ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు మౌలికంగా తప్పు’ | SC/ST judgment of Supreme Court is basically wrong decision, says ex-CJI Balakrishnan | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు మౌలికంగా తప్పు’

Published Sat, Apr 14 2018 3:50 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

SC/ST judgment of Supreme Court is basically wrong decision, says ex-CJI Balakrishnan - Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ‘మౌలికంగా తప్పని’ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. కోర్టు తీర్పులు ప్రజల్లో హింసకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు నిబంధనల్ని నిర్వీర్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజల మధ్య హింసను ప్రేరేపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అధిక శాతం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల్ని కోర్టు వెలువరించాల్సి ఉంది. అంతేకానీ సమాజంలో హింసను పురికొల్పకూడదు’ అని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement