హైదరాబాద్: అక్షరమే ఆయుధమనే లక్ష్యం తో మాదిగల అభివృద్ధి దిశగా మలిదశ ఉద్య మం సాగుతోందని తెలంగాణ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. మంద కృష్ణ నేతృత్వంలో 23 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమంలో కార్యకర్తలపై వందలాది కేసులు మినహా సాధించే దేమీ లేదన్నారు. హైదరాబాద్ తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్స్‌లో సోమవారం మాదిగ అమరవీరుల శ్రద్ధాంజలి సభ నిర్వహించారు.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాటాకుల భాస్కర్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జెన్ను రమణయ్య పాల్గొన్నారు. వంగపల్లి మాట్లాడుతూ.. మంద కృష్ణ ఉద్యమ ద్రోహి అని అన్నారు. దాడుల సంస్కృతిని ప్రేరేపిస్తూ అమాయక కార్యకర్తలను బలి చేస్తున్నారన్నారు. భారతి చనిపోయిన వెంటనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఆమె కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేలా ప్రకటన చేయించామన్నారు. తామెవ రికీ అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించారని మేడి పాపయ్య మాదిగ అన్నారు. ఆదివారం జరిగిన ఘటనల్లో అమాయకులపై కేసులు ఎత్తేసి, మంద కృష్ణపై పీడీ యాక్టు ప్రయోగించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బినామీల పేరిట మందకృష్ణ కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని యాటాకుల భాస్కర్ విమర్శించారు. 19న కొలనుపాకలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment