'ఆ ఇద్దరూ వాడుకుంటున్నారు' | congress mla sampath slams kcr on classification of SCs | Sakshi
Sakshi News home page

'ఆ ఇద్దరూ వాడుకుంటున్నారు'

Published Tue, Feb 7 2017 4:24 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

'ఆ ఇద్దరూ వాడుకుంటున్నారు' - Sakshi

'ఆ ఇద్దరూ వాడుకుంటున్నారు'

హైదరాబాద్‌సిటీ: ఎస్సీ వర్గీకరణను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తమ రాజకీయ ప్రాయోజనాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ విమర్శించారు. దళితుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటూ, దళితుల సంక్షేమం పై దోబూచులాడుతున్నాయని ఆరోపించారు.

దళితుల సంక్షేమం పై ప్రభుత్వం శ్వేత పత్రం ఇచ్చెందుకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా దళితులకు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వం ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్, వెంకయ్యల దుర్భుద్దే అఖిలపక్ష సమావేశం వాయిదాకు కారణమని అన్నారు. వీరిద్దరికి దళితులపై చిత్తశుద్ధి లేదన్నారు. వర్గీకరణపై ఇప్పటికే 90శాతం పనిని నాటి  యూపీఏ  ప్రభుత్వం పూర్తిచేసిందని తెలిపారు. వర్గీకరణపై ప్రధానితో మాట్లాడకుండా హైదరాబాద్‌కు వస్తే దళితుల ఆగ్రహాన్ని చవిచూస్తారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement