వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని గద్దర్ డిమాండ్ చేశారు.
ఆలేరు(నల్గొండ జిల్లా)
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రజాయుద్ధ నౌక గద్దర్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా ఆలేరులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏబీసీడీల వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొన్నందున.. అన్ని వర్గాల వారిని కలుపుకుపోయి ఐక్యంగా ఉండి వర్గీకరణ కోసం పోరాడాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం సులభమేనన్నారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పాటైందని, పాలకులు మాత్రమే మారరాని అయినప్పటికీ దళితులకు ఒరిగిందేమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు 3ఎకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు హామీలను విస్మరించిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావు పూలేలను ఆదర్శంగా తీసుకుని మాదిగలు విద్యా, ఉద్యోగాల్లో రాణించాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా పయణించాలని పిలుపునిచ్చారు. డప్పులు కొట్టేవారికి, చెప్పులు కుట్టేవారికి ప్రభుత్వం రూ. 2వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు.