సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాలు, బతుకమ్మ పూల నిమిజ్జనం నిమిత్తం ఏర్పాటు చేసిన చిన్న కుంటలను శుభ్రం చేసేందుకు తీసుకున్న చర్యలు ఏంటో తెలపాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కూకట్‌పల్లి చెరువు నీటి కలుషితంపై పత్రికల్లో వచ్చిన వార్తను పిల్‌గా పరిగణించిన హైకోర్టు గురువారం మరోసారి విచారించింది. చిన్న విగ్రహాల నిమజ్జనం చేసేందుకు 24 కుంటల్ని ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది. దీంతో వాటిని శుభ్రం చేసేందుకు తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. విచారణను మార్చి 5కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment