే దీనికన్నా ఇంకెంతో మేలు కదూ..! -
పుడమికీ... తల్లికీ కడుపు కోతే!
యూరియా, నైట్రోజన్, ఫాస్పేట్, పొటాషియం (ఎన్పీకే) తదితర సబ్సిడీ ఎరువుల వాడకం ఏకంగా 9 రెట్లు పెరిగింది. వ్యవసాయ రసాయనాలకు పారిశ్రామిక కాలుష్యం తోడవడంతో చైనా, అమెరికాల్లో కన్నా భారత్‌లో నీటి కాలుష్యం అధికంగా పెరిగింది. దేశంలో మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక పురుగుమందులు ప్రజారోగ్యానికి చేటు తెస్తున్నాయన్నది తెలిసిందే. రసాయనిక ఎరువుల వల్ల కూడా తీరని హాని కలుగుతోం ది. వీటితో కలుషితమైన నీరు మహిళా వ్యవసాయ కార్మికులకు కడుపు కోతను మిగుల్చు తున్నది. మృత్యువాతపడుతున్న ఏడాది లోపు వయసు పిల్లల్లో 75% మంది పుట్టిన నెల లోపే కన్నుమూస్తున్నారు. దీనికి మూల కార ణం నీటిలోని రసాయనిక ఎరువుల అవశేషా లేనని బ్రాండీస్ విశ్వవిద్యాలయం (అమెరికా) అధ్యయనంలో తేలింది. రసాయనిక ఎరువు లు అధిక మోతాదులో వాడుతున్న పొలాల్లో, ముఖ్యంగా వరి, గోధుమ పొలాల్లో, పనులు చేసే మహిళలు నీటి కాలుష్యం బారినపడుతు న్నారని.. వారి పురిటి బిడ్డలే అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. ఆర్థికశాస్త్ర విభాగానికి చెందిన ఎలిజబెత్ బ్రైనెర్డ్, నిధియ మీనన్ సంయు క్తంగా ఈ అధ్యయనం చేశారు. నీటి నాణ్యత గణాంకాలు, శిశువుల ఆరో గ్యానికి సంబంధించిన గణాంకాలను విశ్లేషిం చడం ద్వారా.. రసాయనిక ఎరువుల దుష్ర్ప భావం ఆయా ప్రాంతాల్లో జన్మించిన శిశువు లపై ఎలా ఉంటున్నదీ వారు పరిశీలించారు. నదులు, వాగులు, వంకలు, చెరువులు, సర స్సులు, కాలువల్లో నీటి నాణ్యత గణాంకా లను కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (సీపీసీబీ) 1978 నుంచి దేశంలోని 870 కేంద్రాల ద్వారా నమోదు చేస్తోంది. కానీ, 2005 నుంచి మా త్రమే ఎలక్ట్రానిక్ రికార్డులు ఉన్నాయి. తాగునీటిలో పొ లాల నుంచి చేరిన రసా యనాల పాళ్లు 1992 నుం చి 2005 మధ్యకాలంలో 56 రెట్లు పెరిగినట్లు ఈ గ ణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ రసాయ నాల కాలుష్యం బారినప డిన శిశువులు పుట్టిన మొదటి నెలలోనే కన్ను మూస్తున్నారని గుర్తించారు. భారతీయ గ్రామాల్లో నెలలోపు చనిపోతున్న శిశువుల్లో 55 నుంచి 60% వరకు చదువులేని వ్యవ సాయ కూలీల పిల్లలే. ‘అధిక దిగుబడి కోసం పొలాల్లో వేసే రసాయనిక ఎరువుల కాలుష్యం మహిళా కూలీలు, మహిళా రైతుల బిడ్డల ఆరో గ్యాన్ని (తల్లి కడుపులో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత కూడా) దుంపనాశనం చేస్తోంది. భార తదేశంలో శిశువుల ఆరోగ్యం అధ్వానంగా ఉండటానికి వ్యవసాయ రసాయనాలతో కలు షితమైన జలవనరులే ప్రధాన కారణం. పెరు గుదల లోపాలతో గిడసబారి, ఉసూరుమం టున్న శిశువులు అత్యధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. చాలా ఎక్కువ సంఖ్యలో శిశువులు మరణిస్తున్నా రు’ అని నిధియ మీనన్ ‘జర్నల్ ఆఫ్ డెవలప్మెం ట్ ఎకనామిక్స్’లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సమస్యతో మన దేశం లో పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 35 మంది శిశువు లు నెలలోపే చనిపోతు న్నారు. ఏడాదిలోపు చిన్న పిల్లల మరణాల సంఖ్య తగ్గుతున్నా... పుట్టిన కొద్ది రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్న పురిటి బిడ్డ ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికస్థాయిలో ఉంది. వీరి లో 20% మంది తొలిరోజు, 75% మంది మొదటి వారంలోనే కన్నుమూస్తున్నారు. తల్లు లు గర్భం దాల్చిన మొదటి నెలలో తాగే నీటి లో ఉన్న రసాయనాలు వారికి పుట్టే బిడ్డల ఆరోగ్యానికి నష్టదాయకంగా పరిణమిస్తున్నా యి. అంతేకాదు, ఐదేళ్ల లోపు వయస్కులైన పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు, బరువు పెర గకపోవడానికి దారితీస్తున్నాయి. 1966 ప్రాంతంలో హరిత విప్లవం పేరు తో ఆధునిక రసాయనిక వ్యవసాయ పద్ధతు లు అమల్లోకి వచ్చాయి. అధిక విస్తీర్ణం సాగు లోకి వచ్చింది. సాగు నీటి వినియోగం పెరి గింది. అంతకుముందు ఏటా ఒకే పంట పం డించే పొలాల్లో రెండు పంటలు సాగు చేయ డం ప్రారంభమైంది. అధిక దిగుబడులిచ్చే వం గడాలు రంగంలోకి వచ్చాయి. తత్ఫలితంగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందుల వాడకం బాగా పెరిగింది. అధిక దిగుబడినిచ్చే వంగడాలను 1966-67లో 4.1% సాగు విస్తీర్ణంలో వాడేవారు. ఇది రెండే ళ్లలోనే 30 శాతానికి పెరిగింది. రసాయనిక నత్రజని ఎరువుల వాడకం 6,58,700 మెట్రిక్ టన్నుల నుంచి 11,96,700 టన్నులకు పెరి గింది. 1990 నాటికి గోధుమల దిగుబడి 5 రెట్లు, ధాన్యం దిగుబడి రెండు రెట్లు పెరిగిం ది. అయితే, 1960- 2004 మధ్య కాలంలో యూరియా, నైట్రోజన్- ఫాస్పేట్- పొటాషి యం(ఎన్పీకే) తదితర సబ్సిడీ ఎరువుల వాడ కం ఏకంగా 9 రెట్లు పెరిగింది. దీనివల్ల దేశం లోని వాగులు, వంకలు, నదీ జలాలు, భూగ ర్భజలాల్లో వ్యవసాయ రసాయనాల పాళ్లు బాగా పెరిగిపోయాయి. వ్యవసాయ రసాయ నాలకు పారిశ్రామిక కాలుష్యం తోడవడంతో చైనా, అమెరికాల్లో కన్నా భారత్‌లో నీటి కాలు ష్యం అధికంగా పెరిగింది. పంట దిగుబడు లపై మరీ ఎక్కువ రాజీపడకుండానే ప్రజారో గ్యానికి, పర్యావరణానికి హాని చేయని సాగు పద్ధతుల వైపు మళ్లడమే ఈ సమస్యకు పరి ష్కారం. - పంతంగి రాంబాబు