Wrong Judgment
-
మూడో కన్నే పొరపాటు చేస్తే ఎలా?
మ్యాచ్‌ల్లో అప్పుడప్పుడూ ఫీల్డ్ అంపై‘రాంగ్’ అవుతుంది. క్రికెట్లో ఇది సహజం. కానీ ఈ అంపైరింగ్‌ను సరిదిద్దే మూడో కన్నే (థర్డ్ అంపైర్) పొరపాటు చేస్తే... ఇంకో కన్ను ఉండదుగా! అయితే ఈ ఫలితం అనుభవించిన జట్టుకు మాత్రం శాపంగా మారుతుంది. చెన్నై రెండో టెస్టులో జరిగింది కూడా ఇదే. అందుకేనేమో రూట్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఇది గ్రహించిన రిఫరీ నిబంధనల మేరకు రివ్యూను పునరుద్ధరించారు. వివరాల్లోకెళితే... ఇన్నింగ్స్ 75వ ఓవర్లో స్పిన్నర్ జాక్ లీచ్ డెలివరీ రహానే గ్లౌజులను తాకుతూ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ చేతుల్లో పడింది. ఇంగ్లండ్ చేసిన ఈ అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కెప్టెన్ రూట్ రివ్యూకు వెళ్లాడు. టీవీ రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదరీ కూడా పొరపాటు చేశారు. ఆయన రీప్లేలన్నీ ఎల్బీడబ్ల్యూ కోసం పరిశీలించారు. కానీ క్యాచ్ ఔట్ అనే సంగతి మరిచారు. ఎల్బీ కాకపోవడంతో నాటౌట్ ఇచ్చారు. దీనిపై అప్పుడే రూట్ గ్లౌజులను తాకుతూనే వెళ్లిందిగా అన్నట్లు సంజ్ఞలు చేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. మొత్తానికి రివ్యూ సఫలం కాకపోవడంతో ఒక రివ్యూను ఇంగ్లండ్ కోల్పోయింది. తదనంతర పరిశీలనలో కోల్పోయిన ఈ రివ్యూను పునరుద్ధరించారు. పిచ్ ఎలా ఉందో మాకు తెలుసు. ఇది బాగా టర్న్ అవుతుందని కూడా తెలుసు. అందుకే ప్రాక్టీస్ సెషన్లలో దీనికి తగ్గట్లే కసరత్తు చేశాం. ముఖ్యంగా టర్నింగ్ అయ్యే పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ చురుకైన ఆలోచనలతో ఆడాలి. ఇక్కడ నిష్క్రియా పరత్వం ఏ మాత్రం పనికిరాదు. మనముందు దీటైన బౌలర్ ఉంటే మనం తనకంటే దీటైన ఆట ఆడాలి. క్రీజులో ఉన్నప్పుడు షాట్ ఆడాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఆ షాట్‌నే బాదేస్తాం. అలాగే నేను స్వీప్ షాట్ ఆడదామనుకునే స్వీప్ చేశాను అంతే! దీనికి ఔటైనంత మాత్రాన భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. –రోహిత్ శర్మ, భారత ఓపెనర్ ఇంగ్లండ్కెప్టెన్ జో రూట్ -
‘తప్పు తీర్పు ఇచ్చానని ఏ జడ్జీ ఒప్పుకోడు’
న్యూఢిల్లీ: ఏ న్యాయమూర్తి తాను తప్పు తీర్పు ఇచ్చానని ఒప్పుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా, కేవలం తప్పుడు ఆదేశాలు ఇచ్చారన్న కారణంతో జడ్జీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేమంది. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత పవిత్రమైంది.తప్పు చేసినట్లు, అవినీతికి పాల్పడినట్లు, ప్రలోభాలకు గురైనట్లు స్పష్టమైన ఆరోపణలుంటే తప్ప.. తప్పు తీర్పు ఇచ్చారన్న ఒకే కారణంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించరాదు’ అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడంపై బిహార్‌కు చెందిన ఒక న్యాయాధికారి దాఖలు చేసి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటికే హైకోర్టు బెయిల్‌ను నిరాకరించిన విషయాన్ని గుర్తించకుండా.. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కొందరికి బెయిల్ మంజూరు చేయడంపై, మరో డ్రగ్ సంబంధిత కేసు విచారణను హడావుడిగా ముగించడంపై ఆ న్యాయాధికారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది హిందూ నిర్మాణమే! : అయోధ్య వివాదాస్పద స్థలంలో పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో వెల్లడైన విషయాలు ఆ స్థలం తమదేనన్న ముస్లింల వాదనను స్పష్టంగా తోసిపుచ్చుతున్నాయని రామ్ లల్లా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయోధ్య వివాదాస్పద స్థల యాజమాన్య వ్యాజ్యంపై జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు గురువారం వాదనలు కొనసాగాయి. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు మౌలికంగా తప్పు’
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ‘మౌలికంగా తప్పని’ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పులు ప్రజల్లో హింసకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు నిబంధనల్ని నిర్వీర్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజల మధ్య హింసను ప్రేరేపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అధిక శాతం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల్ని కోర్టు వెలువరించాల్సి ఉంది. అంతేకానీ సమాజంలో హింసను పురికొల్పకూడదు’ అని అన్నారు. -
జంట హత్యలు... కటకటాల్లో నిరపరాధి...
రాంగ్ జడ్జిమెంట్ ‘థ్యాంక్ గాడ్..’ జైలు గోడలు దాటి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెడుతూనే దేవుడిని తలచుకున్నాడు జోసెఫ్ స్లెడ్జ్. ముడతలు పడ్డ ఆ మొహంలో గొప్ప సంతోషం... అంతకుమించి ఎట్టకేలకు నిరపరాధిగా విముక్తి పొందినందుకు గొప్ప రిలీఫ్. అతడి కోసం సోదరి బార్బరా కిన్లా, సోదరుడు ఆస్కార్ స్లెడ్జ్, అతడి కొడుకు మారిస్ స్లెడ్జ్ జైలు బయట నిరీక్షిస్తూ కనిపించారు. వారితో పాటు పదేళ్లుగా స్లెడ్జ్ తరఫున న్యాయపోరాటం సాగించిన న్యాయవాది క్రిస్ మమ్మా కూడా. అందరి కళ్లలోనూ ఆనందం. గొప్ప వెలుగు. అప్పటికే అక్కడకు మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఫొటోలు తీస్తూ, స్లెడ్జ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘దేనికైనా ఓపిక పట్టమని మా అమ్మ చెప్పేది. ఓపిక పట్టాను. ఎట్టకేలకు న్యాయం దక్కింది’ అని అతడు చిరునవ్వుతో ప్రశాంతంగా బదులిచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు... చేయని నేరానికి ఏకంగా ముప్పయ్యేడేళ్లు కారా గారంలో మగ్గిన తర్వాత న్యాయవ్యవస్థ అతడికి డెబ్బైయేళ్లు వచ్చాక నిరపరాధిగా తేల్చింది. జైలుపాలు చేసినందుకు అమెరికా ప్రభుత్వం అతడికి చెల్లించబోయే పరిహారం 7.50 లక్షల డాలర్లు. అక్కడితో చేతులు దులిపేసుకుంటుంది. ఇంతకీ జోసెఫ్ స్లెడ్జ్ ఎలా జైలు పాలయ్యాడంటే... ఇదీ జరిగిన కథ.. నార్త్ కరోలినాలోని ఎలిజబెత్ టౌన్లో 1976 సెప్టెంబర్ 6న ఇద్దరు మహిళల మృతదేహాలు దొరికాయి. వారిని ఎవరో దారుణంగా హత్య చేశారు. మృతదేహాలపై కత్తిగాట్లు ఉన్నాయి. పెనుగులాట జరిగినట్లు సంఘటనా స్థలంలో ప్రస్ఫుటమైన ఆనవాళ్లు ఉన్నాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ జంటహత్యల కేసులో పోలీసులు చిల్లర నేరగాడు జోసెఫ్ స్లెడ్జ్‌ను అనుమానించారు. అప్పటికే ఒక చోరీ కేసులో అతడికి నాలుగేళ్ల శిక్ష పడింది. వైట్లేక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న స్లెడ్జ్, ఈ జంట హత్యలకు ముందురోజే జైలు నుంచి పరారయ్యాడు. అతడే హత్యలు చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులు వేట ప్రారంభించారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే చోరీ చేసిన కారులో ప్రయాణిస్తున్న స్లెడ్జ్‌ను పట్టుకున్నారు. జంట హత్యల కేసు మోపి, జైలుకు తరలించారు. రెండేళ్లు దర్యాప్తు చేసినా, ఆ హత్యలు స్లెడ్జ్ చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలనూ సంపాదించలేకపోయారు. స్లెడ్జ్తో పాటు అదే జైలులో ఉన్న హెర్మన్ బేకర్, డానీ సట్టన్ అనే ఖైదీలను తమ దారికి తెచ్చుకున్నారు. ఇద్దరు మహిళలనూ తానే హత్య చేసినట్లు స్లెడ్జ్ తమ వద్ద అంగీకరించాడంటూ వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారు. ఖైదీల వాంగ్మూలమే ఆధారంగా పోలీసులు స్లెడ్జ్‌పై చార్జిషీట్ దాఖలు చేసి, 1978 ఆగస్టులో కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రెండు యావజ్జీవ శిక్షలను విధించింది. ఈ తీర్పుతో హతాశుడైన స్లెడ్జ్, నార్త్ కరోలినా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్నా ఫలితం దక్కలేదు. తాను నిరపరాధినని మొత్తుకున్నా ఏ కోర్టూ అతడి వాదనను వినిపించుకోలేదు. అయినా, పట్టు వదలకుండా జైలులో ఉంటూనే కోర్టులకు పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేసుకున్నాడు. ఇదీ మలుపు... పాతిక పిటిషన్లు దాఖలు చేసుకున్న తర్వాత కేసులో అనుకోని మలుపు.. అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన మాజీ ఖైదీ హెర్మన్ బేకర్ మనసు మార్చుకొని ముందుకొచ్చాడు. అప్పట్లో జైలులో ఉన్న తాను పోలీసుల బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగి వాంగ్మూలం ఇచ్చానని కోర్టు ఎదుట చెప్పాడు. సంఘటనా స్థలం వద్ద సేకరించిన ఆధారాలకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ 2003లో మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2012 వరకు ఎలాంటి పరీక్షలూ జరగలేదు. అప్పటికే ఆధారాల్లో కొన్ని నాశనమయ్యాయి. మిగిలిన వాటిని ల్యాబ్‌లో పరీక్షిస్తే వాటిలో ఏ ఒక్కటీ స్లెడ్జ్ డీఎన్ఏతో సరిపోలలేదు. ఆ నివేదికతో కేసు 2013లో మళ్లీ కోర్టుకొచ్చింది. మాజీ ఖైదీ బేకర్ సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పలు విడతల విచారణ తర్వాత 2015 జనవరి 25న నార్త్ కరోలినా సుప్రీంకోర్టు ఈ కేసులో స్లెడ్జ్ పూర్తిగా నిరపరాధి అని, అతడిని తక్షణమే విడుదల చేయాలని తీర్పునిచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఖైదీలు గల దేశం అమెరికా. ఆ జైళ్లలో నిరపరాధుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. స్లెడ్జ్ వంటి కొందరు మాత్రం కాలం కలసి వచ్చినప్పుడు ఇలా విముక్తి పొందుతుంటారు.