
త్యాగాలు వృథా కానివ్వం: మంద కృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు వృథా కానివ్వబోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల సంస్మ రణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎమ్మార్పీఎస్ కార్యా లయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీ కరణకు చట్టబద్ధత కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, త్వరలో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందనుందని అన్నారు.
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా కొనసాగించాలి
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వికలాంగుల సంక్షేమ శాఖను విలీనం చేయొద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ కోరారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. సీఎస్‌ను కలిసిన వారిలో వికలాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తదితరులున్నారు.