ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాను మాలమహానాడు నేతలు కోరారు.
కుంతియాకు మాలమహానాడు వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాను మాలమహానాడు నేతలు కోరారు. అంతేకాకుండా వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కుంతియాను ఢిల్లీలో మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు కలసి వినతిపత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి వర్గీకరణ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కుంతియా హామీ ఇచ్చినట్టు చెన్నయ్య తెలిపారు.
మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా
వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. సంఘం అధ్యక్షుడు రాంమూర్తి మాట్లా డుతూ.. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే సహిం చబోమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.