ఎస్సీ వర్గీకరణకు చొరవ చూపండి
వెంకయ్య నాయుడికి కడియం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల ఆమోదానికి చూపిన చొరవను ఎస్సీ వర్గీకరణలోనూ చూపాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఎంపీ బి.వినోద్‌కుమార్, తెలం గాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి,ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి మంగళవారం ఢిల్లీలో ఆయన.. వెంకయ్యను కలిశారు. ఏకీకృత సర్వీసుల ఆమోదానికి చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏకీకృత సర్వీసుల అమలుకు ఒక కమిటీ వేశాం.
భవిష్యత్తులో ఎలాంటి న్యాయ సమస్యలు లేకుండా పదోన్నతులు కల్పిస్తాం. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబం« దించి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దానిని కేంద్రానికి పం పాం. ఈ విషయంలోనూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని వెంకయ్య నాయుడిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు..’ అని పేర్కొన్నారు.