
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ విమర్శిం చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ, మూడేళ్లు గడిచినా ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. వర్గీకరణ కోసం కేంద్రంపై త్వరలో యుద్ధం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. శనివారం సోమాజిగూడలో ఆయన మీడి యాతో మాట్లాడారు. వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన భారతి సంస్మరణ సభను ఈనెల 17న సిక్‌విలేజ్ హాకీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు రాష్ట్రంలోని మహిళలంతా కొవ్వొత్తులతో హాజరు కావా లని పిలుపునిచ్చారు. వర్గీకరణ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, కేసీఆర్ మాత్రం అసెంబ్లీలో బిల్లుపెట్టి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని తీసుకెళ్లడం పట్ల సీఎంను అభినందించారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ని ఎవరూ స్మరించుకోవడం లేదని, వారి దేహాలను సమాధి చేసినట్లే చరిత్రనూ సమాధి చేస్తున్నార న్నారు. అమరులను స్మరించుకునేం దుకు ఒకరోజు కేటాయించాల న్నారు. ఆదివాసీల ఆవేదన న్యాయమైందని, మాదిగలు వెనుకబడినట్లే ఎస్టీల్లో ఆదివాసీలు వెనుకబడ్డారని, వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుం దన్నారు. భద్రాద్రి ఎన్‌కౌంటర్ బూటకమని, నక్సల్స్ ఎజెండా అమలుచేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారిని చంపడమే పనిగా పెట్టుకుందన్నారు. ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిం చాలన్నారు. తెలంగాణ ఉద్యమం లో ఆటపాటలతో చైతన్యపర్చిన కళాకారులను తెలుగు మహా సభలకు ఆహ్వానించకపోవడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment