సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అందులో భాగంగానే 2014 నవంబర్ 29న వర్గీకరణను సమర్థిస్తూ అసెంబ్లీలో తీర్మానించామని చెప్పా రు. తీర్మాన ప్రతులను తాను ప్రధాని మోదీకి అందజేశానని తెలిపారు. శుక్రవారం ఎస్సీ వర్గీకరణ అంశంపై కడియం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘దండోరా ఉద్య మం ప్రారంభంలో వర్గీకరణపై కేంద్రం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అందులో కేసీఆర్ కూడా సభ్యుడు. ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా అమలు సాధ్యం కాకుంటే కనీసం తెలంగాణకు పరిమితం చేసి అను మతివ్వాలని కూడా ప్రధానిని కోరాం’’ అని చెప్పారు. వర్గీకరణపై అఖిలపక్ష బృందంతో కలుస్తామని కోరితే ప్రధాని అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. కానీ యూపీ ఎన్నికల నేపథ్యంలో చివరి క్షణంలో రద్దు చేశారన్నారు.
మళ్లీ ప్రయత్నించినా స్పందన లేదు
ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి నవంబర్ 6న దురదృష్టవశాత్తు చనిపోయారని.. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్తానని ఆ మరునాడే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని కడియం చెప్పారు.
దీనిపై అదే నెల 9న ప్రధానికి కేసీఆర్ లేఖ రాసినా.. ఎలాంటి సమాధానం రాలేదన్నారు. జీఈఎస్, మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చి నప్పుడూ దీనిపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. కానీ సమయం తక్కువగా ఉందని ప్రధాని స్పష్టం చేశారన్నారు. తర్వాత కూడా ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment