judgment sc
-
కొనసాగుతున్న శబరిమల నిరసనలు
తిరువనంతపురం/ముంబై: అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు కోచిలో భారీ ర్యాలీ తీశారు. మహారాష్ట్రలోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే.. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. మహిళల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమా, కాదా అన్న విషయాన్ని కాంగ్రెస్, బీజేపీలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోచిలోని శివాలయం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన భక్తులు..అయ్యప్ప స్వామి ఫొటోల ప్లకార్డులను పట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. ముంబై, థానే, నవీ ముంబైలకు చెందిన అయ్యప్ప భక్తులు ఆజాద్ మైదాన్‌లో నిరసన ర్యాలీ తెలిపారు. శబరిమల ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతృత్వంలో ప్రారంభమైన ‘లాంగ్‌మార్చ్’ శనివారం కొల్లామ్ జిల్లాలోకి ప్రవేశించింది. ‘తృప్తి సవాల్ విసరడానికే శబరిమల వస్తున్నారు తప్ప భక్తురాలిగా కాదు. ఉద్రిక్తతలను సృష్టించ వద్దని ఆమెను కోరుతున్నా’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై అన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు మౌలికంగా తప్పు’
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ‘మౌలికంగా తప్పని’ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పులు ప్రజల్లో హింసకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు నిబంధనల్ని నిర్వీర్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజల మధ్య హింసను ప్రేరేపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అధిక శాతం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల్ని కోర్టు వెలువరించాల్సి ఉంది. అంతేకానీ సమాజంలో హింసను పురికొల్పకూడదు’ అని అన్నారు. -
జయకు చెక్ పెడుతున్న కర్నాటక
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. జయ అక్రమాస్తుల కేసులో కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా, కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు పొరపాటున నిర్దోషిగా తేల్చిందని ఆరోపించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. జయలలిత కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులో తమకు అనుమానాలు ఉన్నాయంటూ అప్పీలుకు వెళ్లింది. జయలలిత అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెను దోషిగా ప్రకటించాలని సుప్రీంకోర్టుకు కర్ణాటక విన్నవించింది. 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు రూ.66 కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించినట్లు 1997లో డీఎంకే ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ కేసు అనేక మలుపులు తర్వాత కేసును కర్నాటక స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. అయితే జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన స్పెషల్ కోర్టు తీర్పును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. దీంతో దాదాపు ఎనిమిది నెలల జైలు శిక్ష తర్వాత జయలలిత నిర్దోషిగా బయటపడి తమిళనాడు సీఎం పదవిని చేపట్టారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలో ఆమె ఆర్కేనగర్ నియోజకవర్గంనుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జయ విడుదలకు వ్యతిరేకంగా కర్నాటక ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేసింది.