సీఎం కేసీఆర్‌ను కలసిన డిప్యూటీ సీఎం కడియం, దళిత నేతలు
సాక్షి, హైదరాబాద్: మాదిగల వర్గీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నందుకు దళిత నేతలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగలపల్లి శ్రీనివాస్ తదితరులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసెంబ్లీలో సీఎం చాంబర్‌కు తీసుకువెళ్లారు.
వీరివెంట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా వెళ్లారు. డప్పు–చెప్పుకు రూ. 2వేల పెన్షన్ ఇవ్వడానికి కూడా సీఎం అంగీకరించడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అదే మాదిరిగా జీవో 183 పునరుద్ధరణకు కూడా సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ జీవో ద్వారా జనాభా ప్రాతిపదికన ఎస్సీల్లోని 59 కులాలకు ప్రభుత్వ పథకాలలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.