
హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న ముఖేష్
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లె ఎస్సీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. పుంగనూరు సమీపంలోని సుగా లిమిట్టకు చెందిన కుమార్‌నాయక్ కుమారుడు ముఖేష్ నాయక్ కొలమాసనపల్లె హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సెలవు కావడంతో హాస్టల్ వద్దే ఉన్నాడు. సాయంత్రం స్టడీ క్లాస్‌కు వెళ్లకపోవడంతో వార్డన్ మధుసూదన్ ఆరాతీశారు. బాత్‌రూమ్ గడియపెట్టి ఉం డడంతో తీసిచూడగా లోపల కమ్మీకి ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు.
పోలీసులకు సమాచారమివ్వగా, వారు సంఘటన స్థ లాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిందట బంగారుపాళెం హాస్టల్‌లో జరిగిన మోటివేషన్ క్లాస్‌లో ప్రసంగించిన ముఖేష్ మంచి మార్కులు తెచ్చుకుంటానని చెప్పినట్టు వార్డన్ తెలిపా రు. బాగా చదివే విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కా వ డం లేదని ఆయన అంటున్నారు. అయితే తనను సాకిన చిన్నాన్న గజేంద్రనాయక్ ఆత్మహత్యతో మానసిక వేదనకు గురై అత డు ఈ చర్యకు పాల్పడి ఉంటాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఎస్‌ఐ పూరేనాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment