
అఖిలపక్షం ఢిల్లీ పర్యటన వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ అఖిలపక్షం నేతృత్వంలో చేపట్టిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బృందానికి ప్రధాని మోదీ ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది. ఈ మేరకు అఖిలపక్షం ఢిల్లీ పర్యటన తిరిగి ఎప్పుడు ఉంటుందనేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొంటూ సీఎంవో ప్రకటన విడుదల చేసింది.