ఎస్సీ వర్గీకరణ బిల్లు వద్దు | Leaders meets Ramdas Athawale on SC reservations | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ బిల్లు వద్దు

Published Mon, Aug 14 2017 2:48 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

Leaders meets Ramdas Athawale on SC reservations

కేంద్ర మంత్రి అఠావలేను కోరిన మాలమహానాడు
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలేను మాలమహానాడు నేతలు కోరారు. ఆదివారం అఠావలేను ఢిల్లీలో కలుసుకున్న ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. వర్గీకరణపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందని, ఇది ఇప్పట్లో తేలే అంశం కాదని ఆయన తమతో చెప్పారని చెన్నయ్య తెలిపారు.

వర్గీకరణను అడ్డుకోండి: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ రవీంద్రబాబును తెలంగాణ మాలమహానాడు నేతలు కోరారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పసుల రాంమూర్తి తదితరులు ఆదివారం ఆయనను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement