
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో తెలంగాణ మాదిగ జేఏసీ చేపట్టిన రెండో రోజు నిరసనలో డీఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నిరసనలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.