వర్గీకరణ పోరాటం ఫలించనుంది
వినాయక్‌నగర్ : ఎస్సీ వర్గీకరణ లక్ష్యానికి చేరువయ్యామని, ఈ సమయంలో మాదిగ ఉప కులాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్మయుద్ధం మహా సభ సన్నాహాక సదస్సును నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. 23 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నామని, పోరాటం ఫలించే సమయం ఆసన్నమైందని మందకృష్ణ అన్నారు. వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల 20న నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
03ఎన్‌జడ్‌టి402,406 : సదస్సులో ప్రసంగిస్తున్న మంద కృష్ణ