Tenth student suicide
-
టెన్త్ విద్యార్థిని ఇరుగు అస్మిత ఆత్మహత్య
-
టెన్త్ విద్యార్థి బలవన్మరణం
బల్మూర్: పదో తరగతి విద్యారి్థ.. చదువుతున్న స్కూళ్లోనే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని పొలిశెట్టిపల్లి జేఎంజే ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యం కథనం ప్రకారం.. అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన మణెమ్మ కుమా రుడు ఆకాశ్(15) పదో తరగతి చదువుతూ.. పాఠశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటున్నాడు. మంగళవారం అతను తరగతి గదిలో లేకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పరిసరాల్లో వెతకగా.. పాఠశాల వెనక ఆవరణలో ఉన్న చెట్టుకు బోరుమోటార్ వైరుతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి రక్షించడానికి ప్రయతి్నంచగా అప్పటికే మృతిచెందాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన ఆకాశ్ మరణ వార్తను తెలుసుకున్న తల్లి మణెమ్మ, బంధువులు పాఠశాల వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. పదేళ్ల కితం తన భర్త కరెంటు షాక్‌తో చనిపోయాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న కుమా రుడు ఇప్పుడు ఇలా మృతి చెందడం తట్టుకోలేని విషాదమని ఆమె బోరున విలపించారు. కాగా, పాఠశాలలో వసతులు సక్రమంగా లేవని, భోజనం నాణ్యతగా లేదని తమతో ఆకాశ్ చెప్పేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రార్థన సమయంలో టై పెట్టుకుని రాకపోవడంతో తోటి విద్యార్థుల ముందు టీచర్లు మందలించి గంటపాటు నిల్చోబెట్టారని, ఆ అవమానంతోనే తమ పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయా లని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్– అచ్చంపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అయితే విద్యార్థి చెడు వ్యసనాలకు (సిగరెట్ తాగడం) అలవాటుపడుతున్నాడని తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చామని.. ఆమె ఫోన్ చేసి కొడుకును మందలించడంతో మనస్తాపంతోనే ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడని స్కూలు హెచ్ఎం సిస్టర్ అమూల్య తెలిపారు. రాస్తారోకోకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఏబీవీపీ, వీహెచ్‌పీ, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
విద్యార్థి ప్రాణం తీసిన పబ్జీ?
ఘంటసాల (అవనిగడ్డ): పరీక్షలు దగ్గర పడుతున్నందున సెల్ఫోన్లో పబ్జీ గేమ్‌కు దూరంగా ఉండాలంటూ తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం గ్రామానికి చెందిన తమ్మనబోయిన భీమరాజు, విజయనాగిని దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీపక్‌సాయి (15) శ్రీకాకుళం హైస్కూల్లో పదో తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు కళ్యాణ్ ఇదే హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో దీపక్‌సాయి చాలాబాగా చదువుతూ ఉండేవాడు. అయితే సెల్ఫోన్లో పబ్జీ గేమ్‌ను విపరీతంగా ఆడేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా అదే పనిలో ఉండేవాడు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వాడవద్దని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన దీపక్‌సాయి కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. భోజనం చేసి తిరిగి ట్యూషన్‌కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి హైస్కూల్ వెనుక నుంచి లోపలికి ప్రవేశించి ప్రాంగణంలోని స్టేజీ పక్కనే ఉన్న భవనం రెండో అంతస్తు పిల్లర్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. శనివారం ఉదయం హైస్కూల్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన ఆయా.. విద్యార్థి మృతదేహాన్ని చూసి భయంతో హెచ్ఎంకు, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ బి.వెంకటేశ్వరరావు, చల్లపల్లి సీఐ ఎంవీ నారాయణ, సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఫెయిల్ అవుతానన్న బెంగతో ఆత్మహత్య
కాగజ్‌నగర్: పరీక్షలో ఫెయిల్ అవుతానన్న బెంగతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది. సీఐ తెల్లబోయిన కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహ్మద్ అన్వర్, అంజుమ్‌బేగం దంపతుల కుమార్తె ఫిజా ఫిర్దౌజ్(15) స్థానిక వీఐపీ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. మార్చిలో వార్షిక పరీక్షలు రాసిన ఫిర్దౌజ్ ఫలితాల కోసం వేచిచూస్తోంది. కాగా రెండు రో జులుగా పరీక్షలు బాగా రాయలేదని ఆందోళన చెందుతుంది. ఈ భయంతో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫిజా ఫిర్దౌజ్ బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అన్వర్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్దబ్బాయి అమాన్ హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతుండగా రెండోబ్బాయి నౌమాన్ కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కూతురు ఫిజా ఫిర్దౌజ్ పదో తరగతి పూర్తిచేసింది. వార్షిక పరీక్షలు సక్రమంగా రాయలేదని గత రెండు రోజులుగా బెంగతో ఉందని కుటుంబీకులు తెలిపారు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు వేకువ జామున సహెర్ చేసి ఉపవాస దీక్ష పట్టి మళ్లీ నిద్రపోయారు. అయితే 9 గంటల ప్రాంతంలో ఫిర్దౌజ్ బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాత్రూం నుంచి పోగలు రావడంతో కుటుంబీకులు వెళ్లి చూసేసరికి పూర్తిగా కాలిపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ కిరణ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక తండ్రి అన్వర్ ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లె ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. పుంగనూరు సమీపంలోని సుగా లిమిట్టకు చెందిన కుమార్‌నాయక్ కుమారుడు ముఖేష్ నాయక్ కొలమాసనపల్లె హాస్టల్లో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సెలవు కావడంతో హాస్టల్ వద్దే ఉన్నాడు. సాయంత్రం స్టడీ క్లాస్‌కు వెళ్లకపోవడంతో వార్డన్ మధుసూదన్ ఆరాతీశారు. బాత్రూమ్ గడియపెట్టి ఉం డడంతో తీసిచూడగా లోపల కమ్మీకి ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారమివ్వగా, వారు సంఘటన స్థ లాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిందట బంగారుపాళెం హాస్టల్లో జరిగిన మోటివేషన్ క్లాస్‌లో ప్రసంగించిన ముఖేష్ మంచి మార్కులు తెచ్చుకుంటానని చెప్పినట్టు వార్డన్ తెలిపా రు. బాగా చదివే విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కా వ డం లేదని ఆయన అంటున్నారు. అయితే తనను సాకిన చిన్నాన్న గజేంద్రనాయక్ ఆత్మహత్యతో మానసిక వేదనకు గురై అత డు ఈ చర్యకు పాల్పడి ఉంటాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఎస్ఐ పూరేనాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ఫెయిలయ్యానన్న మనస్తాపం విషం తాగడంతో మృతి పార్వతీపురం: పదో తరగతి ఫెయిల్ కావడంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొమరాడ మండలం సోమినాయుడు వలస గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం ఏరియా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలివి. కొమరాడ మండలం సోమినాయుడు వలస గ్రామానికి చెందిన కొర్లాపు ప్రియాంక (15) మంగళవారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో లెక్కలు ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం విషం తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. స్కూల్ టాపర్ స్కూల్ టాపరైన ప్రియాంకకు అన్ని సబ్జెక్టుల్లో 9 పాయింట్లు వచ్చినా, లెక్కల్లో ఫెయిలైందని మృతురాలి అన్నయ్య కొర్లాపు లక్ష్మణరావు తెలిపాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మగతగా ఉందని, పడుకుంటానని చెప్పి కుప్పకూలిపోయిందన్నాడు. వెంటనే గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లి, పరిస్థితి విషమించడంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని తెలిపాడు. విషం ఎందుకు తీసుకుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విలపించిన కుటుంబ సభ్యులు మృతురాలి తండ్రి తవిటన్నదొర, అన్నయ్య లక్ష్మణరావులిద్దరూ జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. సోదరి ప్రమీల ఉంది. తల్లి మహాలక్ష్మి కూలి పనులు చేస్తోంది. ప్రియాంక ఆత్మహత్యతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి ప్రాంతమంతా విషాదం అలముకుంది. ప్రియాంకను ఆసుపత్రికి తెచ్చేసరికే నోటి వెంట నురగలొచ్చాయని ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ వెంకటరావు తెలిపారు. విషం తాగినప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, చికిత్స చేస్తుండగా మృతి చెందిందని తెలిపారు. అప్పటికే బాగా ఆలస్యమైందని స్పష్టం చేశారు. -
తక్కువ మార్కులు వచ్చాయని.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
సరూర్‌నగర్: పదవతరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం సూర్యాపేటకు చెందిన జంగయ్య కుటుంబం మీర్‌పేటలోని ఓల్ట్ విలేజ్‌లో అద్దెకుంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. జంగయ్య కూతురు త్రివేణి జిల్లెలగూడలోని చల్ల లింగారెడ్డి జిల్లాపరిషత్ పాఠశాలలో టెన్త్ చదివింది. శనివారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో తన స్నేహితులకు 9.5, 9.3 జీపీఏ రాగా.. త్రివేణికి 7.3 జీపీఏ వచ్చింది. స్నేహితుల కంటే తాను బాగా చదివేదాన్ని అని, తనకంటే వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని అదే రోజు సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మీర్‌పేటలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.