గువ్వల, రసమయి విమర్శ
సాక్షి, హైదరాబాద్: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎస్సీల ఎ,బి,సి,డి వర్గీకరణ చేయాలని నిర్ణయించినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ విషయాన్ని మరుగున పెట్టిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంగళవారం వారు విలేకరులతో మాట్లా డారు. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలపై సభ్యులు మాట్లాడుతున్న సంద ర్భంలో కొందరు సభ్యులు అభ్యంతరకరంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టిందన్నారు.
మాదిగ జాతి కోసం ఏకగ్రీవ తీర్మానం చేసిన ఘనత సీఎం కేసీ ఆర్‌కే దక్కుతుందన్నారు. పక్క రాష్టంలో ఇప్పటి వరకు కనీసం తీర్మానం చెయ్యలేదని, రేవంత్‌రెడ్డి తమ నేత, ఏపీ సీఎం చంద్ర బాబుతో తీర్మానం చేయిస్తే మాదిగ జాతి రేవంత్‌ను అక్కున చేర్చుకుంటుందన్నారు. దళితుల పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవా లని ఆరాట పడ్డ పార్టీలుగా టీడీపీ, కాంగ్రెస్ మిగిలాయన్నారు. కానీ వర్గీకరణను తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు.